India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సాధారణ ఎన్నికలు-2024లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలకు సంబంధించి స్థానిక ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను శనివారం సాయంత్రం సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పరిశీలించారు. అనంతరం అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కాబోతోంది. ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఓటు హక్కు వినియోగించకునేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ప్రక్రియ జరగనుంది. ఓటర్లు తమ ఫెసిలిటేషన్ సెంటరులోనే ఓటు హక్కు వినియోగించుకోవాల్సివుంది . ఈ క్రమంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒంగోలులోని జిల్లా జైలులో ములాఖత్ వేళలు మార్పు చేసినట్లు జిల్లా కారాగార పర్యవేక్షణ అధికారి వరుణ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వేసవికాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ములాఖత్ లు నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 15వ తేదీ వరకు ఈ సమయం కొనసాగుతుందని చెప్పారు. కావున జిల్లా ఖైదీల బంధువులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
స్వేచ్ఛగా ప్రతి ఓటరూ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా ఆదేశించారు. శనివారం ఆయన అనకాపల్లి కలెక్టరు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. వివిధ విభాగాల ద్వారా ఎన్నికల ప్రక్రియకు అనుసరిస్తున్న విధానాలపై ముఖేష్ కుమార్ మీనాకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రవి సుభాష్ వివరించారు.
మే 12, 13 తేదీల్లో ప్రచురించే రాజకీయ ప్రకటనలకు మీడియా సర్టిఫికేషన్ కమిటీ అనుమతి తప్పనిసరి అని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ చెప్పారు. ముందస్తు అనుమతి లేకుండా పోలింగ్ రోజు, పోలింగ్‌కు ముందు రోజు ప్రింట్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించకూడదని చెప్పారు. ఎన్నికల సందర్భంగా గతంలో ప్రింట్ మీడియాలో అభ్యంతరకరమైన, తప్పుదారి పట్టించే ప్రకటనలు ప్రచురితమయ్యాయని గుర్తుచేశారు.
జిల్లాలో ఓటు కలిగి జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు వారి స్వంత నియోజకవర్గాలలోని ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి ఈ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు మే 5, 6 తేదీల్లో శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలన్నారు.
వైఎస్ఆర్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా చేపట్టే పోలీసు భద్రతా, నిఘా చర్యలను మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకులు దీపక్ మిశ్రా ఎన్నికల నిర్వహణ అధికారులకు సూచించారు. కర్నూలు రేంజ్ డీఐజీ విజయ్ రావు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.విజయ్ రామరాజు, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు కునాల్ సిల్కు సమావేశం నిర్వహించారు.
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో MPED మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/, http://www.schools9.com/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియకు ఫెసిలిటేషన్ కేంద్రాలను అధికారులు కేటాయించారు. రాజాం- (ప్రభుత్వ ఉన్నత పాఠశాల, RTC కాంప్లెక్స్ దరి), బొబ్బిలి-(మున్సిపల్ పాఠశాల గొల్లపల్లి), చీపురుపల్లి-( శ్రీరామ్ జూనియర్ కాలేజ్, SDS కాలేజ్), గజపతినగరం-(బాలికల ఉన్నత పాఠశాల, పురిటిపెంట), నెల్లిమర్ల-(CKMకాలేజ్, MIMS పక్కన), విజయనగరం-(JNTU), శృంగవరపుకోట -(ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ఎస్ కోట)లో ఏర్పాటు చేశారు.
పల్నాడు జిల్లాలో సమస్యాత్మక నియోజకవర్గాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. వీటిలో గురజాల, వినుకొండ, పెదకూరపాడు, మాచర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ రోజున ప్రత్యేక సీఆర్పిఎఫ్ బలగాలు అదనంగా ఉంటాయన్నారు. అలాగే వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని పర్యవేక్షించేందుకు లైవ్ టెలికాస్ట్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఈసీ తెలిపింది.
Sorry, no posts matched your criteria.