India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తాడిపత్రి పురపాలక అత్యవసర సమావేశం నేడు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామ్ మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఉంటుందని పట్టణంలోని అన్ని వార్డు కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది హాజరుకావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఈనెల 27 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా ప్రజా పరిషత్ సీఈవో సుబ్బారాబు ఓ ప్రకటన విడుదల చేశారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి ఏలూరు జిల్లా ప్రజా పరిషత్‌లోని ఛైర్‌పర్సన్ ఛాంబర్‌లో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా బుధవారం ఎస్.నాగలక్ష్మి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం మంగళవారం తెలిపారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు నూతన కలెక్టర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన బదిలీలలో గత కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని జీడీఎలో రిపోర్ట్ చేయాలని అధికారులు ఆదేశించిన విషయం విధితమే.

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎంబీఏలో నూతన కోర్సులను ఆవిష్కరిస్తున్నట్లు ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ధర్మారావు తెలిపారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హెల్త్ కేర్ హాస్పిటల్, మేనేజ్మెంట్ కన్స్ట్రక్షన్ ఇలాంటి అంశాలతో కోర్సులు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఈ కోర్సులకు రెండు సంవత్సరాల వ్యవధిగా నిర్ణయించినట్లు వెల్లడించారు.

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులు పక్కాగా పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్ నుంచి ఆర్డీవోలు, తహశీల్దార్‌లతో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్నారు.

ఉమ్మడి తూ.గో జిల్లా మారేడుమిల్లి మండలం వేటుకూరు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన కె.మాధురి డిప్యూటీ కలెక్టర్ ఎంపికైన సందర్భంగా గ్రామస్థులు అభినందన సభ నిర్వహించారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోగా.. తల్లి ఉమామహేశ్వరి కష్టపడి చదివించారు. మాధురి ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగారని సర్పంచ్ మల్లేశ్వరి అన్నారు. గ్రామానికే పేరు తీసుకొచ్చారని కొనియాడారు. ఐఏఎస్ సాధించడమే తన ధ్యేయమని మాధవి అన్నారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబును నియోజకవర్గంలోని వాలంటీర్లు కలిశారు. కవిటి మండలం రామయ్యపుట్టుగలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు. వాలంటీర్ ఉద్యోగాల నుంచి తమను బలవంతంగా రాజీనామా చేయించారని వాపోయారు. మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ప్రాధేయపడ్డారు. దీనిపై ఎమ్మెల్యే అశోక్ సానుకూలంగా స్పందించారు. సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

పీడియాట్రిక్ కేసుల కోసం 10 పడకలతో ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేయాలని కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభాకర రెడ్డి ఆదేశించారు. పీడియాట్రిక్ డిపార్ట్‌మెంట్‌లో సీజనల్ వ్యాధుల కేసులపై సమీక్ష నిర్వహించారు. పీడియాట్రిక్ కేసుల వ్యాప్తిపై రోజువారీ డేటాను తన దృష్టికి తీసుకురావాలని పీడియాట్రిక్ HODని ఆదేశించారు.

కుప్పం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కుప్పం డెవలప్మెంట్ అథారిటీ(కడా) ఏర్పాటు చేస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కడా ఏర్పాటుతో పాటు దీనికి ఓ ఐఏఎస్ అధికారిని నియమిస్తామన్నారు. కుప్పం ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.

ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు వారి తుది ఎన్నికల లెక్కల వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలకులకు సమర్పించాలని తిరుపతి డీఆర్ఏ పెంచల కిషోర్ ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ పార్టీల ప్రతినిధులు, వ్యయ పరిశీలకులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎన్నికల వ్యయ నోడల్ అధికారి చరణ్ రుద్రరాజు తదితరులకు డీఆర్ఏ పలు సూచనలు చేశారు.
Sorry, no posts matched your criteria.