India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

డయేరియా సోకి చిన్నారి మృతి చెందిన ఘటన కేవీబీ పురం మండలంలో జరిగింది. చిన్నారి బంధువుల వివరాల మేరకు.. మండలంలోని కాట్రపల్లి దళితవాడకు చెందిన దుష్యంత్, కామాక్షమ్మ దంపతుల కుమార్తె దర్శిని(2)కి డయేరియా వచ్చింది. దీంతో చిన్నారిని శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. కాట్రపల్లి ప్రజలు డయేరియా భయంతో వణికిపోతున్నారు.

కమలాపురం నియోజకవర్గ నూతన ఎమ్మెల్యేగా గెలుపొందిన పుత్తా చైతన్యరెడ్డి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. నియోజకవర్గంలోని వల్లూరు మండలం దిగువపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను ఈరోజు ఉదయం నిర్వహించారు. అనంతరం స్థానిక నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి ఇతర నాయకులతో కలిసి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచినందుకు మొక్కు చెల్లించుకున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని ఎంపీలంతా ఎన్డీయే స్పీకర్ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతివ్వడంపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి స్పందించారు. ‘మన రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు ఎన్డీయే ప్రతిపాదించిన స్పీకర్ అభ్యర్థికి మద్దతిస్తున్నారు. అలాంటి ఐక్యతతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తారని, పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సమస్యలను పరిష్కరించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నరసరావుపేటలో నిర్వహిస్తున్న అండర్-16 బాలుల అంతర జిల్లాల క్రికెట్ పోటీల్లో విశాఖపట్నం జట్టు 433 పరుగుల భారీ తేడాతో ప.గో. జట్టుపై విజయం సాధించింది. ప.గో. 89 పరుగులకే ఆలౌట్ అయింది. 6 వికెట్లు తీసి విశాఖ బౌలర్ కె.గౌతమ్ ఆర్య పశ్చిమగోదావరి జట్టు పతనాన్ని శాసించాడు. 2వ ఇన్నింగ్స్ లోనూ 5 వికెట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ప్రతిపక్ష హోదా అడిగే హక్కు జగన్ కు లేదని మహిళా, శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం సభలో ఒక్క నిమిషం కూడా ఉండలేని జగన్ ఇంకా ప్రజా సమస్యల కోసం ఏం పోరాడుతారని ప్రశ్నించారు.

పర్చూరు ప్రాంతానికి చెందిన వివాహిత కందుకూరులో మహిళ పోలీసుగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త యూపీ రాష్ట్రంలో బీఎస్ఎఫ్ జవాన్‌గా ఉద్యోగం చేస్తున్నారని వెల్లడించారు. ఇటీవల తరచూ భర్త తనను బెదిరించడంతో పాటు, వేధిస్తున్నాడని ఆమె మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.

రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 1,134 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఎస్జీటీ పోస్టులు 551, స్కూల్ అసిస్టెంట్ కేటగిరీకి సంబంధించి 583 పోస్టులు ఉన్నట్లు పేర్కొంది. స్కూల్ అసిస్టెంట్‌లో లాంగ్వేజ్-1 పోస్టులు 44, లాంగ్వేజ్ -2లో 43, ఇంగ్లీష్ 59, గణితం 66, ఫిజికల్ సైన్స్ 74, బయాలజీ 62, సోషల్ స్టడీస్ 99, హిందీ 139 ఖాళీలు ఉన్నాయి.

నెల్లూరు నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులకు కొత్త చట్టాలపై జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నూతన చట్టాలు జులై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో, నూతన చట్టాలపై పోలీస్ అధికారులకు, సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

గంపలగూడెం మండలం పెనుగొలనులో సుబాబుల్ లోడుతో వెళుతున్న లారీకి బుధవారం విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో ఆర్సీఎం చర్చి వద్ద విగతజీవిగా పడి ఉన్న లారీ డ్రైవర్‌ను చూసిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న MSC ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ కోర్స్ రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. వీటితో పాటు MSC కెమిస్ట్రీ & అనాలసిస్ ఆఫ్ ఫుడ్ డ్రగ్ రెండో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను, MSC ఆర్గానిక్ కెమిస్ట్రీ రెండో సెమిస్టర్ ఫలితాలు, MSC ఎనలిటికల్ కెమిస్ట్రీ రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసి ఏయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
Sorry, no posts matched your criteria.