Andhra Pradesh

News May 5, 2024

విశాఖ: రోడ్డులో ప్రమాదం.. వ్యక్తి మృతి

image

అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్ లో ఓ ప్రైవేటు జీపు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై పాడేరు వస్తుండగా… మైదాన ప్రాంతం వెళ్తున్న ప్రైవేట్ జీపు డైమండ్ పార్క్ జంక్షన్ సమీప మలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు ముడువ సింహాచలం మృతి చెందాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

News May 5, 2024

ఈసీ నిర్ణయంపై చిత్తూరులో ఉత్కంఠ

image

ఇప్పటికే పుంగనూరు, పలమనేరును అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించి అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. తాజాగా పీలేరు, తంబళ్లపల్లె, చంద్రగిరి, తిరుపతిని ఆ జాబితాలోకి చేర్చింది. ఇక్కడా వెబ్ కాస్టింగ్‌తో పాటు భారీగా బలగాలను మోహరించనుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 స్థానాలు ఉండగా.. దాదాపు సగం ప్రాంతాలపై ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఉత్కంఠ రేపుతోంది.

News May 5, 2024

మహానంది: రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి

image

మహానంది మండలం తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు పండితురాలు భవాని లీలావతమ్మ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. శనివారం ఉదయం హైదరాబాద్ వెళ్లడానికి జడ్చర్ల సమీపంలో ఆటో ఎక్కే ప్రయత్నంలో లారీ ఢీకొనడంతో గాయపడ్డారు. కర్నూల్ ఆసుపత్రికి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఈమె మృతికి ప్రధానోపాధ్యాయుడు నారాయణ, ఉపాధ్యాయ సిబ్బంది సంతాపం తెలిపారు.

News May 5, 2024

ఒంగోలుకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు రాక

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 9న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, 11న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒంగోలుకు రానున్నారు. 9 వతేది పవన్ కళ్యాణ్ రాకుంటే 11వతేది మధ్యాహ్నం 3 గంటలకు నగరంలో రోడ్డుషోలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని కూటమి నాయకులు తెలిపారు. ఎన్నికల ప్రచారానికి 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు తుది గడువు కానున్న నేపథ్యంలో వారి చివరి ప్రసంగం ఒంగోలులోనే ఇవ్వనున్నారు.

News May 5, 2024

పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం.. వ్యక్తి మృతి

image

అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్ లో ఓ ప్రైవేటు జీపు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై పాడేరు వస్తుండగా… మైదాన ప్రాంతం వెళ్తున్న ప్రైవేట్ జీపు డైమండ్ పార్క్ జంక్షన్ సమీప మలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు ముడువ సింహాచలం మృతి చెందాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

News May 5, 2024

గుంటూరులో భారీగా పట్టుబడ్డ బంగారం

image

జిల్లాలో శనివారం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో రూ.18,30,000ల విలువ గల 278.9 గ్రాముల బంగారం జప్తు చేశామన్నారు. మంగళగిరి పరిధిలో 0.75 లీటర్ల మద్యం, తెనాలి పరిధిలో రూ.2,00,000 నగదు సీజ్ చేశామన్నారు. జిల్లాలో మే 4వ తేది సాయంత్రం వరకు రూ.2,99,83,697 విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు.

News May 5, 2024

అనంతపురం DSP వీర రాఘవరెడ్డి బదిలీ

image

అనంతపురం పట్టణ డీఎస్పీ వీర రాఘవరెడ్డిపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ టీడీపీలో కీలక నేతలపై ఆయన ఇటీవల కేసు నమోదు చేయించారనే ఆరోపణలపై టీడీపీ వరుసగా ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. ఈ మేరకు డీఎస్పీని బదిలీ చేస్తూ ఈసీ శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది.

News May 5, 2024

విశాఖ: ఒకే వీధి.. తండ్రిది AP.. కుమారుడిది తెలంగాణ

image

ఒకే వీధిలో ఉన్న ఆ తండ్రీకొడుకులు వేర్వేరు రాష్ట్రాల పరిధిలో నివసిస్తున్నారు. ఉమ్మడి APలోని ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. విజభన తర్వాత ఆయన ఇల్లు మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోకి వచ్చింది. మరోవైపు అదే వీధిలో రోడ్డుకు అటువైపున ఆయన కుమారుడు ఇల్లు కట్టుకుంటుండగా అది ఏపీలోని అరకు లోక్‌సభ స్థానంలో ఉండటం విశేషం.

News May 5, 2024

శ్రీకాకుళం: రూ.4కి పడిపోయిన ధర

image

ఉద్దానంలో అంతర పంటగా పనసను సాగు చేస్తున్నారు. జీడి పిక్కల దిగుబడి లేని సమయంలో ఈ పంటతో వచ్చే ఆదాయం రైతులకు కొంత ఊరట కలుగుతుంది. అలాంటిది పనస దిగుబడి తగ్గగా గిట్టుబాటు ధరలేక రైతులు నిరాశ చెందుతున్నారు. మార్చి, ఏప్రిల్ వరకు కిలో కాయలు ధర రూ. 25 నుంచి రూ. 20 మధ్య ఉండేది. ప్రస్తుతం కిలో రూ.4 వరకు ధర పడిపోయింది. బయట రూ.5 నుంచి రూ. 10 వరకు అమ్ముతున్నారని, రైతు పండించే పంటకు మాత్రం ధర లేదని వాపోతున్నారు.

News May 5, 2024

కర్నూలు: ఆ 4 నియోజకవర్గాలు అత్యంత సమస్యాత్మకం

image

కర్నూలు జిల్లాలో అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీసులు గుర్తించారు. జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉంటే.. అందులో పత్తికొండ, ఆదోని, ఆలూరు, పాణ్యంలు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా పోలీసులు గుర్తించారు. జిల్లాలో మొత్తం 2,204 పోలింగ్ కేంద్రాలు ఉంటే అందులో 330 కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా పేర్కొన్నారు. గతంలో ఎన్నికల సమయంలో జరిగిన గొడవలు, అల్లర్లను దృష్టిలో ఉంచుకొని వీటిని ఎంపిక చేశారు.