Andhra Pradesh

News May 6, 2024

రాజమండ్రి నుంచే చరిత్ర లిఖించబోతున్నాం: మోదీ

image

రాజమండ్రి నుంచే సరికొత్త చరిత్ర లిఖించబోతున్నామని ప్రధాని మోదీ అన్నారు. వేమగిరి ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. చంద్రబాబు సమయంలో ఏపీ అభివృద్ధిలో నంబర్ వన్‌గా ఉండేదని చెప్పారు. జగన్ ఐదేళ్ల హయాంలో పాలన పట్టాలు తప్పిందంటూ విమర్శించారు.
– మోదీ వ్యాఖ్యలపై మీ కామెంట్..?

News May 6, 2024

కర్నూలు: 3గంటల పోస్టల్ బ్యాలెట్ బులిటెన్ ..23.72% నమోదు

image

ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగస్థులకు కేటాయించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అప్డేట్‌కు సంబంధించి 3గంటల బుల్లెటిన్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన విడుదల చేశారు. కర్నూలు 868, ఎమ్మిగనూరు 848, పాణ్యం 917, పత్తికొండ 536, కోడుమూరు 646, మంత్రాలయం 220, ఆదోని 470, ఆలూరు 462మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మధ్యాహ్నం 3 గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా 23.72% పోలింగ్ నమోదైందని కలెక్టర్ తెలిపారు.

News May 6, 2024

రాజమండ్రి ఎంపీ అభ్యర్థి కావడం నా అదృష్టం: పురంధీశ్వరి

image

రాజమండ్రి ఎంపీ అభ్యర్థి కావడం తన అదృష్టమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధీశ్వరి అన్నారు. రాజమండ్రిలోని వేమగిరిలో ప్రజాగళం సభలో ఆమె మాట్లాడుతూ.. చారిత్రక ఘట్టానికి రాజమండ్రి సాక్షిగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో జగన్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారని, సుపరిపాలనకు కూటమి దోహదపడుతుందన్నారు. ఎన్డీఏ కూటమిని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు.

News May 6, 2024

అన్నమయ్య: హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ క్యాంపులు

image

అన్నమయ్య జిల్లాలో ఈనెల 8, 9వ తేదీల వరకు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నామని జిల్లా డి.ఎమ్.హెచ్.ఓ డాక్టర్ కొండయ్య, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఉషశ్రీ సంయుక్తంగా తెలిపారు. ఈ సంవత్సరం జరిగే హజ్ యాత్రలో పాల్గొనే యాత్రికులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా రెండు కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News May 6, 2024

రాజమండ్రికి చేరుకున్న మోదీ

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ రాజమండ్రికి చేరుకున్నారు. కడియం మండలంలోని వేమగిరిలో ఏర్పాటుచేసిన ప్రజాగళం బహిరంగ సభకు కాసేపట్లో వెళ్లనున్నారు.

News May 6, 2024

అనంతపురం DSPగా ప్రతాప్ కుమార్

image

అనంతపురం అర్బన్ నూతన డీఎస్పీగా టి.వి.వి ప్రతాప్ కుమార్‌ను నియమిస్తూ ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం సాయంత్రం 8 గంటల లోపు అనంతపురంలో విధుల్లో చేరాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై ఫిర్యాదులు రావడంతో ఎన్నికల కమిషనర్ బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

News May 6, 2024

పెద్దమండ్యం: ఎన్నికల ప్రచారంలో నటుడు సాయి కుమార్

image

పెద్దమండ్యం మండలం కలిచర్లలో రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తంబళ్లపల్లి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి ప్రచారం నిర్వహించారు. సోమవారం ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు, సినీ నటుడు సాయి కుమార్ పాల్గొని కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి పాల్గొన్నారు.

News May 6, 2024

కృష్ణా: పోస్టల్ బ్యాలెట్ హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..

image

కృష్ణా జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ సమాచారం, సందేహాల నివృత్తి కోసం ఈ కింది హెల్ప్ లైన్ ఫోన్ నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు.
హెల్ప్ లైన్ నంబర్లు :
గన్నవరం – 9885970848
గుడివాడ – 9676993147
పెడన – 9553125124
మచిలీపట్నం – 9010021352
అవనిగడ్డ – 7981826714
పామర్రు – 9989347699
పెనమలూరు – 9966485895

News May 6, 2024

ఉదయగిరి మండలంలో అకాల వర్షం

image

ఉదయగిరి మండలం కుర్రపల్లి పరిసర ప్రాంతాలలో ఉరుముల మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. మూడు నెలల నుంచి కాస్తున్న ఎండలకు ప్రజలు అల్లాడిపోయారు. అధిక ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈవర్షంతో కొంత ఉపశమనం కలిగింది.

News May 6, 2024

BREAKING: అనంతపురం DIGపై ఈసీ బదిలీ వేటు

image

అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటువేసింది. ఆయనను తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. అమ్మిరెడ్డికి ఎలాంటి ఎన్నికలు విధులు అప్పగించొద్దని ఈసీ ఆదేశించింది.