India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నత్తితో ఇబ్బంది పడుతున్న యువకుడు తనకు వివాహం కాలేదని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డిపల్లికి చెందిన లక్ష్మీనారాయణకు(28) నత్తి ఉంది. దీంతో పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మనస్తాపంతో మంగళవారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి తిమ్మక్క ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

టమాట సీజన్ ముగియడంతో ధర పెరిగిపోతోంది. ప్రస్తుతం దిగుమతులు తగ్గడంతో నెల రోజుల్లోనే టమాట ధర రెట్టింపైంది. మంగళవారం తాడేపల్లిగూడెం బహిరంగ మార్కెట్లో కిలో టమాట రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయించారు. జిల్లాలోని పలు ప్రాంతాల రైతు బజార్లలో రూ.68 వరకు విక్రయిస్తున్నారు. సామాన్యులకు టమాట అందని పరిస్థితి నెలకొంది.

అన్నవరం సత్యదేవుని దర్శన విధానంలో మార్పులు చేపట్టారు. దశమి, ఏకాదశి, పౌర్ణమి తదితర పర్వదినాలు, రద్దీ రోజుల్లో శీఘ్ర దర్శనం రూ.200, ప్రదక్షిణ దర్శనం రూ.300 టికెట్లు మధ్యాహ్నం వరకు నిలిపివేయాలని ఈవో ఆదేశించారు. మధ్యాహ్నం మూడు తరువాతే రూ.300 ప్రదక్షిణ దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఎక్కువ సమయం నిరీక్షించడం, సాధారణ దర్శనానికి వచ్చే వారికి ఇబ్బందులు ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

భోగాపురం మండలం పోలిపల్లి గ్రామానికి చెందిన కర్రోతు నారాయన (40) మద్యానికి బానిసయ్యాడు. భార్య ఎల్లమ్మ, మిగతా కుంటంబసభ్యులు తాగొద్దని పలుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన నారాయణ ఈనెల 21న పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటింబీకులు విజయనగంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.

ఒంగోలులో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వారి వివరాల మేరకు.. యూపీకి చెందిన ధ్రువ్ చంద్రవర్మ ఒంగోలులో ఉంటూ మేస్త్రీ పనిచేస్తుంటాడు. శ్రీవాస్తవ అనే యువకుడు ధ్రువ్ వద్ద పనికి కుదిరి, రూ.10 వేలు కావాలనగా సాధ్యం కాదని చెప్పాడు. శ్రీవాస్తవ కోపంతో చంపేస్తానని బెదిరించాడు. కూలీల ముందు తనను అవమానించాడని రాంచరణ్ అనే వ్యక్తితో కుట్ర పన్ని శ్రీవాస్తవని గొంతు కోసి హత్య చేశారు.

గాజు ముక్క ప్రాణం తీసిన ఘటన శ్రీకాళహస్తి మండలంలో జరిగింది. CI నరసింహారావు కథనం మేరకు.. పోలి గ్రామంలోని SCకాలనీకి చెందిన బాలాజీ, భార్య ధనలక్ష్మి(32) మధ్య ఆదివారం చిన్నపాటి వివాదం నెలకొంది. ఈనేపథ్యంలోనే బాలాజీ గడ్డం గీసుకుంటున్న సమయంలో కోపంతో చేతిలోని అద్దాన్ని భార్యపైకి విసిరాడు. దీంతో అద్దం గాజు ముక్క ధనలక్ష్మి గొంతుకు తగిలి తీవ్రంగా గాయపడింది. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు తెలిపారు.

గాజువాక కణితి రోడ్ సింహగిరి కాలనీలో గ్రామ దేవత తుంపాలమ్మ తల్లి పండుగలో మంగళవారం లైటింగ్ పెడుతున్న ఎలక్ట్రీషియన్ కోలా జోగి బాబుకి కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికి అక్కడే మృతి చెందారు. కరెంట్ తీగను నోటితో పట్టి లాగి తీగలను అతికించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు.

నెల్లూరు జిల్లా టీడీపీ ముఖ్య నేత, మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు కాసేపటి క్రితం గుండె పోటుతో మృతి చెందారు. ఆయన సుదీర్ఘకాలం టీడీపీ బలోపేతానికి కృషి చేశారు. నిన్న సాయంత్రం వరకు ఎంతో చలాకీగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన… రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. బీవీ నగర్ సాయిబాబా మందిరం ఛైర్మన్‌గా కూడా కిలారి వెంకటస్వామి నాయుడు వ్యవహరిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్ ఈ నెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమదాలవలస, పాతపట్నం, నందిగాం, తదితర మండలాల్లో ఉన్న గురుకులాల్లో సీట్ల భర్తీ చేయనున్నారు. ఈ నెల 29న ఉ.10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుంది.

కర్నూలు, ఆదోని పట్టణంలో నిర్మిస్తున్న వైసీపీ భవనాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయా కార్యాలయాలు అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని దీనిపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఆదోని భవనానికి సంబంధించి వైసీపీ నాయకుడు ఎర్రిస్వామికి నోటీసులు ఇవ్వగా కర్నూలు నగరంలోని కార్యాలయానికి సంబంధించి వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఎస్.సత్యనారాయణమ్మకు అందజేశారు.
Sorry, no posts matched your criteria.