Andhra Pradesh

News May 8, 2024

ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

image

సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై అనంతపురం కలెక్టరేట్‌లో కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ప్రత్యేక పరిశీలకులు రామ్ మోహన్ మిశ్రా, అమిత్ కుమార్ సింగ్, అజయ నాథ్, పోలీసు పరిశీలకులు రవికుమార్ హాజరయ్యారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వహించాలన్నారు.

News May 8, 2024

శ్రీకాకుళం: సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా

image

సోషల్‌ మీడియా పోస్టులపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని, కంట్రోల్ రూమ్ సిబ్బంది మరింత అప్రమత్తంగా పనిచేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు నవీన్ కుమార్ సోనీ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన శ్రీకాకుళం కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ సందర్శించారు. ఎంసీసీ నోడల్‌ అధికారులతో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాట్సాప్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా యాప్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు.

News May 8, 2024

పోలింగ్ కేంద్రాల్లో తనిఖీలు చేసిన గుంటూరు ఎస్పీ

image

గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. నగరాలు, ప్రత్తిపాడు గోరంట్ల ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఓటర్లు తప్ప ఇంకెవరు ఉండకూడదని స్పష్టం చేశారు.

News May 8, 2024

మన్యం: ‘సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం’

image

సాధారణ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రమోద్ కుమార్ మెహర్డ అన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సూక్ష్మ పరిశీలకుల ఓరియంటేషన్ ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని మంగళ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ రహస్యంగా, ప్రశాంతంగా జరగాలని అన్నారు.

News May 8, 2024

చంద్రబాబు జేబు సంస్థగా ఎన్నికల కమిషన్: కొట్టు

image

రాష్ట్రంలో రైతులు ఆనందంగా ఉంటే చంద్రబాబు కడుపు మంటగా ఉందని వైసీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ చంద్రబాబు జేబు సంస్థగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఐదేళ్లుగా కొనసాగుతున్న సంక్షేమ పథకాల అమలును ఈసీ అడ్డుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

News May 8, 2024

చిత్తూరు: స్ట్రాంగ్ రూములు పరిశీలించిన కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్ శన్మోహన్ పరిశీలించారు. పలమనేరు, నగరి, జీడి నెల్లూరులో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములు, ఈవీఎం కమీషనింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ సమయం దగ్గర పడుతోందని అధికారులందరూ విధులలో చురుగ్గా ఉండాలని సూచించారు. స్ట్రాంగ్ రూములలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.

News May 8, 2024

ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్‌ల పాత్ర కీలకం: విశాఖ కలెక్టర్

image

ఎన్నికల ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమని, వారు ప్రతి అంశాన్నీ సునిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మల్లికార్జున, సాధారణ పరిశీలకులు అమిత్ శర్మ పేర్కొన్నారు. స్థానిక ఉడా చిల్డ్రన్ ఎరీనాలో మంగళవారం జరిగిన ఒక్క రోజు శిక్షణ సదస్సులో మైక్రో అబ్జర్వర్లను ఉద్దేశించి వారిద్దరూ ప్రసంగించారు. పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించరాదన్నారు.

News May 8, 2024

ఇబ్రహీంపట్నం: ఎన్నికల స్ట్రాంగ్ రూమును పరిశీలించిన ఢిల్లీరావ్

image

జూపూడిలోని నోవా, నిమ్రా కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్, స్ట్రాంగ్ రూములను మంగళవారం ఎన్నికల అధికారి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత తదితర చర్యలను చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

News May 8, 2024

సార్వత్రిక ఎన్నికలకు ఆర్టీసీ బస్సులు కేటాయింపు

image

మే 13 జరిగే సార్వత్రిక ఎన్నికలకు జిల్లాలోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులను కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణ తెలిపారు. నెల్లూరు, కావలి, కందుకూరు, ఆత్మకూరు, ఉదయగిరి డిపోల నుంచి ఆయా అసెంబ్లీలో ఎన్నికల ప్రాంతాలకు బస్సులను కేటాయించారన్నారు. 12వ తేదీ ఉదయం ఆయా బస్ స్టేషన్ ల నుంచి సంబంధిత పోలింగ్ కేంద్రాలకు చేరి 13వ తేదీ రాత్రి తిరిగి బస్సులు బయలుదేరుతాయన్నారు.

News May 7, 2024

సీతారామపురంలో తేలికపాటి వర్షం

image

సీతారామపురం మండలంలో తేలికపాటి వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల నుంచే ఉరుములు మెరుపులు రావడంతో రాత్రి వర్షం పడింది. గడచిన రోజుల్లో కాసిన ఎండకి కొంచెం ఉపశమనం లభించినట్లైంది. రేపు నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలపారు.