Andhra Pradesh

News May 6, 2024

‘ఇచ్చట ఓట్లు అమ్మబడవు’ ఇంటి ముందు స్టికర్

image

అనంతపురం జిల్లాలో ఓ పౌరుడు ‘ఇచ్చట ఓట్లు అమ్మబడవు అంటూ’ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన స్టిక్కర్ వైరల్ అవుతోంది. గుత్తి పట్టణానికి చెందిన ఇస్మాయిల్ అనే వ్యక్తి తన ఇంటి వద్ద ఇచ్చట ఓట్లు అమ్మబడవు అంటూ స్టిక్కర్స్ అందరినీ ఆకర్షిస్తోంది.

News May 6, 2024

ఎచ్చెర్ల: యథావిధిగా డిగ్రీ 2వ సెమిస్టర్ పరీక్ష 

image

ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న డిగ్రీ మొదటి సంవత్సరం, 2వ సెమిస్టర్‌కు చెందిన స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ (Stock Market Operations) పరీక్ష షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని డా.బీఆర్ఏయూ పరీక్షలు విభాగం డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ సోమవారం స్పష్టం చేశారు. అదే రోజు ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరుకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థుల ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.

News May 6, 2024

రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం: అచ్చెన్నాయుడు

image

నందిగాం మండలం దేవుపురం పంచాయతీ కొండతెంబూరు గ్రామంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజారాపు అచ్చెన్నాయుడు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైకోలను సాగనంపడానికి ప్రజలంతా ఏకమై కూటమిని గెలిపించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు.

News May 6, 2024

గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో తొలి MP ఎవరంటే!

image

గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో తొలిసారి 1952వ సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా ఎల్.వి.ఎల్ లక్ష్మీ నరసింహం, కృషికార్ లోక్ పార్టీ అభ్యర్థిగా ఎన్.జి రంగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నరసింహం 17,517 ఓట్ల మెజారిటీతో గెలుపొంది గుంటూరు లోక్ సభ స్థానానికి ఎన్నికయ్యాడు. ఆ ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొనని భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఈయనకు మద్దతిచ్చింది. 

News May 6, 2024

అనకాపల్లి సభలో సీఎం రమేశ్ ఏమన్నారంటే!

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లిలో జరిగిన సభలో సీఎం రమేశ్ కూటమి మేనిఫెస్టో గురించి వివరించారు. రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ. 2 వేలు చేసింది చంద్రబాబు కాదా అని గుర్తు చేశారు. ఒక్కో ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికీ ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తామన్నారు. బస్సు సౌకర్యాన్ని కూడా ఉచితంగా అందిస్తామని వివరించారు.

News May 6, 2024

నంద్యాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

image

సంజామల మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో భారీ ఉరుములు, మెరుపులతో  కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది.దీంతో విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో వాహనాల రాకపోకలు కాసేపు ఎక్కడికక్కడ స్తంభించాయి. అవుకు మండలంలో కూడా తేలికపాటి వర్షాలు కురిశాయి. గత కొద్ది రోజుల నుంచి తీవ్ర ఎండల నేపథ్యంలో ఉక్కపోతకు విలవిలలాడిన ప్రజలు.. తాజాగా వర్షం కురవడంతో ప్రకృతిని, చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించారు.

News May 6, 2024

VZM: పొక్సో కేసులో నిండుతుడికి 20 సం జైలు, జరిమానా

image

విజయనగరం రూరల్ పోలీసు స్టేషనులో 2020 నమోదైన పోక్సో కేసులో నిండుతుడికి 20 సం కఠిన కారాగార శిక్ష, 2,500 జరిమానా విధిస్తూ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చిందని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ద్వారపూడి గ్రామానికి చెందిన నిందితుడు కళ్లేపల్లి అప్పారావు (61) 5సం. మైనర్ బాలికపై లైంగిక నేరానికి పాల్పడినట్లుగా బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. నిండుతుడిని కోర్టులో హాజరుపరచగా నేరం రుజువు కావడంతో తీర్పు ఇచ్చిందన్నారు.  

News May 6, 2024

వాకాడు బీచ్‌లో యువకుడి గల్లంతు

image

గూడూరుకు చెందిన ఓ యువకుడు వాకాడు మండలంలోని బీచ్‌లో గల్లంతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్ద మసీదు వీధిలోని షేక్ షబ్బీర్, మున్ని దంపతుల పెద్ద కుమారుడు అద్నాన్ (16) ఆదివారం మరో ఇద్దరు స్నేహితులతో కలిసి తూపిలిపాలెం బీచ్‌కు వెళ్లాడు. సముద్రంలో దిగిన కొద్దిసేపటికి అద్నాన్ గల్లంతయ్యాడు. సోమవారం ఉదయం నుంచి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 6, 2024

కడప: పనిచేస్తున్న ప్రదేశంలో ఉపాధి కూలీ మృతి

image

జిల్లాలోని దువ్వూరు మండలం భీమునిపాడులో జక్కయ్య అనే ఉపాధి కూలీ సోమవారం ఉపాధి పనులకు వెళ్లారు. పనిచేస్తున్న ప్రదేశంలో తీవ్ర అస్వస్థతకు గురై గుండెపోటుతో మృతి చెందినట్లు తోటి కూలీలు తెలిపారు. మృతుని కుటుంబాన్ని గ్రామ సర్పంచ్, ఏపీవో వసంత కుమార్, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్ తదితరులు పరామర్శించి, తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

News May 6, 2024

మొదటిరోజు పోస్టల్ బ్యాటింగ్ ఓటింగ్ 29.60% మాత్రమే

image

ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగస్తులకు కేటాయించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అప్డేట్‌కు సంబంధించి మొదటి రోజు బుల్లెటిన్‌ను జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన విడుదల చేశారు. కర్నూలు 1093, ఎమ్మిగనూరు 1120, పాణ్యం 1222, పత్తికొండ 573, కోడుమూరు 806, మంత్రాలయం 226, ఆదోని 611, ఆలూరు 611మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటిరోజు సమయానికి ముగిసేసరికి 29.60% పోలింగ్ నమోదైందని కలెక్టర్ తెలిపారు