Andhra Pradesh

News May 7, 2024

VZM: విద్యాహక్కు చట్టం కింద 25 వేల సీట్లు భర్తీ..కేసలి అప్పారావు

image

రాష్ట్రంలోని ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో అర్హులైన 25,125 మంది పిల్లలకు విద్యాహక్కు చట్టం కింద ఉచితంగా ప్రవేశాలు కల్పించినట్లు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా వారికి ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా ప్రవేశాలు కల్పించాలన్నారు. ప్రవేశాలపై ఇబ్బందులు ఎదుర్కొంటే apscpcr2018@gmail.comకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News May 7, 2024

ప.గో.: వర్షం.. కొబ్బరిచెట్టు మీదపడి వ్యక్తి మృతి

image

ప.గో. జిల్లా పాలకోడేరు మండలంలో మంగళవారం వీచిన ఈదురుగాలులు, భారీ వర్షానికి కొబ్బరిచెట్టు పడి శృంగవృక్షం గ్రామానికి చెందిన రైతు నిమ్మల శ్రీను(45) మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలో వర్షం కురవగా.. ధాన్యం రాశులపై కప్పేందుకని బరకాలు తీసుకునేందుకు తన ఇంటి సమీపంలో ఉన్న బాబాయ్ సుబ్బారావు ఇంటికి బైక్‌పై వెళ్లాడు. ఈ క్రమంలో కొబ్బరిచెట్టు అతనిపై పడింది. దీంతో శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు.

News May 7, 2024

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు

image

ఈనెల 8న విజయవాడలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు చేసినట్లు గుంటూరు ఎస్పీ తుషార్ తెలిపారు. గుంటూరు నుంచి విజయవాడ వైపుకు వెళ్ళు వాహనాలను బుడంపాడు నుంచి నారాకోడూరు- చేబ్రోలు, భట్టిప్రోలు, రేపల్లె, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్ నేషనల్ హైవే 16 మీదగా వెళ్లాలన్నారు. గుంటూరు నుంచి హైదరాబాదుకు వెళ్లే వాహనాలు చుట్టుగుంట పేరేచర్ల -సత్తెనపల్లి- పిడుగురాళ్ల మీదుగా హైదరాబాదు వెళ్లాలన్నారు.

News May 7, 2024

వజ్రకరూరు మండలంలో మృతదేహం లభ్యం

image

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గులపాళ్యం గ్రామ సమీపంలోని నీటి గుంతలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News May 7, 2024

విజయనగరం జిల్లాలో ప్రారంభమైన హోమ్ ఓటింగ్

image

జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. పోలింగ్ కేంద్రాల‌కు వ‌చ్చి ఓటు వేయ‌డానికి అవ‌కాశం లేని 85 ఏళ్లు పైబ‌డిన వ‌యో వృద్దులు, 40 శాతం విక‌లాంగ‌త్వం దాటిన విభిన్న ప్ర‌తిభావంతులు త‌మ ఇంటివ‌ద్ద‌నే ఓటు వేసే అవ‌కాశాన్ని ఎన్నిక‌ల క‌మిష‌న్‌ ఈ ఏడాది కొత్త‌గా అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. వీరి ఇళ్ల‌కు వెళ్లి ఓటు తీసుకొనే ప్రక్రియ సెక్టార్ అధికారుల పర్యవేక్షణలో మంగళవారం ప్రారంభించారు.

News May 7, 2024

రేపల్లెలో అనగాని సత్యప్రసాద్‌ను గెలిపించాలి: హీరో రోహిత్

image

రాష్ట్రానికి పూర్వ వైభవం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితోనే సాధ్యమని సినీ హీరో నారా రోహిత్ అన్నారు. మంగళవారం చెరుకుపల్లి మండలం బలుసులవారిపాలెం, మెట్టగౌడవారిపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రేపల్లె అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ రేపల్లె నియోజకవర్గాన్ని అభివృద్ది చేశాడన్నారు. మే 13 జరిగే ఎన్నికల్లో సత్యప్రసాద్‌ను గెలిపించాలని కోరారు.

News May 7, 2024

రేపు కలికిరికి మోదీ రాక

image

ప్రధాని మోదీ బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో కలికిరిలో నిర్వహించనున్న ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. స్థానిక సైనిక స్కూల్ వెనుక వైపు 35 ఎకరాల మైదానంలో సభా స్థలాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి తదితరులు ఈ సభలో పాల్గొంటారు.

News May 7, 2024

నెల్లూరు: హైవేపై రోడ్డు ప్రమాదం

image

జాతీయ రహదారిపై మనుబోలు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. మృతుడి చేతిపై షాడో అని పచ్చబొట్టును గుర్తించారు. ఆ యువకుడి వివరాల కోసం మనుబోలు ఎస్సై అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు.

News May 7, 2024

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది: రామసుబ్బారెడ్డి

image

చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం కర్నూలులోని జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్, ఎంపీ అభ్యర్థి రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్సీ మోహన్ రెడ్డితో కలిసి కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మరోసారి రాష్ట్రానికి జగన్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

News May 7, 2024

తూ.గో.: దంచికొడుతున్న వర్షాలు.. మీ వద్ద పరిస్థితి ఏంటి..?

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసింది. నెల రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అయిన జిల్లావాసులు వర్షానికి కొంత ఉపశమనం పొందారు. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్, వీ.ఎల్ పురం సెంటర్ నీటి మునిగాయి. కొన్నిప్రాంతాల్లో రైతులు ఆరబెట్టిన వరిధాన్యం తడిచిపోయింది.  – మీ వద్ద పరిస్థితి ఎలా ఉంది..?