India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ట్రాఫిక్ మెయింటనెన్స్ దృష్ట్యా గతంలో రద్దు చేసిన 6 రైళ్లను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు విశాఖ-లింగంపల్లి(12805నెంబర్ రైలు), చంగల్‌పట్టు-కాకినాడ పోర్టు(17643) రైళ్లు.. జూన్ 26న విజయవాడ-కాకినాడ(17257), కాకినాడ పోర్టు-విజయవాడ(17258), లింగంపల్లి-విశాఖ(12806), కాకినాడ పోర్టు-చంగల్‌పట్టు(17644) రైళ్లు ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొన్నారు.

ఆంధ్రవిశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం సంచాలకుడిగా ఏయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం సీనియర్ ఆచార్యులు ఎన్.విజయ్ మోహన్ నియమితులయ్యారు. ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి నుంచి నియామక ఉత్తర్వులను ఆయన స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య విజయ్ మోహన్‌ను విభాగ ఆచార్యులు, ఉద్యోగులు అభినందించారు.

ప్రధాని నరేంద్ర మోదీని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కలిశారు. తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలోని పార్లమెంట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానితో కాసేపు ముచ్చటించారు. ఈ ఫొటోలను బైరెడ్డి శబరి నెట్టింట పోస్ట్ చేశారు. ‘ప్రధాని మోదీని నా కుటుంబ సభ్యులతో కలిసి ఆశీస్సులు తీసుకున్నా’ అని ఆమె ట్వీట్ చేశారు.

వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ అధికారులతో టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం విజయవాడ వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ఎరువులను సిద్ధం చేయాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో భూసార పరీక్షలు జరపాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల నమూనాలు సేకరించి ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించారు.

నటి వరలక్ష్మి శరత్ కుమార్ హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణను ఆయన నివాసంలో కలిశారు. బాలకృష్ణ దంపతులకు కార్డు అందించి, తన వివాహానికి రావాలంటూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాబోయే కొత్త జంటకు బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రియుడు నికోలయ్ సచ్‌దేవ్‌తో వరలక్ష్మి ఏడడుగులు వేయబోతున్నారు. జులై 2న వీరి పెళ్లి జరగనున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ నుంచి తొలిసారిగా ఇండియా టీ-20 టీంకు ఎంపికైన నితీశ్ కుమార్‌కు మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పారు. వచ్చే నెలలో జింబాబ్వేలో జరిగే టీ-20 మ్యాచ్‌లో ఆడనున్న నితీశ్ కుమార్ రెడ్డి సత్తా చాటి క్రికెట్‌లో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని లోకేశ్ ఆకాంక్షించారు. ఐపీఎల్‌లో నితీశ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచనట్లు పేర్కొన్నారు.

తాడేపల్లిగూడెంలో ఆదివారం గల్లంతయిన బాలుడి మృతదేహాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. మణికంఠ అనే బాలుడు సెలూన్ షాపుకు వెళ్లి యాగర్లపల్లి ఏలూరు కాలువలో దిగి గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన బాలుడి కోసం ఎన్.డి.ఆర్.ఎఫ్, పోలీసు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం తాడేపల్లిగూడెంలోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో మణికంఠ మృతదేహం గుర్తించారు.

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని MA సంస్కృతం, MA ఇంగ్లీష్, MA తెలుగు, MA హిందీ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ – సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసి ఏయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పరీక్షల విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ నెలలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను విడుదల చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచామని చెప్పారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో మంగళవారం ఉదయం భానుడు తన ప్రతాపం చూపడంతో ప్రజలు ఉక్క పోతతో అల్లాడారు. మధ్యాహ్నం ఎట్టకేలకు ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకుంటూ భారీ వర్షం కురవడంతో ఆయా ప్రాంత ప్రజలు కొంత ఉపశమనం పొందారు. ఇటు పల్లపు ప్రాంత రైతులు ఈ వర్షం వరి నాట్లు వేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తపరిచారు.

జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. అనంతపురం జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.109.48 ఉండగా ఆ ధర నేటికి రూ.109.25కి చేరింది. డీజిల్ లీటర్ ధర రూ.97.33 నుంచి రూ.97.11కి తగ్గింది. సత్యసాయి జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.110.62 ఉండగా ఆ ధర నేటికి రూ.110.28కి చేరింది. డీజిల్ లీటర్ ధర రూ.98.39 నుంచి రూ.98.05కి తగ్గింది.
Sorry, no posts matched your criteria.