Andhra Pradesh

News May 6, 2024

కడప: ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తాయి?

image

ఎన్నికలు తుది అంఖానికి చేరుకున్నాయి. మరో 7 రోజుల్లో పోలీంగ్ మొదలవుతుంది. దీంతో నాయకులు పథకాలు, హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో YCP పూర్తి పెత్తనం సాగింది. 2014 ఎన్నికలలో 9 స్థానాలు గెలవగా, 2019 ఎన్నికల్లో 10 స్థానాలు కైవసం చేసుకుంది. ఈసారి ప్రధాన పార్టీలైన YCP, TDP కూటమి, కాంగ్రెస్ కడప జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు?

News May 6, 2024

REWIND: ఒకే గ్రామం నుంచి ఇద్దరు MLAలు

image

చాట్రాయికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఎమ్మెల్యేలుగా గెలుపొంది చట్ట సభల్లో అడుగుపెట్టారు. తొలుత మిర్యాల పూర్ణనంద్ తిరువూరు(ఎస్సీ) నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా 1983లో గెలుపోందారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చాట్రాయి మండలం నూజివీడు జనరల్ స్థానంలోకి వచ్చింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో చాట్రాయికే చెందిన చిన్నం రామకోటయ్య నూజివీడు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.

News May 6, 2024

ప్రధాని మోదీ సభ.. వెహికిల్స్ పార్కింగ్ ఇలా..

image

వేమగిరిలో ప్రధాని మోదీ బహిరంగ సభకు వచ్చే వారు వాహనాలను నిర్దేశిత స్థలాల్లోనే పార్కింగ్ చేయాలని పోలీసులు పలు సూచనలు చేశారు. డయాస్ పాస్ కలిగిన నేతల వాహనాలు వేమగిరి జంక్షన్ విందు రెస్టారెంట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రాంతంలో పార్కింగ్ ‌చేయాలన్నారు. వీవీఐపీ పాసులు కలిగిన వాహనాలు 4ఏ వద్ద, విజయవాడ వైపు నుంచి వచ్చే బస్సులు పార్కింగ్-3లో, ఇతర కార్లు, ఆటోలు, బైక్స్ పార్కింగ్-1, 3 స్థలాల్లో నిలపాలన్నారు.

News May 6, 2024

ప్రధాని మోదీ సభ.. వెహికిల్స్ పార్కింగ్ ఇలా..

image

వేమగిరిలో ప్రధాని మోదీ బహిరంగ సభకు వచ్చే వారు వాహనాలను నిర్దేశిత స్థలాల్లోనే పార్కింగ్ చేయాలని పోలీసులు పలు సూచనలు చేశారు. డయాస్ పాస్ కలిగిన నేతల వాహనాలు వేమగిరి జంక్షన్ విందు రెస్టారెంట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రాంతంలో పార్కింగ్ ‌చేయాలన్నారు. వీవీఐపీ పాసులు కలిగిన వాహనాలు 4ఏ వద్ద, విజయవాడ వైపు నుంచి వచ్చే బస్సులు పార్కింగ్-3లో, ఇతర కార్లు, ఆటోలు, బైక్స్ పార్కింగ్-1, 3 స్థలాల్లో నిలపాలన్నారు.

News May 6, 2024

కడప ఎయిర్‌పోర్టు వద్ద రోడ్డు ప్రమాదం

image

కడప ఎయిర్‌పోర్టు సమీపాన గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని వాహనం ఢీ కొట్టినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News May 6, 2024

విశాఖలో నమిత ప్రచారం

image

కూటమి అభ్యర్థులకు మద్దతుగా సినీనటి, బీజేపీ నేత నమిత ప్రచారం నిర్వహించారు. ఆదివారం గజరాజు ప్యాలెస్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర, దేశ అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి భరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

News May 6, 2024

నెల్లూరు: ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య

image

ఓ బాలిక ఇంట్లోని ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు నగరంలోని మధురానగర్ లో ఆదివారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసం ఉంటున్న మమత ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వంటపని చేస్తోంది. ఆమె కుమార్తె ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. మమత శనివారం కావలి వెళ్లగా ఇంట్లో ఉన్న బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 6, 2024

రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌కు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ షరీఫ్ ఆదివారం తెలిపారు. అతని వయసు సుమారుగా 60-65 ఏళ్లు ఉంటుందని ఎస్సై తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు నీలం చోక్కా, లుంగీ ధరించిన్నట్లు పోలీసులు తెలిపారు.

News May 6, 2024

నంద్యాల: రోకలి బండతో దాడి.. యువకుడి మృతి

image

రుద్రవరం మండల కేంద్రంలో ఆదివారం దారుణం జరిగింది. రోకలి బండతో దాడి చేయడంతో కిరణ్(29) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపారు.
గ్రామానికి చెందిన చిటికెల కిరణ్ తన భార్య ప్రణతికి మధ్య శనివారం రాత్రి చిన్నపాటి గొడవ జరిగింది. ఈ విషయాన్ని ప్రణతి తన అన్న పగిడి శ్రీనుకు ఫోన్ చేసి చెప్పింది. W.కొత్తపల్లి గ్రామం నుంచి శ్రీను రుద్రవరం వచ్చి రోకలి బండతో కిరణ్ తలపైన కొట్టగా మృతిచెందాడు.

News May 6, 2024

అద్దంకి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

image

అద్దంకి పట్టణంలో ఆదివారం రోడ్డు ప్రమాదంలో ముండ్లమూరు మండలంలోని సింగన్నపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. అతడిని చికిత్స నిమిత్తం ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వెంకటేశ్వర్లు చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.