India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చెక్ బౌన్స్ కేసులో రాజు అనే వ్యక్తికి ఏడాది జైలు శిక్ష పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరామ సిటీ యూనియన్ ఫైనాన్స్ కంపెనీ వద్ద రాజు రూ.4 లక్షల రుణం తీసుకున్నాడు. కొంత నగదుకు సరిపడా చెక్ ఇచ్చారు. సొమ్ము జమ చేస్తున్న సమయంలో బ్యాంకు ఖాతాలో నగదు లేనందున సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారణ జరిపి ప్రిన్సిపల్ జుడీషియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శారదాంబ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కాయపల్లెలోని శాస్త్రి నగర్‌లో నివాసం ఉంటున్న రాజశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం అత్తగారింటికి వెళ్లాడు. మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూసేటప్పటికి ఇంటి గేటు తీసి తాళం పగలగొట్టి ఉంది. ఇంటిలోకి వెళ్లి చూసి బీరువాలోని దాదాపు 12 తులాల బంగారు ఆభరణాలు దోపిడీకి గురైనట్లు గుర్తించాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పార్లమెంట్‌లో నేడు లోక్‌సభ స్పీకర్ ఎలక్షన్ జరగనుంది. కర్నూల్ ఎంపీ బస్తిపాటి నాగరాజు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఇరువురు టీడీపీ ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు ఓటేయనున్నారు.

చిత్తూరు జిల్లాలో నిరుద్యోగం ఓ యువకుడి మృతికి కారణమైంది. స్థానికుల వివరాల మేరకు.. సదుం గ్రామానికి చెందిన ఎం.వెంకటరమణ(25) బీఎస్సీ అగ్రికల్చర్ చదివాడు. ఉద్యోగం రాలేదని తీవ్ర మనస్తాపం చెందాడు. ఈక్రమంలో పాకాల మండలం వల్లివేడులోని ఓ మామిడి తోటలో విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రయాణికుల డిమాండ్ నేపథ్యంలో ఆర్టీసీ మంగళవారం విశాఖ నుంచి రాజమండ్రికి 12 ప్రత్యేక సర్వీసులు నడిపింది. నిడదవోలు-కడియం స్టేషన్‌ల మధ్య రైల్వేట్రాక్ నిర్వహణ పనుల నేపథ్యంలో పలు రైళ్లను రద్దుచేయడంతో బస్సులకు డిమాండ్ పెరిగింది. దీంతో ప్రస్తుతం విశాఖ- రాజమండ్రి మధ్య ప్రతి 40 నిమిషాలకు నడుస్తున్న బస్సులకు మించి డిమాండ్ ఉండడంతో 12 ప్రత్యేక సర్వీసులు నడిపారు. బుధవారం కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉంది.

ఇంట్లో జారిపడి అన్న మృతి చెందగా ఆ బాధతో గుండెపోటుకు గురై తమ్ముడు మరణించిన విషాదకరమైన ఘటన కావలిలో జరిగింది. కావలి పట్టణంలోని క్రిస్టియన్‌పేటలో నివాసం ఉంటున్న విశ్రాంత బ్యాంకు ఉద్యోగి సుధాకర్‌రెడ్డి(70) ఆదివారం తన ఇంట్లో జారిపడి మృతి చెందాడు. అన్న మృతదేహం వద్ద మనోవేదనకు గురైన ఆయన సోదరుడు వెంకటశేషారెడ్డి ఇంట్లోకి వెళ్లి అక్కడే కుప్పకూలిపడిపోయాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.

శ్రీసత్యసాయి జిల్లాలో కామాంధ వైద్యుడి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని వైద్యుడు ఉదయ్ రోజూ రాత్రి 9 తర్వాత ఆసుపత్రి, సచివాలయాల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలకు సెల్‌ఫోన్లలో అసభ్యకర సందేశాలు పంపుతున్నాడు. ‘మీరు కాకపోతే మీ పిల్లలను పంపించండి’ అంటూ ఒత్తిడి చేస్తుండటతో ఐదుగురు ఏఎన్‌ఎంలు మంగళవారం జిల్లా వైద్యాధికారిణి మంజువాణికి ఫిర్యాదు చేశారు. ఆమె దీనిపై విచారణకు ఆదేశించారు.

ప్రేమించిన వ్యక్తి 2 నెలలుగా మాట్లాడటం లేదని ఓ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ మేరకు యువతి సోదరుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిజియోథెరపి చదవిన యువతికి 6 నెలల కిందట ఓ ప్రొఫెసర్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. తనను నమ్మించి మోసం చేశాడని, 2 నెలలుగా మాట్లాడట్లేదనే మనస్తాపంతో యువతి ఈ నెల 23న ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

జిల్లాలో 1962 పశు సంచార అంబులెన్స్ వాహనాలకు సంబంధించి ఖాళీగా ఉన్న పైలట్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ నెమలి శివశంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీలో భాగంగా పైలట్ పోస్టుకి పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండి హెవీ లైసెన్స్ లేదా బ్యాడ్జి లైసెన్స్ కలిగి ఉండాలన్నారు . ఈ నెల 28వ తేదీ ఒంగోలు బస్టాండ్ సమీపంలో ఉన్న కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

తల్లి మరణించిన కాసేపటికి కొడుకు కన్నుమూసిన విషాద ఘటన తాళ్లరేవులో జరిగింది. మృతుడి భార్య 8ఏళ్ల క్రితం పుట్టింటికి వెళ్లింది. నూకరాజుకు పక్షవాతం ఉండడంతో తల్లి కామేశ్వరి చేపల వ్యాపారం చేసి చూసుకొనేది. మంగళవారం రక్తపోటు రాగా ఆమెను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. నూకరాజుకు తల్లిని చూపించి దహనసంస్కారాలకు తీసుకెళ్లారు. దీంతో కాసేపటికే కొడుకు కన్నుమూశారు.
Sorry, no posts matched your criteria.