India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈరోజు ఇచ్ఛాపురంలో జరుగుతన్న సిద్ధం సభలో CM జగన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. సాలూరులో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కురుపాంలో ట్రైబుల్ ఇంజినీరింగ్ కాలేజీ, పార్వతీపురం, విజయనగరం ప్రాంతాలలో మెడికల్ కాలేజీలు నిర్మించామన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉరుకులు పరుగులతో నిర్మాణమవుతుందన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడింది వైసీపీ ప్రభుత్వమేనని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఇచ్చాపురం సభలో ఆయన మాట్లాడుతూ..‘రూ.4,400 కోట్లతో మూలపేట పోర్ట్ దగ్గర పనులు, ఉత్తరాంధ్రలో 4 మెడికల్ కాలేజీలు, సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం, కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్, ITDA పరిధిలో 5 మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లు, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు.. ఇవన్నీ చేసింది వైసీపీ ప్రభుత్వంలోనే’ అని తెలిపారు.
సీఎం జగన్ ఉద్యోగులకు మేలు చేశారని ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం లాసన్స్ బేకాలనీలో గల బొత్స ఝాన్సీ ఎన్నికల కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు టీడీపీ హయాంలో ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, వైసీపీ మేనిఫెస్టోలో 40శాతం ధరకే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ప్రకటించారన్నారు. రెండు డీఏలు జూన్, జూలై లోపు ఇస్తున్నారని, 11 పీఆర్సీ కింద ఐఆర్ 20 శాతం ప్రకటించారని చెప్పారు.
చిత్తూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. మరోవైపు ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఉదయం నుంచి ప్రచారంలో పాల్గొంటున్న పలువురు సాయంత్రానికి మద్యం షాపుల వద్దకు చేరుకుంటున్నారు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మరికొందరు వైన్ షాపులకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల బీర్లు దొరకడం లేదని మందుబాబులు అంటున్నారు. కొన్ని చోట్ల స్టాక్ ఉన్నా.. కూలింగ్ ఉండటం లేదని వాపోతున్నారు.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10న ఉదయం 10 గంటలకు కర్నూలులోని అవుట్ డోర్ స్టేడియంలో బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు జరగనున్నాయి. అండర్-23, సీనియర్ క్రికెట్ అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ కోసం ఈ ఎంపికలు చేపట్టనున్నారు. ఆసక్తి గల క్రీడాకారులు పాల్గొనవచ్చని కార్యదర్శి దేవేందర్ గౌడ్ తెలిపారు. 2001 సెప్టెంబర్ 1వ తేదీ తరువాత జన్మించిన వారు అండర్-23కి అర్హులన్నారు.
రొళ్ల మండలంలోని పిల్లిగుండ్ల చెక్ పోస్ట్‌లో డ్యూటీల విషయంలో గొడవ పడిన కానిస్టేబుల్స్ శివ, నారాయణస్వామిని వీఆర్‌కు పంపుతూ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజుల క్రితం కానిస్టేబుల్స్ డ్యూటీలో విషయంలో గొడవపడి విషయం బహిర్గతం కావడంతో వారిని వీఆర్‌కు పంపారు. సంఘటనపై విచారణ అనంతరం పోలీస్ శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.
ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు నచ్చని సందర్భంలో NOTAకు ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ 2013లో అవకాశం ఇచ్చింది. 2019 ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గంలో 1,797(1.09శాతం) మంది నోటా బటన్ నొక్కేశారు. మొత్తం పది మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ఆరుగురు అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పోలై 4వ స్థానంలో నిలిచింది. మరి మీరెప్పుడైనా నోటాకు ఓటు వేశారా?
వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. సామర్లకోట, పెద్దాపురం, ఏజెన్సీ, కోనసీమ, తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజల ఫోన్స్‌కు మెసేజ్‌లు వచ్చాయి. అప్రమత్తంగా ఉండాలని ఆ సందేశంలో పేర్కొన్నారు. గతంలో అనేకసార్లు పిడుగుపాటు ప్రమాదాలు సంభవించాయి.
జమ్మలమడుగు MLA సుధీర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. ఈనెల 5వ తేదీన జమ్మలమడుగులోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు వినియోగించుకునేందుకు ఉద్యోగులు బారులు తీరారు. ఆ సమయంలో ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పుకుని లోనికి వెళ్లారు. ఇది ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకం కాగా ఆర్వో శ్రీనివాసులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగస్థులకు కేటాయించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ రెండవ రోజు 12 గంటల బుల్లెటిన్‌ను జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన విడుదల చేశారు. కర్నూలు 587, ఎమ్మిగనూరు 245, పాణ్యం 337, పత్తికొండ 232, కోడుమూరు 320, మంత్రాలయం 97, ఆదోని 319, ఆలూరు 560మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మధ్యాహ్నం 12గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా 2325 మంది ఉద్యోగస్తులు ఓటు వేశారు.
Sorry, no posts matched your criteria.