Andhra Pradesh

News May 6, 2024

నేడు అనకాపల్లి జిల్లాకు ప్రధాని మోదీ

image

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఆయన కసింకోట మండలం తాళ్లపాలెం సమీపంలో జరిగే ప్రచార సభలో పాల్గొన్నారు. సాయంత్రం 5:30కు ఆయన సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. తిరిగి 7:10కి విశాఖ ఎయిర్పోర్ట్‌కు వెళ్లనున్నారు. ఈ ప్రచార సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే అధికారులు భద్రత ఏర్పాట్లు పూర్తి చేశారు.

News May 6, 2024

6,927 మంది ఉద్యోగులు ఓట్లేశారు: కలెక్టర్ శుక్లా

image

పోలింగ్ విధులకు కేటాయించబడిన ఉద్యోగులు, సిబ్బంది ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,927 మంది ఉద్యోగులు, సిబ్బంది వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. మొత్తం 11,671 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు.

News May 6, 2024

కాకినాడ జిల్లాలో 4,520 పోస్టల్ ఓట్లు పోల్: కలెక్టర్

image

కాకినాడ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఆదివారం 4,520 ఉద్యోగులు పోస్టల్ ఓట్లు వేశారని ఎన్నికల అధికారి జె.నివాస్ తెలిపారు. మొత్తం 7,944 మందికి గాను 4,520 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. తుని నియోజకవర్గంలో 585 మంది, ప్రత్తిపాడులో 335 మంది, పిఠాపురంలో 764 మంది, కాకినాడ రూరల్ లో 1,207 మంది, పెద్దాపురంలో 510 మంది, కాకినాడ సిటీలో 773 మంది, జగ్గంపేటలో 346 మరి ఓట్లు వేశారన్నారు.

News May 6, 2024

కడప: అధికారులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ అధికారులు సోమవారం తమ పోస్టల్ బ్యాలెట్ ఓటు నమోదు చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆదివారం తెలిపారు. నేడు పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోలేక పోయిన ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్లు తమకు కేటాయించిన నియోజకవర్గ ఫెసిలిటేషన్ సెంటర్లలో ఉదయం 7 గం నుంచి ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News May 6, 2024

ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వినియోగించుకోవాలి: కలెక్టర్

image

భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ పిలుపునిచ్చారు. ఆదివారం కందుకూరులోని‌ బాలికల హైస్కూలులో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను సబ్‌ కలెక్టర్‌ విద్యాధరితో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఓటింగ్‌ సరళిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

News May 6, 2024

ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓటు వేసేలా చర్యలు: కలెక్టర్

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఈనెల 7న ఓపీఓలకు, 8వ తేదీన అత్యవసర సర్వీసులకు అవకాశాన్ని ఇస్తున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. పోస్టల్ ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు, ఓటు కోసం దరఖాస్తు చేసుకోని వారు సైతం తమ ఎన్నికల డ్యూటీ ఆర్డర్, గుర్తింపు కార్డును సంబంధిత ఫెసిలిటేషన్ సెంటర్‌కు తీసుకెళ్లి ఓటు పొందవచ్చునన్నారు.

News May 6, 2024

కోరుకొండలో 7న సీఎం జగన్ సభ: జక్కంపూడి

image

కోరుకొండ మండలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా తెలిపారు. ఈ నెల 7వ తేదీన కోరుకొండ దేవాలయం రోడ్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు భారీగా హాజరై బహిరంగ సభను విజయవంతం చేయాలని జక్కంపూడి రాజా కోరారు.

News May 6, 2024

శ్రీకాకుళం: 7, 8 తేదీల్లో పోస్టల్ ఓటుకు అవకాశం

image

రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశాలతో ఎన్నిక‌ల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్ట‌ల్ బ్యాలెట్ సౌక‌ర్యాన్ని కచ్చితంగా వినియోగించుకొనేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బంది వివిధ కారణాల చేత 4, 5, 6 తేదీలలో ఓటు హక్కు వినియోగించుకోలేకపోతే 7, 8వ తేదీల్లో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయంలో ఓటు వేయొచ్చన్నారు.

News May 6, 2024

గుంటూరు: ఈనెల 10, 16, 22 తేదీలలో పలు రైళ్లు రద్దు

image

ఖాజీపేట- గూడూరు మధ్య 3వ రైల్వే లైన్ నిర్మాణ పనులు కారణంగా ఈ నెల 10, 16, 22 తేదీలలో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు డీఆర్ఎం ఎమ్.రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. రద్దు అయిన రైళ్ల వివరాలు: ట్రైన్ నం. 12705 గుంటూరు- సికింద్రాబాద్, 12706 సికింద్రాబాద్- గుంటూరు, ట్రైన్ నం.17201 గుంటూరు- సికింద్రాబాద్, ట్రైన్ నం.17202 సికింద్రాబాద్- గుంటూరు. ప్రయాణికులు గమనించాలని కోరారు.

News May 6, 2024

చిత్తూరు: పోస్టల్ బ్యాలెట్ వివరాలు

image

పోస్టల్ బ్యాలెట్ వివరాలను అధికారులు ప్రకటించారు. పుంగనూరు 76.3%, నగరి 83%, జీడి నెల్లూరు 79.5%, చిత్తూరు 65%, పూతలపట్టు 75.4% పలమనేరు 71.3% కుప్పం 79. 2 శాతం నమోదు అయినట్టు వారు చెప్పారు. మొత్తం జిల్లాలో 74.3% పోలింగ్ నమోదు అయినట్టు వారు చెప్పారు.