India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని B.A. LL.B కోర్సు చదువుతున్న విద్యార్థులు రాయాల్సిన నాలుగవ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 25,27,30, ఆగస్టు 1వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

టీడీపీ కోసం కష్టపడి పని చేసిన వారిని గుర్తించి పదవులిచ్చే బాధ్యత తనదేనని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. కుప్పం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో కార్యకర్తలను ఎంతగా హింసించినా ఆత్మస్థైర్యం కోల్పోలేదన్నారు. పార్టీ కోసం సైనికుల్లా పని చేశారని ప్రశంసించారు.

పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. గుంటూరు జిల్లాలో మొత్తం 4,283 మంది పరీక్షలు రాయగా.. 3,044 మంది పాసయ్యారు. పాసైన వారిలో బాలురు 1878 మంది, బాలికలు 1166 మంది ఉన్నారు. 71.07% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో గుంటూరు జిల్లా 13వ స్థానంలో నిలిచింది.

వినుకొండ మండలంలోని శివాపురం వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫోర్ విల్ ఆటో- ద్విచక్ర వాహనం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మీరావలి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నాసర్ అనే మరో యువకుడికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

చిరుత దాడిలో మేక హతమైన సంఘటన పోలవరం మండలంలో కలకలం రేపింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీ క్షేత్ర అధికారి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సున్నాలగండి గ్రామానికి చెందిన కోటేశ్వరరావు తన పశువుల పాకలో కట్టేసిన మేక కనిపించడం లేదని సమీప అటవీ ప్రాంతంలో వెతికాడు. తల లేకుండా మొండెంతో ఉన్న మేక కళేబరం కనిపించింది. పాదముద్రల ఆధారంగా చిరుత దాడి జరిగినట్లుగా అధికారుల తేల్చారు.

యూబీ కంపెనీ నెలకు రూ.1.50 కోట్లు కట్టాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే అనుచరులు డిమాండ్ చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. ‘ఇవ్వలేమని కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో ఫ్యాక్టరీపై దాడి చేశారు. మద్యం బయటికి వెళ్లకుండా అడ్డగించారు. మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుల అండతో పచ్చ ముఠా బెదిరింపులకు దిగుతోంది’ అని వైసీపీ ‘X’లో ట్వీట్ చేసింది.

ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాగుంట ప్రధానిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కాసేపు చర్చించనట్లు ఆయన వివరించారు.

> టెన్త్ అడ్వాన్స్‌డ్, ఇంటర్ ఫస్టియర్ సప్లి ఫలితాలు విడుదల
> సున్నిపెంటలో ఎమ్మెల్యేకి కూటమి నాయకుల ఘన స్వాగతం
> కొంత టైమ్ ఇస్తాం.. తర్వాత ఉద్యమాలు: కాటసాని
> నందికొట్కూరులో వర్షం
> మంత్రిగా బీసీ బాధ్యతలు
> అధైర్య పడొద్దు, అండగా ఉంటా: శిల్పా
> చిరుతని పట్టుకోవాలని పచ్చర్లవాసుల రాస్తారోకో
> ఆదోనిలో రౌడీయిజానికి చోటులేదు: ఎమ్మెల్యే
➽ ఉమ్మడి జిల్లా పూర్తి సమాచారంకై లొకేషన్‌పై క్లిక్ చేయండి

పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. గుంటూరు జిల్లాలో మొత్తం 4,283 మంది పరీక్షలు రాయగా.. 3,044 మంది పాసయ్యారు. పాసైన వారిలో బాలురు 1878 మంది, బాలికలు 1166 మంది ఉన్నారు. 71.07% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో గుంటూరు జిల్లా 13వ స్థానంలో నిలిచింది.

పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో నెల్లూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. 4,383 మంది పరీక్షలు రాయగా 3,438 మంది పాసయ్యారు. 78.44 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో నెల్లూరు 8వ స్థానంలో నిలిచింది. జిల్లాలో అబ్బాయిల ఉత్తీర్ణత శాతం(76.98) కంటే అమ్మాయిల (80.83) పాస్ పర్సంటేజీ ఎక్కువ కావడం విశేషం. మరోవైపు తిరుపతి జిల్లాలో 3,100 మందికి 2,195 మంది పాసై 14వ స్థానంలో నిలిచారు.
Sorry, no posts matched your criteria.