India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గంట్యాడ మండలంలోని వసాది గ్రామానికి చెందిన బొదంకి ఎర్రి నాయుడు(47) పిడుగు పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గంట్యాడ ఎస్సై సురేంద్ర నాయుడు అందించిన వివరాలు ప్రకారం.. మృతుడు పొలంలో పనులు చేసేందుకు వెళ్లగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి 23 రైల్వే సర్వీసులను నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. కడియం- నిడదవోలు మధ్య రైల్వే ట్రాక్‌ల ఆధునికీకరణ నేపథ్యంలో ఆగస్టు 11 వరకు రత్నాచల్, సర్కార్, తదితర ముఖ్యమైన 23 రైళ్లను నిలిపివేశారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి ఈ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల అభ్యర్థన మేరకు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతున్నట్లు పేర్కొన్నారు.

AP- RGUKT పరిధిలోని 4 IIITల్లో 2024 -25 విద్యా సంవత్సరానికి సంబంధించి గత నెల 8న ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ 25న సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఏపీ IIITల్లో ఒకటైన కడప జిల్లా ఇడుపులపాయ 1100 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. గతేడాది కంటే దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చాయని సమాచారం. కాగా ప్రవేశాల తొలి విడత సెలక్షన్ లిస్ట్ జూలై 7న ‘www.rgukt.in’ వెబ్‌సైట్ విడుదల చేయనున్నారు.

సారథి గ్రామానికి చెందిన వంజరాపు సన్యాసినాయుడు (74) అనారోగ్యంతో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో పురుగు మందు ఆదివారం తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తుండగా సోమవారం పరిస్థితి విషమించి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తన కుమారుడైన రవి ఇచ్చిన ఫిర్యాదు పై రాజాం పోలీస్ స్టేషన్ ఏ.ఎస్.ఐ లక్ష్మీనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కర్నూల్ నగరంలోని జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో 54 ఫిర్యాదులు వచ్చాయి. ఎమ్మిగనూరుకు చెందిన మహేశ్ అనే వ్యక్తి ఎయిర్ టెల్, డిటిహెచ్ నెట్ వర్క్‌ల గురించి నేర్పించి, డీలర్ షిప్ ఇప్పిస్తానని చెప్పి రూ.10 లక్షలు తీసుకొని మోసం చేశాడని ఎమ్మిగనూరు చెందిన రమేశ్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ప్రైవేటు కంపెనీల్లో మొత్తం 310 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 27న 10 గంటల నుంచి ఎంఆర్ కాలేజ్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.అరుణ తెలిపారు. హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్‌లో ప్రొడక్షన్, ముత్తూట్ ఫైనాన్స్‌లో రిలేషన్షిప్ ఆఫీసర్, జాబ్ డీలర్స్ కంపెనీలో ఫ్రంట్ ఆఫీస్, టెలీ కాలింగ్, హెల్పర్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ వంటి ఉద్యోగాల భర్తీ జరుగుతుందని తెలిపారు.

విశాఖ బ్యాటింగ్ డైనమెట్, SRH ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇండియా టీ-20 టీంకు ఎంపికైన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించారు. క్రికెట్ చరిత్రలో విశాఖ పేరును ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేస్తున్న సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నితీష్‌ను పలువురు అభినందిస్తున్నారు. ఆయన ఎంపిక పట్ల ACA గౌరవఅధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ప్రొద్దుటూరు టూ టౌన్ పరిధిలో దాదాపు 7ఏళ్ల క్రితం హైందవి(21) అనే యువతి దారుణ హత్య కేసులో నిందితుడు నవీన్ కుమార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1.50 వేలు జరిమానా విధిస్తూ ప్రొద్దుటూరు సెకండ్ ఏ.డీ.జె కోర్టు జడ్జి శ్రీ జి.ఎస్ రమేష్ కుమార్ సోమవారం తీర్పు ఇచ్చారు. కేసును సరైనా సమయంలో సాక్షులను కోర్టు హాజరు పరిచి ముద్దాయికి శిక్ష పడేలా చేసిన కోర్ట్ మానిటరింగ్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

కుప్పం ఆర్టీసీ డిపోలో ఒకప్పుడు 118 బస్సులు ఉండేవి. జిల్లాలో కొత్తగా ఏర్పడిన పుంగనూరుతో పాటు ఇతర డిపోలకు కుప్పం బస్సులు తీసుకెళ్లారు. ఇటీవల చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో వివిధ ప్రాంతాలకు తరలించిన బస్సులను తిరిగి కుప్పానికి తీసుకు వచ్చారు. ఈక్రమంలో 55 బస్సులు ఇవాళ తిరిగి కుప్పం రావడంతో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రభుత్వం మారిన తర్వాత మొదటి కార్యక్రమం కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. కలెక్టర్ ఎం.హరి నారాయణన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్వో లవన్న, జడ్పీ సీఈవో కన్నమ నాయుడు తదితర అధికారులు పాల్గొని అర్జీలు తీసుకున్నారు.
Sorry, no posts matched your criteria.