Andhra Pradesh

News May 7, 2024

శ్రీకాకుళం జిల్లాలో మూడు రోజులు వర్షాలు

image

వాతావరణంలో వచ్చిన మార్పులతో పాలకొండ మండల పరిధిలో ఉన్న ఎం సింగుపురం, మల్లివీడు, పద్మాపురం, భాసూరు పరిసర ప్రాంత గ్రామాల్లో మంగళవారం కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో శ్రీకాకుళం రూరల్, ఆమదాలవలస, కొత్తూరు, ఇచ్ఛాపురం, పాలకొండ, నరసన్నపేట, నందిగాం తదితరు మండలంలో మంగళ, బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ MD రోణంకి కూర్మనాధ్ తెలిపారు.

News May 7, 2024

నేడు పొన్నూరు, రేపల్లెలో నారా రోహిత్ ప్రచారం

image

సినీ హీరో నారా రోహిత్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మంగళవారం ఉదయం ఆయన పొన్నూరు, రేపల్లెలో పర్యటించనున్నట్లు ఆపార్టీ వర్గాలు తెలిపాయి. కూటమి అభ్యర్థులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, అనగాని సత్యప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ నారా రోహిత్ ప్రచారం చేయనున్నట్లు ఆ పార్టీ నాయకులు చెప్పారు.

News May 7, 2024

ప్రకాశం: ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది

image

పుల్లలచెరువు మం, ఆర్.ఉమ్మడివరానికి చెందిన ప్రేమ్ కుమార్(35) భార్యా పిల్లలతో గుంటూరులో నివాసం ఉంటున్నారు. అతని భార్య సమోసాలు తయారుచేసే పనికి వెళ్తూ, షాపు యజమానికి దగ్గరైంది. ఈ క్రమంలో భర్తను అడ్డుతొలగించాలనుకొని ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథకం వేసింది. ప్రియుడి తమ్ముడు, మరో వ్యక్తి ప్రేమ్‌ను కొర్నెపాడు వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించి కొట్టి చంపేశారు. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు కేసును ఛేదించారు.

News May 7, 2024

REWIND: నంద్యాల జిల్లాలో సిల్వర్ జూబ్లీ పార్లమెంటేరీయన్‌

image

నంద్యాల జిల్లా రాజకీయ ప్రస్థానంలో పెండేకంటి సుబ్బయ్యది ప్రత్యేక స్థానంగా చెప్పవచ్చు. ఆయన 1957 నుంచి 1977 వరకు వరసగా నాలుగుసార్లు నంద్యాల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత 1978 నుంచి 1984 వరకు ఎంపీగా గెలుపొంది సిల్వర్ జూబ్లీ పార్లమెంటేరీయన్‌గా గుర్తింపు పొందారు.1985 నుంచి 88 వరకు బిహర్ గవర్నర్‌గా, 1988నుంచి 90వరకు కర్ణాటక గవర్నర్‌గా పనిచేశారు. కేంద్రమంత్రిగా కూడా సేవలు అందించారు.

News May 7, 2024

కేంద్రీయ విద్యాలయంలో ఖాళీగా సీట్లు

image

నెల్లూరు పరిధిలోని కొత్తూరులో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో ఎస్టీ విభాగంలో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపల్ శంకరయ్య తెలిపారు. ఒకటో తరగతికి సంబంధించిన ఈ సీట్ల కోసం బుధవారం నుంచి మే 15వ తేదీ లోపు కేంద్రీయ విద్యాలయంలో నేరుగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News May 7, 2024

శ్రీకాకుళం: సీఎం జగన్ షెడ్యూల్ ఇదే..

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఇచ్ఛాపురంలో పర్యటించనున్నారు. విశాఖపట్నం నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్ఛాపురం చేరుకుంటారు. స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం వద్ద నుంచి మున్సిపల్ కూడలి వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సమావేశంలో మాట్లాడతారు. 3.30 గంటలకు ఇచ్ఛాపురం నుంచి విశాఖ బయలుదేరి వెళ్తారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ తెలిపారు.

News May 7, 2024

2 రోజుల్లో 9,364 మంది ఓటు హక్కు వినియోగం

image

పల్నాడు జిల్లాలో మొత్తం 16,282 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోగా, రెండు రోజుల కాలంలో 9364 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే గుంటూరు జిల్లాలో గత రెండు రోజుల కాలంలో 4,722 మంది ఉద్యోగులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 20,755 మంది దరఖాస్తు చేసుకున్నారు. గుంటూరు పశ్చిమలో అత్యధికంగా 5,751 మంది ఉన్నారు. గుంటూరు తూర్పులో 2,778 మంది ఉన్నారు.

News May 7, 2024

పూతలపట్టు అభ్యర్థులకు ‘బాబు’ భయం..!

image

చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు సెగ్మెంట్‌లో త్రిముఖ పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన MS బాబు కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆయనకే MLA టికెట్ లభించింది. సునీల్ కుమార్ వైసీపీ అభ్యర్థిగా, మురళీమోహన్ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నిన్నటి వరకు వీరిద్దరూ మెజార్టీపై లెక్కలు వేసుకోగా.. బాబు ఎంట్రీతో ఎవరి ఓట్లకు గండి పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

News May 7, 2024

మృత్యుశకటాలైన బైక్, లారీ.. ఇద్దరు మహిళలు బలి

image

వేర్వేరు చోట్ల సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. పెనుగొండ మండలం దొంగరావిపాలెం హైవేపై బైక్ ఢీకొనడంతో పెరవలికి చెందిన చిన వెంకమ్మ(52) మృతి చెందింది. ఈమె ప్లాస్టిక్ సామగ్రి విక్రయిస్తుంటుంది. పిఠాపురంలో లారీ ఢీకొని పంపాదమ్మ(55) మృత్యువాత పడింది. తొండంగి మండలం వి.కొత్తపేటకు చెందిన పంపాదమ్మ భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. లారీ ఢీకొట్టింది. పంపాదమ్మ స్పాట్‌లో మరణించింది.

News May 7, 2024

ఏలూరు: భర్త వేధింపులు తాళలేక భార్య సూసైడ్

image

భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని జగజ్జీవన్‌ నగర్‌కు చెందిన గంగాభవాని(27)కి, NTR జిల్లా మైలవరానికి చెందిన రాముతో 2011లో పెళ్లైంది. వీరికి ఒక పాప. మగ సంతానం కోసం కొద్దిరోజులుగా భర్త ఆమెను వేధిస్తున్నాడు. ఈనెల 4న పుట్టింటికి వచ్చిన భార్యతో గొడవపడ్డాడు. దీంతో ఆమె మనస్తాపం చెంది సోమవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేశారు.