Andhra Pradesh

News May 5, 2024

ప.గో.: రైలు నుంచి జారిపడి మృతి

image

ప.గో. జిల్లా భీమడోలు రైల్వేస్టేషన్లో రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. ఈ నేపథ్యంలోనే రైల్వే SI ఆదినారాయణ ఘటన స్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరచామన్నారు. మృతుడి శరీరంపై రాజి అనే పేరు, పాము పచ్చబొట్లు ఉన్నాయన్నారు.

News May 5, 2024

షా నోట సత్యకుమార్‌ పేరు.. కార్యకర్తల హర్షం

image

ధర్మవరం ప్రజాగళం సభలో అమిత్ షా ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. ఆయన ప్రసంగాన్ని ధర్మవరం MLA అభ్యర్థి సత్యకుమార్ తెలుగులో వినిపించారు. ‘సత్యకుమార్ నాకు చాలా ఆప్తుడు. ఆయనను గెలిపించాలని మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నా’ అని షా అనగానే బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు చప్పట్లతో సత్యకుమార్‌కు మద్దతు తెలిపారు. తెలుగులో ప్రసంగించలేనందుకు మన్నించాలని చివరలో అమిత్ షా కోరడం విశేషం.

News May 5, 2024

యర్రగుంట్లకు చేరుకున్న కేంద్ర మంత్రి

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కడప జిల్లాలోని యర్రగుంట్లకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ వచ్చారు. ఇందులో భాగంగా కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డి తరఫున ఆయన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

News May 5, 2024

తాడేపల్లిలో రెచ్చిపోయిన బ్లేడ్ బ్యాచ్

image

తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌కి సమీపంలో పెట్రోల్ బంకు దగ్గర పోలీస్ చెక్‌పోస్ట్‌కి సమీపంలో బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయారు. రూ.500 కోసం గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తి మెడపై బ్లేడుతో కోసి గాయపరిచారు. ఘటనా స్థలానికి దగ్గర ఉన్న పోలీసులు గాయపడి కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి చెన్నైకు చెందిన వ్యక్తిగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 5, 2024

చిత్తూరు: ప్రియుడి ఇంటి ముందు నిరసన

image

ఆరేళ్లుగా ప్రేమించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసనకు దిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పాకాల మండలం పాలినాయనపల్లి గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రియురాలు తను కుటుంబ సభ్యులతో కలిసి అతడి ఇంటి గేటు ముందు ఆందోళనకు దిగారు. యువకుడి కుటుంబ సభ్యులు గేట్లకు తాళం వేసి ఇంటి లోపలే ఉన్నట్లు సమాచారం. తాను ఎస్సీ కావడంతో పెళ్లికి నిరాకరిస్తున్నారని యువతి వాపోయింది.

News May 5, 2024

రేపు చందర్లపాడు రానున్న నారా రోహిత్

image

మండల కేంద్రమైన చందర్లపాడు గ్రామంలో సినీ నటుడు నారా రోహిత్ రేపు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ముందుగా మోడ్రన్ సూపర్ మార్కెట్ నుంచి ప్రచారం ప్రారంభమవుతుందని మెయిన్ సెంటర్ స్ట్రీట్ కార్నర్లో మీటింగ్ ఉంటుందని పార్టీ వర్గాలు ప్రకటనలో తెలిపాయి. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు.

News May 5, 2024

ఒంగోలు: సంతకం చేశారు.. స్టాంప్ మరిచారు

image

ఒంగోలులో ఆర్‌ఎం స్కూల్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏర్పాట్లలో లోపాలు తలెత్తడంతో కొద్దిసేపు సందిగ్ధత నెలకొంది. పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఓటు వేసే ముందు వారు సమర్పించే పత్రాల్లో గెజిటెడ్ సంతకంతో పాటు స్టాంప్‌కూడా ఉండాలి. కానీ ఆర్‌ఎం స్కూల్‌లో 16 మంది ఉద్యోగుల పత్రాలపై గెజిటెడ్ సంతకం ఉంది. కానీ స్టాంప్ లేకపోవడాన్ని గుర్తించారు. ఉద్యోగులు కొద్దిసేపు నిరసన తెలిపాక స్టాంప్ వేసి ఓటు వేయించారు.

News May 5, 2024

మచిలీపట్నంలో రేపు సీఎం జగన్ పర్యటన

image

సీఎంగన్ ఈ నెల 6వ తేదీన మచిలీపట్నం రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 6వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు కోనేరుసెంటర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరాయి.

News May 5, 2024

కర్నూలు: ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు

image

కోడుమూరు పట్టణ పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం ఉదయం కారు ట్యాంకర్‌ను ఢీకొట్టింది. కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులు హైదరాబాద్ నుంచి ఎమ్మిగనూరుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 5, 2024

గాజువాకలో క్రికెట్ ఆడిన గుడివాడ అమర్నాథ్

image

గాజువాకలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక జింక్ గ్రౌండ్లో వాకర్స్, క్రీడాకారులను ఆదివారం కలుసుకున్నారు. అనంతరం క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. ఆయన మాట్లాడుతూ గాజువాక ప్రాంతంలో క్రీడాకారులు అధికంగా ఉన్నారని, వీరిని ప్రోత్సహించేందుకు గాజువాకలోని ఓపెన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని చెప్పారు.