India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో హీరో సాయి ధరమ్ తేజ్ ప్రచారంలో ఆదివారం రాత్రి జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు జనసేన నుంచి సోమవారం ఒక ప్రకటన విడుదలైంది. దానిలో.. ‘వైసీపీ మార్క్ రౌడీయిజంతో బెదిరించాలని చూస్తే ఉపేక్షించం. YCP అల్లరిమూకల దాడిలో జనసైనికుడు శ్రీధర్ తలకు గాయంకావడం బాధాకరం. వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా పోలీసులు చూస్తూ ఉండటం ఎంతవరకు సమంజసం?’ అని ఉంది.
ఏలూరులోని నిమ్మకాయల యార్డ్ రైల్వే గేట్ సమీపంలో ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ నంబూరి ఆదినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. మృతుడి ఎడమ చేతిపై హిందీలో ‘మా’ అనే పచ్చబొట్టు ఉందని తెలిపారు. రైలు ఢీకొట్టిందా..? లేదా జారిపడ్డాడా..? తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని ఏలూరు ఆసుపత్రికి తరలించామని చెప్పారు.
కైకలూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తరఫున ప్రముఖ సినీ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనను గజమాలతో ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని, టీడీపీ, జనసేన నాయకులు స్వాగతం పలికారు. ఆటపాక నుంచి ఏలూరు రోడ్డు వరకు రోడ్ షో ద్వారా వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటన రద్దయింది. ఈ మేరకు సోమవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ, ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి తెలిపారు. ఈ నెల 9వ తేదీన నరసన్నపేటలో నిర్వహించాల్సిన బహిరంగ సభ రద్దు అయిందని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ విషయాన్ని గుర్తించాలని వారు స్పష్టం చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈనెల 7న దర్శికి రానున్నట్లు టీడీపీ, జనసేన నాయకులు తెలిపారు. దర్శి పట్టణానికి సమీపంలోని శివరాజ్ నగర్ వద్ద హెలీప్యాడ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు. అక్కడే బహిరంగ సభ నిర్వహించేందుకు అధికారుల అనుమతి సైతం కోరినట్లు సమాచారం. సాయంత్రానికి పూర్తి షెడ్యూల్ వెల్లడిస్తామని నాయకులు తెలిపారు.
కోట మండలానికి చెందిన పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరారు. ఉత్తమ నెల్లూరుకు చెందిన దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి, కర్లపూడికి చెందిన దువ్వూరు మోహన్ రెడ్డి, గూడూరుకు చెందిన చింతంరెడ్డి కృష్ణారెడ్డి విజయవాడలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని పల్నాడు రోడ్డులో ఉన్న SSN కాలేజీలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ కేంద్రం బయట టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఓ కారు ధ్వంసమైంది. దీంతో కేంద్ర బలగాలు ఇరువర్గాలను చెదరగొట్టగా.. పలువురు రాళ్లు రువ్వారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇచ్ఛాపురం పట్టణ పరిధిలోని పెద్దాకుల వీధికి చెందిన శ్రీదేవి సుష్మల్(43) మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. ఇచ్ఛాపురం పట్టణంలో బ్యూటీ పార్లర్ నడుపుకుంటున్న శ్రీదేవి ఇంట్లో చిన్నచిన్న తగాదాలతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
తిరుపతి నగరంలోని 32వ డివిజన్‌లో ఉమ్మడి అభ్యర్థి తరఫున ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ ప్రచారం చేశారు. ఉమ్మడి మేనిఫెస్టోని ప్రతి ఇంటికి తిరిగి వివరించారు. ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల్లో సీఎం జగన్ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని అన్నారు. కూటమిలోని జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు అన్నదమ్ముల్లా సమిష్ఠిగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
అనకాపల్లిలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కూటమి MPఅభ్యర్థి CM రమేశ్, YCP అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు..పరస్పర ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ‘ఏ మండలంలో అయితే బూడి ముత్యాలనాయుడు రౌడీలు నన్ను అడ్డుకొని దాడి చేశారో అదే మాడుగుల నియోజకవర్గం,దేవరాపల్లి(M)లో 24 గంటలు గడవకముందే YCPని విడిచి కూటమికి మద్దతు తెలిపిన వేలాది మంది నాయకులు,కార్యకర్తలు’అంటూ CM రమేశ్ ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.