Andhra Pradesh

News June 26, 2024

విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గింది?

image

విజయనగరం జిల్లాలో పురుషుల కంటే మ‌హిళ‌ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, విద్యార్థుల్లో బాలికల నిష్పత్తి ఎందుకు త‌గ్గుతోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ ప్ర‌శ్నించారు. దీనిపై అధ్య‌య‌నం చేసి, వారం రోజుల్లో త‌న‌కు నివేదిక స‌మ‌ర్పించాల‌ని విద్యాశాఖ‌ను ఆదేశించారు. విద్య‌, అనుబంధ‌ సంక్షేమ వసతిగృహాలపై తన ఛాంబర్‌లో బుధవారం సమీక్షించారు.

News June 26, 2024

సాలూరు ప్రజలకు రైలు సౌకర్యం ఎప్పుడు?

image

సాలూరు నుంచి ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు 6 లైన్ల రహదారి తయారవుతుంది కానీ.. రైలు పట్టాలు సరిచేయడం లేదు. విద్యుదీకరణ పూర్తయి ఏళ్లు గడుస్తున్నా రైలు మాత్రం పట్టాలెక్కడం లేదు. గత దసరాకు సాలూరు నుంచి విశాఖకు రైలు వేస్తున్నామని ట్రైల్ రన్ కూడా నిర్వహించారు. కానీ ఇంతవరకు రియల్ రన్ లేదు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం కేంద్రంతో చర్చించి ఈ సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

News June 26, 2024

స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన తోలాపి విద్యార్థి

image

పొందూరు మండలం తోలాపి గ్రామానికి చెందిన అన్నెపు శేషాద్రి నాయుడు 150 మార్కులతో ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈయన తండ్రి ధర్మారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తోలాపి సర్పంచ్ రాధాకృష్ణ, ఉప సర్పంచ్ శ్రీనివాసరావు, ఎంపీటీసీ కళ్యాణి, జనసేన ఉపాధ్యక్షుడు బాలకృష్ణ, నాయకులు, గ్రామ ప్రజలు శేషాద్రి నాయుడును అభినందించారు.

News June 26, 2024

శ్రీకాకుళం: పీజీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో మే-2024లో నిర్వహించిన MSC నాలుగవ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ results.andhrauniversity.edu.in/ చెక్ చేసుకోవాలని ఆంధ్ర యూనివర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News June 26, 2024

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల

image

ప.గో జిల్లా పాలకొల్లులోని 18వ వార్డుకు చెందిన 13నెలల పాప వైద్యానికి ఇచ్చిన మాటను మంత్రి నిమ్మల రామానాయుడు నిలబెట్టుకున్నారు. విజయవాడలోని ఆస్పత్రికి వెళ్లి చిన్నారి అక్షరను చూశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆ పాపకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులతో మాట్లాడారు. వార్డులోకి వెళ్లి ఆ చిన్నారి తల్లిదండ్రులను పలకరించారు. సీఎం సహాయ నిధి మంజూరు కోసం నిమ్మల గతంలోనే ఫోన్ చేసి మాట్లాడిన విషయం తెలిసిందే.

News June 26, 2024

సింహాద్రి అప్పన్న హుండీ లెక్కింపు

image

సింహగిరిపై వెలసిన శ్రీ సింహాద్రి అప్పన్న ఆలయ హుండీ లెక్కింపు బుధవారం చేపట్టారు. 28 రోజులు గాను అప్పన్నకు ఉండి ద్వారా రూ.2,50,52,507/- ఆదాయం లభించింది. సగటు ఆదాయం 1 రోజుకు రూ:8,94,732/- లక్షలు చొప్పున హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. కానుకల రూపములో వెండి, బంగారంతో పాటు విదేశీ కరెన్సీ కూడా హుండీలో వచ్చినట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమం ఆలయ ఈవో శ్రీనివాస మూర్తి ఆధ్వర్యంలో చేపట్టారు.

News June 26, 2024

గుంటూరు: కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ తుషార్

image

నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాగలక్ష్మి సెల్వరాజన్ బుధవారం ఎస్పీ తుషార్ కలిసి పుష్ప గుచ్చం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రాజకుమారి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రభాకర్ జైన్, జిల్లా రెవెన్యూ డివిజన్ అధికారి రోజా, జిల్లాలోని ఇతర అధికారులు నూతన కలెక్టర్ నాగలక్ష్మికి బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

News June 26, 2024

మీ సేవల నిర్వాహకులకు న్యాయం చేస్తాం: పల్లా

image

గత ప్రభుత్వం మీ సేవలను నిర్వీర్యం చేసిందని మీసేవా నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కలిసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీ సేవ నిర్వాహకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నెల రోజుల్లో మీ సేవ నిర్వాహకులకు పూర్తిగా న్యాయం చేస్తామన్నారు.

News June 26, 2024

త్వరలో నామినేటెడ్ పదవులు.. రేసులో ఉన్నదెవరు?

image

త్వరలోనే నామినేటెడ్ పదువులు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో టికెట్ ఆశించిన భంగపడ్డ పలువురు నేతలకు సైతం అధిష్ఠానం నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎవరికి ఏ నామినేటెడ్ పదవి వస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.

News June 26, 2024

విశాఖ:పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు

image

వాల్తేర్ డివిజన్ పరిధిలో నౌపడ ప్రధాన లైన్ లో వంతెన ఆధునికరణ పనులు జరుగుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పలాస-విశాఖ-పలాస పాసెంజర్ రైలు, విశాఖ-గుణుపూర్-విశాఖ ప్యాసింజర్ రైళ్లను ఈనెల 27న రద్దు చేసినట్లు తెలిపారు. విశాఖ-కోరాపుట్ పాసింజర్ రైలు 26న, కోరాపుట్-విశాఖ పాసింజర్ రైలు 27న రద్దు చేసినట్లు పేర్కొన్నారు.