India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో మంగళవారం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో 3.1 లీటర్ల మద్యం, ప్రత్తిపాడు పరిధిలో 142.52 లీటర్ల మద్యం జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు. తాడికొండ పరిధిలో రూ.1.05 లక్షల నగదు, పొన్నూరు పరిధిలో 21.96 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు. జిల్లాలో మే 7వ తేది వరకు రూ.3,19,49,811 విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేశామన్నారు.
ఉమ్మడి కడప జిల్లా పునర్విభజనలో రాజంపేట నియోజకవర్గం రెండు జిల్లాల్లో భాగమైంది. ఇక్కడ ఒంటిమిట్ట, సిద్దవటం కడప జిల్లాలో కలవగా, నందలూరు, వీరబల్లె, రాజంపేట అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి. విశేషం ఏటంటే సిద్దవటం, ఒంటిమిట్ట కడపలో కలిసిన ప్రజలు మాత్రం రాజంపేట నియోజకవర్గంలో ఓట్లు వేస్తారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ 9 సార్లు, TDP 4 సార్లు, YCP 2 సార్లు, సీపీఐ నుంచి ఒకరు, మూడు సార్లు స్వతంత్రులు ఎన్నికయ్యారు.
NOTA గురించి అందరికీ తెలిసిందే. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు ఓటర్లు ఓటు వేయొద్దనుకుంటే NOTAకు వేయొచ్చు. ఈ అవకాశం 2013 నుంచి ఉండగా.. గత ఎన్నికల్లో బనగానపల్లె నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని ఎక్కువ మందే వినియోగించుకున్నారు. వరుసగా YCP (99,998), TDP (86,614), కాంగ్రెస్(2,166) ఓట్లు పడగా.. NOTAకు 1,628 ఓట్లు వేశారు. జనసేన పార్టీకి 1,512 ఓట్లు పోలయ్యాయి. మీరెపుడైనా నోటాకు ఓటేశారా?
ఉదయగిరి సీటు గెలుచుకున్న పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టే సెంటిమెంట్ 1999 నుంచి కొనసాగుతోంది. 1999లో కంభం విజయరామిరెడ్డి(టీడీపీ), 2004, 2009లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(కాంగ్రెస్) విజయం సాధించారు. 2014లో బొల్లినేని రామారావు(టీడీపీ), 2019లో చంద్రశేఖర్ రెడ్డి(వైసీపీ) గెలుపొందారు. సెంటిమెంట్ ప్రకారం 1999, 2014లో టీడీపీ, 2004, 09లో కాంగ్రెస్, 2019లో వైసీపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మరి ఈసారి ఎవరో.?
వ్యవసాయ కళాశాల నైర ఫారంలో ఖరీఫ్ 2024కు గాను నేటి నుంచి వరి విత్తనాలు విక్రయిస్తున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ ఎం. భరతలక్ష్మి తెలిపారు. స్వర్ణ (ఎంటీయూ 7029), సాంబ మసూరి (బీపీటీ 5204) మారుటేరు సాంబ (ఎంటీయూ 1224), శ్రీధృతి (ఎంటీయూ 1121), శ్రీకాకుళం సన్నాలు (ఆర్ జీ ఎల్ 2537) మొదలగు రకాలు విక్రయాలకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
కైకలూరు అసెంబ్లీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌కు మద్దతుగా సినీ హీరో వెంకటేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు కూటమి నాయకులు తెలిపారు. బుధవారం కలిదిండి మండలం కోరుమల్లులో సాయంత్రం 5 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతందన్నారు. వేమవరప్పాడు, తామరకొల్లు, వింజరం, ఆచవరం గ్రామాల మీదుగా కైకులూరుకు చేరుకుని హీరో వెంకటేష్ అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లడతారన్నారు. కూటమి శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తూ.గో జిల్లాలో ఎన్నికల్లో అభ్యర్థుల విజయంపై పందేలు కడుతున్నారు. మండల స్థాయిలో మెజార్టీలు నుంచి రాష్ట్రస్థాయిలో ఏ పార్టీకి మెజారిటీ వస్తుందన్న విషయంపై పందేలకు తెరలేపారు. రాష్ట్రంలో హాట్ సీట్‌గా మారిన పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో గెలుపుపై బెట్టింగ్ రాయుళ్లు కోట్లతో సై అంటున్నారు.దీనిపై పోలీసులు కూడా నిఘా పెట్టినట్లు సమాచారం.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని కూటమి అభ్యర్థులకు నవతరం పార్టీ మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. జనసేన అధినేత పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే నిర్ణయాన్ని సమర్థిస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఎన్డీఏకి మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. రావు సుబ్రహ్మణ్యం మంగళగిరి, చిలకలూరిపేటలో నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.
NLR: జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ తెలిపారు. క్రీడలు, సామాజిక సేవారంగం, ధైర్య సాహసాలు, నూతన ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక సంప్రదాయాలు, శాస్త్ర సాంకేతికత, విజ్ఞాన రంగాల్లో ప్రతిభ చూపిన బాలబాలికలు ఈ నెల 31వ తేదీ లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
ఎన్నిక కమీషన్ ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది 8వ తేదీ (బుధవారం) కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు నమోదు చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మంగళవారం తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం-12 ఆర్ఓ వద్ద సబ్మిట్ చేసి 5, 6, 7 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోలేక పోయిన ఎన్నికల అధికారులు, సిబ్బంది తమకు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.