Andhra Pradesh

News May 8, 2024

పెద్దిరెడ్డీ నీ కథ తేలుస్తా: చంద్రబాబు

image

నిన్న పుంగనూరులో జరిగిన సభలో మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘పెద్దిరెడ్డి రూ.30 వేల కోట్ల అవినీతి చేశారు. అంగళ్లు నుంచి నేను వస్తుంటే పుంగనూరులో గొడవలు చేయించాడు. 450 మందిని జైలులో పెట్టించాడు. ఆ రోజు నా గుండె రగిలిపోయింది. పెద్దిరెడ్డీ నీ కథ తేలుస్తా. మీకు నిద్రలేని రాత్రులు చూపిస్తా. నా కార్యకర్తలు ఎంత క్షోభ అనుభవించారో మిమ్మల్నీ అంతే క్షోభ పెడతా’ అని బాబు అన్నారు.

News May 8, 2024

విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపులు.. (2/3)

image

మధ్యాహ్నం 2 – రాత్రి 9 గంటల వరకు <<13204379>>ట్రాఫిక్ ఆంక్షలు<<>>
* మచిలీపట్నం- విజయవాడ మధ్య తిరిగే బస్సులు ఆటోనగర్‌ గేటు, మహానాడు రోడ్డు, రామవరప్పాడు రింగ్‌, పడవల రేవు, BRTS రోడ్డు, సీతన్నపేట గేట్‌, ఏలూరు లాకులు, పాత ప్రభుత్వాసుపత్రి రూట్‌లో వెళతాయి. * ఏలూరు- విజయవాడ మధ్య తిరిగే ఆర్టీసీ బస్సులు రామవరప్పాడు రింగ్‌, పడవలరేవు, BRTS రోడ్డు, సీతన్నపేట గేట్‌, ఏలూరు లాకులు, పాత ప్రభుత్వాసుపత్రి రూట్‌లో వెళతాయి.

News May 8, 2024

నేడు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు (1/3)

image

విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో సందర్భంగా మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. * RTC వై జంక్షన్‌ – బెంజిసర్కిల్‌ వరకు ఎంజీ రోడ్డుపై వాహనాలు అనుమతించరు. * ఎంజీ రోడ్డుపై ప్రయాణించే వాహనాలను ఏలూరు రోడ్డు, 5వ నంబర్‌ రూట్‌కు మళ్లిస్తారు. * ఆటోనగర్‌ వైపు నుంచి బస్టాండ్‌ వెళ్లే వాహనాలు ఆటోనగర్‌ గేటు, పటమట, కృష్ణవేణి స్కూల్‌ రోడ్డు, స్క్యూ బ్రిడ్జి, కృష్ణలంక మీదుగా ప్రయాణించాలి.

News May 8, 2024

కోడూరు: ఎన్డీఏకి మద్దతుగా జబర్దస్త్ టీం ప్రచారం

image

ఓబులవారిపల్లి మండలం, చిన్నంపల్లి పంచాయతీలోని పలు గ్రామాల్లో జబర్దస్త్ సద్దాం టీం కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్, పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని వారు ప్రజలను కోరారు. సద్దాం వెంట పలువురు నటులు ఉన్నారు. కాగా కొందరు సినీ నటులు జనసేనకు మద్దుతు ఇస్తున్న సంగతి తెలిసిందే.

News May 8, 2024

శ్రీకాకుళంలోనే అత్యధిక సర్వీస్ ఓట్లు

image

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 68,185 మంది సర్వీస్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. వారిలో శ్రీకాకుళం జిల్లా నుంచే అత్యధికంగా 16,448 మంది ఉన్నారు. నేవీ, ఆర్మీ ఎయిర్‌పోర్స్‌తో పాటు సాయుధ దళాలో ఈ జిల్లా నుంచే ఎక్కువ మంది ఎంపికై సేవాలందిస్తుంటారు. పలాసలో 3,030, టెక్కలి 2,919, ఆమదాలవలస 2,240 నరసన్నపేటలో 2,228 మంది ఓటర్లు నమోదు చేస్తుకున్నారు.

News May 8, 2024

విశాఖ: ఆధునీకరణ కారణంగా పలు రైళ్లు రీషెడ్యూల్

image

ఆధునీకరణ పనులు కారణంగా పలు రైళ్లను రీ షెడ్యూల్ చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈనెల 7వ తేదీ రాత్రి 7 గంటలకు చెన్నైలో బయలుదేరాల్సిన చెన్నై సెంట్రల్-హావ్ డా మెయిల్ ఎక్స్ప్రెస్ రాత్రి 8.30 గంటలకు బయలుదేరిందన్నారు. సా. 4:30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరాల్సిన సికింద్రాబాద్-భువనేశ్వర్-విశాఖ ఎక్స్ప్రెస్ 5:50 గంటలకు బయలుదేరినట్లు మార్పులు చేసినట్లు తెలిపారు.

News May 8, 2024

సింహాచలం: నేడు కూడా అందుబాటులో చందనోత్సవ టికెట్లు

image

సింహాచలం శ్రీ వరహలక్ష్మి నృసింహ స్వామి ఆలయంలో ఈనెల పదవ తేదీన జరిగే చందనోత్సవానికి సంబంధించి రూ. 300 టిక్కెట్ల విక్రయాలు బుధవారం సాయంత్రం వరకు పొడిగించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఆన్ లైన్‌తో పాటు సింహాచలం నగరంలోని మహారాణిపేట అక్కయ్యపాలెం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లలో సింహాచలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో టిక్కెట్లు పొందవచ్చునని అన్నారు.

News May 8, 2024

విజయవాడలో ప్రధాని మోదీ పర్యటన ఇలా..

image

విజయవాడలో రోడ్ షో సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం సాయంత్రం 6.30గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకి చేరుకుంటారు. స్క్యూ బ్రిడ్జి దాటిన తర్వాత వెటర్నరీ జంక్షన్ మీదుగా పీవీపీ మాల్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి 1.5 కి.మీ దూరంలో ఉన్న బెంజ్ సర్కిల్ దాకా.. రాత్రి 7 నుంచి 8 వరకు రోడ్ షో నిర్వహిస్తారు. మోదీ పర్యటన నేపథ్యంలో ప్రతి 50 మీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేశారు.

News May 8, 2024

యలమంచిలి: ఫ్లయింగ్ స్క్వాడ్‌పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

image

యలమంచిలి మండలం పెనుమర్రు గ్రామంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇలపకుర్రు గ్రామానికి చెందిన కొండేటి దుర్గాప్రసాద్‌పై 114/2024 U/s 188, 353,341,332,506,427 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విధుల్లో ఉన్న వారిపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అన్నారు.

News May 8, 2024

ఈనెల 9 నుంచి ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అనంతపురం ఐటీఐ ప్రిన్సిపల్ రామమూర్తి తెలిపారు. ఈనెల 9వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. ఐటీఐ ద్వారా అనేక ఉపాధి అవకాశాలు లభించడానికి అధిక అవకాశాలు ఉన్నాయన్నారు.