India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాయలసీమ విశ్వవిద్యాలయ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలకు సంబంధించి బీటెక్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు వీసీ సుధీర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు. గతేడాది డిసెంబరులో రెగ్యులర్ 1, 3, 5వ సెమిస్టర్లు, ఈ ఏడాది జనవరిలో జరిగిన అన్ని సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఫలితాల కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
విశాఖ ఎంపీ స్థానానికి 1952 నుంచి ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరగ్గా.. 1960లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయానంద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1991లో TDP అభ్యర్థి ఎంవీవీఎస్ మూర్తి 5,138 ఓట్ల మెజార్టీతో గెలిచారు. నియోజకవర్గ చరిత్రలో ఇదే అత్యల్ప మెజార్టీ. 1984లో TDP అభ్యర్థి బాట్టం శ్రీరామమూర్తి.. కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి అప్పలస్వామిపై 1,40,431 ఓట్ల అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు.
ఎన్నికల నేపథ్యంలో మద్యంకు భారీ డిమాండ్ నెలకొంది. ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీలు మద్యం పంపిణీకి రంగం సిద్ధం చేయడంతో కొరత ఏర్పడింది. ముందుగానే ప్రభుత్వ మద్యం షాపుల్లో, ప్రైవేటు మాల్స్‌లో కొనుగోలు చేసి నిల్వలు ఉంచిన్నట్లు తెలుస్తోంది. పరిమితంగానే అమ్మకాలు జరగాలనే సంబంధిత శాఖ ఆదేశాలు ఉన్నాయి. చుక్కలేక మద్యం ప్రియులు అల్లాడిపోతున్నారు. పాలకొల్లులోని ప్రభుత్వ మాల్స్‌లో నిల్వలు లేక వెలవెలబోతున్నాయి.
మార్కాపురం మండలంలోని మాల్యవంతునిపాడు గ్రామంలో పిడుగుపాటుకు గురై గొర్రెలు మృతి చెందాయి. స్థానికుల వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి గ్రామానికి చెందిన పలువురి గొర్రెల మందపై పిడుగు పడింది. దాదాపు 100 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దీంతో సుమారు రూ.8 లక్షల దాకా నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు.
నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పొందేందుకు గిరిజన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి కోరారు. విదేశాల్లో పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టర్ రీసెర్చ్ ప్రోగ్రామ్, ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎంపికైన గిరిజన అభ్యర్థులు ఈనెల 31వ తేదీలోపు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ www.overseas.tribal.in వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కాకినాడ జిల్లాలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5-18 ఏళ్లలోపు బాలలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రధానం చేసేందుకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని ఐసీడీఎస్ ప్రాజెక్టు కో డైరెక్టర్ ప్రవీణ మంగళవారం తెలిపారు. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, ధైర్య సాహసాలు, పర్యావరణం, క్రీడలు, సాహిత్యం, సంగీతం, నృత్యం తదితర వాటిలో ప్రతిభ చూపిస్తున్న బాలలు జూలై 31 లోగా ఆన్లైన్ దరఖాస్తులు పంపాలన్నారు.
జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజు నుంచి మే 6వ తేదీ వరకు 4062 మంది వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేశారు. మరో 42 మందిని అధికారులే తొలగించారు. కాగా జిల్లాలో 13 వేల మంది వాలంటీర్లు ఉన్నారు. అత్యధికంగా నెల్లూరు సిటీ, సర్వేపల్లి, కోవూరు, కావలి నియోజవర్గాల్లో వాలంటీర్లు రాజీనామాలు సమర్పించారు.
వైసీపీలో చేరిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి ఆమె కుమార్తె క్రాంతి వ్యవహారం సొంత జిల్లాలో రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కుంటున్నారు. సొంత కూతురే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడంతో వైసీపీలో కలవరం మొదలయ్యింది. పిఠాపురంలో వైసీపీ విజయానికి కలసివస్తారని భావించిన ముద్రగడ ఇప్పడు తమకు ఇబ్బందికరంగా మారడంతో వంగా గీతా వర్గం డైలమాలో పడినట్లు తెలుస్తోంది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ రిటైర్డ్ ఉద్యోగి ఓటు హక్కు ప్రాధాన్యతను వినూత్న రీతిలో వ్యక్తపరిచారు. తన ఇంటి ముందు గోడకు ‘ఓటుకు ఎలాంటి కానుకలు తీసుకోబడవు. భారత రాజ్యాంగాన్ని కాపాడుదాం’ అంటూ జిరాక్స్ పేపర్లు అంటించారు. పట్టణంలోని బుగ్గయ్య కాంపౌండ్ వీధికి చెందిన ఎస్బీఐ రిటైర్డ్ ఉద్యోగి దూదేకుల షాషావలి ఈ వినూత్న ప్రచారానికి తెరతీశారు.
పీలేరు నియోజకవర్గం కలికిరిలో ఇవాళ సాయంత్రం మోదీ బహిరంగ సభ జరగనుంది. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3.35 గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కలికిరిలోని సైనిక్ స్కూల్ వద్దకు వెళ్తారు. బహిరంగ సభ అనంతరం తిరిగి సాయంత్రం 5.20 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి విజయవాడకు వెళ్తారు.
Sorry, no posts matched your criteria.