Andhra Pradesh

News May 7, 2024

రాజంపేట ఎంపీ అభ్యర్థి నేను కాదు: నజీర్

image

రాజంపేట పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తానేనని ప్రజలందరూ అనుకుంటున్నారని, అది నిజం కాదని మాజీ పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు. రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం, స్వలాభం కొరకు రాజంపేట పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉన్న తనని మార్చి పార్టీకి సంబంధం లేని వ్యక్తిని నిలబెట్టారన్నారు.

News May 7, 2024

ఏలూరు: 15,21,928 మందికి స్లిప్పుల పంపిణీ

image

ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 93% ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. జిల్లాలో 16,37,430 మంది ఓటర్లకు గాను ఇప్పటివరకు 15,21,928 మంది ఓటర్లకు క్యూఆర్ కోడ్‌తో కూడిన స్లిప్పులు పంపిణీ చేశామన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా పోలింగ్ స్టేషన్, రాష్ట్రం, జిల్లా పేరు, నంబరు, హెల్ప్ లైన్ నంబర్ పొందవచ్చన్నారు.

News May 7, 2024

గుంటూరు: ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది

image

ప్రకాశం జిల్లాకు చెందిన ప్రేమ్ కుమార్(35) దంపతులు గుంటూరులో నివాసం ఉంటున్నారు. అతని భార్య సమోసాలు తయారు చేసే పనికి వెళ్తూ, షాపు యజమానికి దగ్గరైంది. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించాలనుకొని ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథకం వేసింది. ప్రియుడి తమ్ముడు, మరో వ్యక్తి ప్రేమ్‌ను కొర్నెపాడులోని జగనన్న కాలనీ వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించి కొట్టి చంపేశారు. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు కేసును ఛేదించారు.

News May 7, 2024

కందుకూరు: కొడుకు MLA అభ్యర్థి.. తండ్రి ప్రత్యర్థి పార్టీ

image

కందుకూరు నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో మాజీ జేడీ లక్ష్మీనారాయణకు చెందిన జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి పొడపాటి శివకుమార్(చక్రి) సింపుల్‌గా ఒక్కడే ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే.. శివకుమార్‌కు వ్యతిరేకంగా ఆయన తండ్రి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అయిన పొడపాటి నాగేశ్వరరావు ఇటీవల టీడీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేస్తుండటం విశేషం.

News May 7, 2024

విశాఖ: ఓటు హక్కు వినియోగానికి రాజకీయ ఖైదీల దరఖాస్తు

image

విశాఖపట్నం కేంద్ర కారాగారంలోని రాజకీయ ఖైదీలకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని జైలు అధికారులు సోమవారం తెలిపారు. ఇక్కడ 16 మంది రాజకీయ ఖైదీలు ఉండగా, వారి వివరాలు కలెక్టర్ కార్యాలయానికి పంపించామన్నారు. అక్కడ నుంచి వచ్చిన ఆమోదం ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని జైలు సూపరింటెండెంట్ కిషోర్ కుమార్ తెలిపారు.

News May 7, 2024

నేడు విశాఖకు సీఎం జగన్

image

సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం విశాఖ వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వెళతారు. తిరిగి 4:40 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గాజువాక చేరుకొని సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం ఆరు గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని గన్నవరం వెళ్తారు.

News May 7, 2024

నేడు కోరుకొండలో సీఎం జగన్ పర్యటన

image

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు (మంగళవారం) కోరుకొండలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కోరుకొండ శివారులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద దిగుతారు. అక్కడి నుంచి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిలో జరిగే ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై పోలీస్ అధికారులు సోమవారం సమీక్షించారు.

News May 7, 2024

విజయవాడలో రెడ్ జోన్ అమలు

image

ప్రధాని మోదీ బుధవారం విజయవాడలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆ రోజు మోదీ పర్యటించే 2 కి.మీ పరిధిలో రెడ్ జోన్(నో ఫ్లయింగ్ జోన్)గా ప్రకటించారు. డ్రోన్లు, బెలూన్లు ఎగరేయడాన్ని నిషేధించారు. ఆ రోజు పీవీఆర్ మాల్ వద్దకు ప్రధాని రోడ్డు మార్గంలో చేరుకుంటారు. అక్కడి నుంచి బెంజ్ సర్కిల్ వరకు(1.3కి.మీ) రోడ్ షో నిర్వహిస్తారు. 5 వేల మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

News May 7, 2024

నేడు, రేపు పోస్టల్ బ్యాలట్ దరఖాస్తుకు అవకాశం

image

పోస్టల్ బ్యాలట్ పొందని ఉద్యోగులు ఈనెల 7,8 తేదీల్లో సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి ఫారం-12ను అందజేసి బ్యాలట్ పొందాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున సూచించారు. సోమవారం పలువురు ఉద్యోగులు ఏయూ పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. ఓటు లేదని తెలియడంతో కలవరం చెందారు. ఇటువంటి వారు 100 మంది వరకు ఉన్నారు. వీరిలో కొంత మంది నుంచి అక్కడే ఫారం 12లను తీసుకొని ఓటు హక్కు కల్పించారు.

News May 7, 2024

సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో దాడి ఘటనపై దర్యాప్తు

image

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో దాడి ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసి, బెయిల్‌పై విడుదల చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో శ్రీధర్ అనే యువకుడికి గాయాలైన విషయం తెలిసిందే. కాకినాడ DSP హనుమంతరావు, శిక్షణ DSP ప్రమోద్, SI బాలాజీ సోమవారం ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. తాటిపర్తికి చెందిన వెంకటరమణ, వీరబాబును అదుపులోకి తీసుకొని, బెయిల్‌పై విడుదల చేసినట్లు తెలుస్తుంది.