Andhra Pradesh

News May 5, 2024

చోడవరం: పోటీలో నిలిచింది ఆరుగురు మాత్రమే..!

image

రాష్ట్రంలో అతి తక్కువ అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గంగా చోడవరం అసెంబ్లీ సెగ్మెంట్ రికార్డు సృష్టించింది. ఇక్కడ కేవలం 6 మాత్రమే బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, వైసీపీ అభ్యర్థిగా కరణం ధర్మశ్రీ, కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీనివాసరావు, బీఎస్పీ అభ్యర్థిగా మహాలక్ష్మి నాయుడు, సీపీఐ ఎంఎల్ పార్టీ అభ్యర్థిగా గణేశ్, ఇండిపెండెంట్‌గా వివేక రాజు బరిలో ఉన్నారు.

News May 5, 2024

బీఎన్ విజయ్ కుమార్‌కు ఎమ్మెల్యేకు గాయాలు

image

సంతనూతలపాడు కూటమి MLA అభ్యర్థి BN విజయ్‌కుమార్‌కు గాయాలయ్యాయి. ఆ పార్టీ శ్రేణుల వివరాల ప్రకారం.. చీమకుర్తి మండలంలోని చీమలమర్రిలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో BN పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలో డ్రోన్ కెమెరా అకస్మాత్తుగా తన మీదకు వచ్చేసింది. వెంటనే ఆయన చేతులను అడ్డుపెట్టుకున్నారు. దీంతో ఆయన చేతి వేళ్లకు స్వల్పగాయాలయ్యాయి. చీమకుర్తిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.

News May 5, 2024

పులివెందుల: జైలు నుంచి భాస్కర్ రెడ్డి విడుదల

image

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి శనివారం చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. కోర్ట్ విధించిన షరతులకు ఆయన శుక్రవారం అంగీకారం తెలిపారు. దీంతో శనివారం సాయంత్రం ఆయన విడుదల అయ్యారు.

News May 5, 2024

గార్లదిన్నె: కుక్కు ఆపరేషన్ చేసి కాపాడారు

image

గార్లదిన్నె మండల కేంద్రంలో ఓ వీధి కుక్క ప్రసవించలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న దానిని స్థానికులు గుర్తించారు. తక్షణమే అనంతపురం పశువైద్యశాలకు తరలించారు. డాక్టర్ పద్మనాభం ఆపరేషన్ చేసి గర్భంలో చనిపోయిన 5 కుక్క పిల్లలను బయటకు తీసి దాని ప్రాణాలు కాపాడారు.

News May 5, 2024

విజయనగరంలో నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా నేడు పోస్టల్ బ్యాలెట్ ప్రారంభం కానుంది. ఆ మేరకు ఫెసిలిటేషన్ సెంటర్లను శనివారం కలెక్టర్ నాగలక్ష్మి తనిఖీ చేశారు.హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి, ఓటు వేయడానికి వచ్చే ఉద్యోగులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. జేసీ కార్తీక్, సహాయ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డీఆర్వో అనిత , డీఆర్డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి , ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

News May 5, 2024

గుంటూరులో భర్తను హత్య చేయించిన భార్య

image

ప్రేమ్ కుమార్ కనిపించడం లేదని అతని భార్య మూడు రోజుల క్రితం కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిర్గాంత పోయే విషయాలు వెలుగు చూశాయి. ప్రేమ్ కుమార్‌ను అతని భార్య వేరే వ్యక్తితో సాన్నిహిత్య సంబంధం పెట్టుకొని భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం రచించింది. ఆమె ప్రియుడు వారం రోజుల క్రితం ప్రేమ్ కుమార్‌కు మద్యం తాపించి హత్య చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.

News May 5, 2024

నేడు జమ్మలమడుగుకు కేంద్ర మంత్రి.. ఏర్పాట్లు పూర్తి

image

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ నేడు కడప జిల్లాకు రానున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మలమడుగు కూటమి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను పోలీసు అధికారులు పరిశీలించారు. ఇప్పటికే పర్యటనలో భాగంగా రోడ్ షో, బహిరంగ సభ ఏర్పాట్లను సంబంధించి నాయకులు పూర్తి చేశారు.

News May 5, 2024

గుంటూరు రైల్వే డివిజన్లో నిలిచిన పలు రైళ్లు

image

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో నల్గొండ-పగిడిపల్లి మార్గంలో శనివారం పలు రైళ్లు నిలిచిపోయాయి. చెన్నై ఎక్స్ ప్రెస్(12603), సికింద్రాబాద్ నుంచి వస్తున్న ప్రత్యేక రైలు(00632)కు విద్యుత్తు సరఫరా అయ్యే పాంటూలు (మెయిన్ లైన్ నుంచి రైలుకు విద్యుత్ సరఫరా చేసే పరికరం) విరిగిపోవడంతో.. విష్ణుపురం స్టేషన్లో అకస్మాత్తుగా ఆగిపోయాయి. విరిగిన పరికరాలను బాగు చేసిన తర్వాత ఆ రైళ్లు అక్కడి నుంచి కదిలాయి.

News May 5, 2024

నీట్-2024కు ఆరు కేంద్రాల్లో ఏర్పాట్లు

image

ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశనిమిత్తం నీట్-2024ను ఆదివారం నిర్వహించనున్నారు. జిల్లాలోని అక్షర విద్యాలయం, వీఆర్ ఐపీఎస్, కోవూరు గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాల, కావలి ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, తడలోని పద్మావతి సీబీఎస్ఈ, గూడూరు శ్రీచైతన్య స్కూలులో పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమయ్యే పరీక్షకు 4500 మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు.

News May 5, 2024

శ్రీకాకుళం: దివ్యాంగ ఓటర్లు 21,481 మంది

image

శ్రీకాకుళం జిల్లాలో దివ్యంగా ఓటర్లు 21,481 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అందులో అత్యధికంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో 31,44 మంది, అత్యల్పంగా ఆముదాలవలస నియోజకవర్గంలో 2,255 ఉన్నారు. శ్రీకాకుళంలో 2,724, నరసన్నపేటలో 2,981, టెక్కలి 2,649, పాతపట్నం 2,380, పలాస 2,573, ఇచ్చాపురం 2,775 మంది ఓటర్లు ఉన్నట్టు అధికారులు స్పష్టం చేశారు.