India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హిరమండలం మండలం పాత హీరమండలం గ్రామానికి చెందిన కుమ్మరి బాలా మాధురి (15) బుధవారం ఉదయం వంశధార నదికి తన స్నేహితులతో స్నానానికి వెళ్లింది. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం తన స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లి కుమార్తె విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలిక మరణంతో గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి.
మైదుకూరు నియోజకవర్గంలో దాదాపు 7 దశాబ్దాల నుంచి ఒక రికార్డు ఉంది. ఇక్కడ ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరగగా, అందరూ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే MLAలు కావడం విశేషం. మొదటగా రామారెడ్డి, నారాయణరెడ్డి గెలిచారు. అనంతరం నాగిరెడ్డి రెండు పర్యాయాలు గెలిచారు. డీఎల్ రవీంద్రారెడ్డి 6, శెట్టిపల్లె రఘురామిరెడ్డి 4 సార్లు గెలిచారు. అయితే ఈసారి TDP కూటమి నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ గెలిచి చరిత్ర సృష్టిస్తారా?
కంచికచర్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది. దోనబండ క్వారీలో ఉన్న నీటి గుంతలో పడి ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఒడిశాకు చెందిన అక్కాచెల్లెళ్లు క్వారీ వద్ద బట్టలు ఉతుకుతుండగా వారిలో ఒకరు కాలు జారి పడిపోయారు. ఆమెను కాపాడబోయి మరో మహిళ గుంతలో పడిపోయింది. ఆపై ఊపిరాడక వారిద్దరూ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
సర్వేపల్లిలో 2019 ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి 13973 ఓట్ల మెజార్టీతో గెలిచారు. నోటా 2782 ఓట్లతో మూడో స్థానంలో నిలవడం విశేషం. ఆ తర్వాత స్థానాల్లో జనసేన(1913 ఓట్లు), కాంగ్రెస్(1420), బీజేపీ(1420) అభ్యర్థులు నిలిచారు. 5, 6 స్థానాలకు పరిమితమైన జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీకి సమాన ఓట్లు దక్కాయి.
చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మదనపల్లె పట్టణంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. నీరుగట్టుపల్లె చౌడేశ్వరినగర్‌కు చెందిన అశోక్ బాబు(34) చేనేత కార్మికుడు. అతని భార్య కువైట్‌కు వెళ్లింది. స్థానికంగా ఉన్న ఎరుకలరెడ్డి వద్ద అశోక్ కూలి మగ్గం నేస్తాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో అతడిని ఎరుకలరెడ్డి కొట్టారు. ఈ అవమానం తట్టుకోలేక అశోక్ నిద్రమాత్రలు మింగి చనిపోయాడు.
శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలంలోని కుప్పిలి గ్రామంలో పశువుల పాకపై సోమవారం అర్ధరాత్రి పిడుగు పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో అలుపున సీతయ్యకు చెందిన మూడు పాడి ఆవులు మృతి చెందాయి. పాలు అమ్మకం ద్వారా జీవనం సాగిస్తున్న ఈ కుటుంబానికి ఒక్కసారి రూ.2 లక్షలు వరకు నష్టం వాటిల్లడంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో సందర్భంగా మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. * RTC వై జంక్షన్ – బెంజిసర్కిల్ వరకు ఎంజీ రోడ్డుపై వాహనాలు అనుమతించరు. * ఎంజీ రోడ్డుపై ప్రయాణించే వాహనాలను ఏలూరు రోడ్డు, 5వ నంబర్ రూట్‌కు మళ్లిస్తారు. * ఆటోనగర్ వైపు నుంచి బస్టాండ్ వెళ్లే వాహనాలు ఆటోనగర్ గేటు, పటమట, కృష్ణవేణి స్కూల్ రోడ్డు, స్క్యూ బ్రిడ్జి, కృష్ణలంక మీదుగా ప్రయాణించాలి.
1962 నాటికి రాజోలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. అప్పుడు గడ్డం మహలక్ష్మి 30,460 ఓట్లతో కాంగ్రెస్ MLA గా గెలిచారు. అదే సమయంలో పక్క నియోజకవర్గం నగరంలో మామిడికుదురుకు చెందిన నయినాల గణేశ్వరరావు కూడా విజయం సాధించారు. 1967 ఎన్నికల్లో రాజోలు జనరల్‌గా, నగరం ఎస్సీ నియోజకవర్గంగా మారిపోయాయి. దీంతో మహాలక్ష్మిని నగరం నుంచి, గణేశ్వరరావును రాజోలు నుంచి కాంగ్రెస్ బరిలో దింపగా.. అప్పుడూ ఇద్దరు గెలిచారు.
మధ్యాహ్నం 2 – రాత్రి 9 గంటల వరకు <<13204379>>ట్రాఫిక్ ఆంక్షలు<<>>
* మచిలీపట్నం- విజయవాడ మధ్య తిరిగే బస్సులు ఆటోనగర్ గేటు, మహానాడు రోడ్డు, రామవరప్పాడు రింగ్, పడవల రేవు, BRTS రోడ్డు, సీతన్నపేట గేట్, ఏలూరు లాకులు, పాత ప్రభుత్వాసుపత్రి రూట్‌లో వెళతాయి. * ఏలూరు- విజయవాడ మధ్య తిరిగే ఆర్టీసీ బస్సులు రామవరప్పాడు రింగ్, పడవలరేవు, BRTS రోడ్డు, సీతన్నపేట గేట్, ఏలూరు లాకులు, పాత ప్రభుత్వాసుపత్రి రూట్‌లో వెళతాయి.
మధ్యాహ్నం 2 – రాత్రి 9 గంటల వరకు <<13204379>>ట్రాఫిక్ ఆంక్షలు<<>>
* వైజాగ్ – హైదరాబాద్ మధ్య <<13204421>>రాకపోకలు<<>> సాగించే భారీ వాహనాలు హనుమాన్ జంక్షన్, తిరువూరు, మైలవరం, ఇబ్రహీంపట్నం రూట్‌లో వెళ్లాలి.
* వైజాగ్- చెన్నై మధ్య ప్రయాణించే భారీ వాహనాలు హనుమాన్‌జంక్షన్, గుడివాడ, పామర్రు, చల్లపల్లి, పులిగడ్డ, రేపల్లె, బాపట్ల, త్రోవగుంట మార్గంలో వెళ్లాలి.
Sorry, no posts matched your criteria.