Andhra Pradesh

News September 23, 2025

ఎస్పీని కలిసిన కడప జిల్లా రాజకీయ నేతలు

image

ఇటీవల కడప ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నచికేత్ విశ్వనాథ్‌ను జిల్లా రాజకీయ నేతలు మర్యాదపూర్వకంగా ఒకరి తర్వాత ఒకరు కలిశారు. వారంతా జిల్లాలో శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. ఎస్పీని కలిసిన వారిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు రవీంధ్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, కడప మేయర్ సురేశ్ బాబు ఉన్నారు.

News September 23, 2025

కాణిపాకం బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం..ఒకరి స్పాట్ డెడ్

image

చిత్తూరు జిల్లా కాణిపాకం బైపాస్ నాలుగు రోడ్ల వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతి చెందిన వ్యక్తి మూర్తిగారి గ్రామవాసిగా స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 23, 2025

MRKP: వచ్చే ఏడాది పులుల లెక్కింపు

image

నల్లమల్ల ఫారెస్ట్‌లోని వన్యప్రాణులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని మార్కాపురం DFO మహమ్మద్ రఫీ తెలిపారు. ‘ఎకో టూరిజంలో గైడ్లను ఏర్పాటు చేసి అడవుల ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తాం. వచ్చే ఏడాది కేంద్ర బృందం ఆధ్వర్యంలో ట్రాప్ కెమెరాల ద్వారా పులుల లెక్కింపు జరుగుతుంది’ అని వెల్లడించారు.

News September 23, 2025

కడియం: అమ్మవారికి 95 కిలోల లడ్డూ

image

కడియం శ్రీదేవి చౌక్ సెంటర్‌లో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, అదే గ్రామానికి చెందిన ఎన్.నానాజీ అమ్మవారికి లడ్డూ సమర్పించారు. 95 కిలోల భారీ లడ్డూను మంగళవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సమర్పించారు. ఈ లడ్డూను 10 రోజులపాటు అమ్మవారి వద్ద ఉంచుతామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.

News September 23, 2025

విశాఖలో రెండో రోజు జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు

image

నగరంలోని నోవాటెల్ హోటల్‌లో 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు రెండో రోజు కొనసాగింది. సదస్సులో భాగంగా ‘సివిల్ సర్వీసెస్ & డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్’ అంశంపై మూడో ప్లీనరీ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్‌కు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సెక్రటరీ రష్మీ చౌదరి ప్రధాన వక్తగా వ్యవహరించారు. చర్చలో పలు రాష్ట్రాల ఉన్నతాధికారులు పునీత్ యాదవ్, మోహన్ ఖంధార్, అహ్మద్ బాబు, ఎస్.సాంబశివరావు, పీయూష్ సింగ్లా పాల్గొన్నారు.

News September 23, 2025

కనకదుర్గమ్మను దర్శించుకున్న మన ఎమ్మెల్యేలు

image

దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మను మంత్రి సవిత, రాప్తాడు MLA పరిటాల సునీత, శింగనమల MLA బండారు శ్రావణి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

News September 23, 2025

దసరా ఉత్సవాలకు రావాలని కడప ఎస్పీకి ఆహ్వానం

image

మైదుకూరులో 11 రోజులు అమ్మవారి దసరా ఉత్సవాలు జరగనున్నాయి. వీటికి హాజరు కావాలని కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌ను ఆర్యవైశ్య సభ కార్యవర్గ సభ్యులు కోరారు. ఈ మేరక ఆయనకు ఆహ్వాన పత్రికను అందించి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ మైదుకూరు ఉపాధ్యక్షుడు దొంతు వెంకటసుబ్బయ్య, సెక్రటరీ అశోక్, జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఏలిశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

News September 23, 2025

గిద్దలూరులో పుట్టిన బిడ్డను వదిలేసిన తల్లి

image

గిద్దలూరులో అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ ప్రైవేటు వైద్యశాలకు సోమవారం అర్ధరాత్రి ప్రసవ వేదనతో ఓ గర్భిణీ వచ్చింది. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో టాయిలెట్ వద్ద మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆ బిడ్డను అక్కడే వదిలి వెళ్లిపోయింది. వైద్య సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ మహిళ ఎవరు? ఎందుకు అలా చేసింది? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.

News September 23, 2025

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు

image

భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి బ్యారేజీకి వరద నీరు వచ్చి చేరుతోంది. మంగళవారం ఉదయం వరకు బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 3,37,525 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. కెఈ మెయిన్, కె డబ్ల్యు మెయిన్‌లకు 8,035, 5,009, కెనాల్స్‌కు 13,044 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ వద్ద నీటిమట్టం 12 అడుగులుగా ఉంది.

News September 23, 2025

కడప జిల్లా డీఎస్సీ అభ్యర్థులకు గమనిక

image

కడప జిల్లాలో డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 25వ తేదీ గురువారం విజయవాడలో నియామక పత్రాలు ఇవ్వనున్నారు. కడపలోని ఆర్ట్స్ కాలేజీ నుంచి విజయవాడకు బస్ ఏర్పాటు చేశారు. అభ్యర్థులంతా బుధవారం ఉదయం 6 గంటలకు తమ గుర్తింపు కార్డుతో ఆర్ట్స్ కాలేజీ వద్దకు రావాలని డీఈవో శంషుద్దీన్ సూచించారు.