India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొత్తచెరువు మండలంలోని ఓ దివ్యాంగురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్టు ఆదివారం మహిళ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మానసిక దివ్యాంగురాలిపై గుర్తు తెలియని వారు అత్యాచారానికి పాల్పడడంతో ఆమె గర్భం దాల్చిందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రమేశ్ తెలిపారు.
కాకినాడ జిల్లా తొండంగిలో విషాదం నెలకొంది. భార్యాభర్తలు పురుగు మందు తాగగా.. చికిత్స పొందుతూ భర్త మృతి చెందినట్లు ఎస్సై వినయ్ ప్రతాప్ తెలిపారు. లోకారెడ్డి శ్రీనివాస్(30)-సౌజన్యకు ఏడాది కింద వివాహమైంది. ఆర్థిక సమస్యలతో వీరిద్దరూ రెండ్రోజుల కింద ఇంట్లోనే సూసైడ్‌కు యత్నించారు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా.. కాకినాడ GGHలో చికిత్స పొందుతూ భర్త శ్రీనివాస్ మృతి చెందాడు. సౌజన్య చికిత్స పొందుతుంది.
కృష్ణా జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ సమాచారం, సందేహాల నివృత్తి కోసం ఈ కింది హెల్ప్ లైన్ ఫోన్ నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు.
జిల్లా స్థాయి హెల్ప్ లైన్ నెంబర్లు :
పోలీస్ – 9030442275
మెడికల్ – 9705351134
ఆర్టీసీ – 9440449840
ఎమర్జెన్సీ సర్వీసెస్ – 8106653305
ఇతర అన్ని శాఖలు – 9494934282
‘కొందరు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు నేను సాయం చేసి బతికించిన వ్యక్తులు, నావల్ల పదవులు పొంది ఎదిగిన వారు,నాకు అవసరమైన సమయంలో నన్ను వదిలి మోసం చేసి వెళ్లారు’ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆ బాధ గుండెను పిండేస్తోందని చెప్పారు. ఆదివారం రాత్రి సత్తెనపల్లిలోని ఆవుల సత్రంలో జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇవేనా మానవ సంబంధాలు అంటూ ప్రశ్నించారు.
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్నాడు. ఆయన ఉదయం 10.05 గంటలకు అనంతపురం జిల్లా నుంచి హెలికాప్టర్‌లో 10.45 గంటలకు కర్నూలు ఏపీ ఎస్పీ రెండో బెటాలియన్‌లోకి చేరుకుంటారు. 11 గంటలకు నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కల్లూరు చెన్నమ్మ కూడలి వద్ద ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 12.40 గంటలకు చెన్నమ్మ కూడలి నుంచి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. 2.30 గంటలకు విమానంలో విశాఖపట్నం వెళ్తారు.
ప్రధాని మోదీ రాజమండ్రి టూర్‌కు సంబంధించి రూట్ మ్యాప్ ఇలా ఉంది. 1:35 PMకు మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 2:25కు రాజమండ్రికి చేరుకుంటారు. అక్కడి నుంచి 2:50కి వేమగిరిలోని హెలిప్యాడ్‌కు వస్తారు. 2:55కు రోడ్డు మార్గాన బయలుదేరి 3 గంటలకు సభా వేదిక వద్దకు చేరుకుంటారు. 3:45 వరకు వేదికపై ఉంటారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి 3:55కి హెలిప్యాడ్‌కు చేరుకొని అనకాపల్లి వెళ్తారు.
సినీ నటుడు నారా రోహిత్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. సోమవారం ఉదయం ఆయన నందిగామ, సాయంత్రం పామర్రులో పర్యటించనున్నట్లు ఆపార్టీ వర్గాలు తెలిపాయి. కూటమి అభ్యర్థులు తంగిరాల సౌమ్య, వర్ల కుమార్ రాజా విజయాన్ని కాంక్షిస్తూ నారా రోహిత్ ప్రచారం చేయనున్నట్లు ఆ పార్టీ నాయకులు చెప్పారు.
తన మాట వినకపోతే చంపేస్తానని వైసీపీ నాయకుడు వడ్ల దాదాపీర్ బెధిరిస్తున్నాడని యువతి ఆరోపించారు. ప్రొద్దుటూరుకు చెందిన ఓ యువతి దాదాపీర్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉండగా మాయమాటలు చెప్పి లైంగికంగా వేధించేవాడని తెలిపారు. పెళ్లి నిశ్చయమైతే పెళ్లి వారికి ఫొటోలు చూపించి బెదిరెంచేవాడని ఆరోపించారు. వేధింపులు తాళలేక ఇల్లు మారితే అక్కడ కూడా ఇలాగే కొనసాగించేవాడని ఆరోపించారు. దీంతో పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.
ఉమ్మడి అనంతలో ఆదివారం గుంతకల్లులో అత్యధికంగా 44.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. తాడిపత్రి, కళ్యాణదుర్గం, పరిగిలో 43.2 నంబులపూటకుంట , ధర్మవరం 43.0 డిగ్రీలు, తలుపుల, పెద్దవడుగూరు 42.8, పుట్టపర్తి 42.4, కదిరి, ఉరవకొండ 42.3, పామిడి 42.2, ముదిగుబ్బ 42.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
ప్రధాని మోదీ నేడు తూ.గో జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ డైవెర్షన్ అమలు చేస్తున్నారు. కడియం మండలం వేమగిరి నేషనల్ హైవే సమీపంలో బహిరంగ సభ జరుగుతుందన్నారు. విజయవాడ-విశాఖ వైపు వెళ్లే వాహనాలు గుండుగొలను, నల్లజర్ల, దేవరపల్లి, గామన్ బ్రిడ్జ్ మీదుగా విశాఖ వెళ్లాలి. తాడేపల్లిగూడెం వైపు వచ్చే వాహనాలు నల్లజర్ల, దేవరపల్లి, గామన్ బ్రిడ్జ్ మీదుగా రావాలని అధికారులు సూచించారు. SHARE IT
Sorry, no posts matched your criteria.