India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బెంగళూరు కేంద్రంగా జరిగిన మిస్సెస్ ఇండియా పోటీల్లో తిరుపతి వాసి సత్తా చాటింది. జైపూర్‌కు చెందిన స్టార్‌లైట్ సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల మిస్సెస్ ఇండియా పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా తిరుపతి నగరానికి చెందిన పుష్ప పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచారు. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన పుష్ప ఫ్యాషన్ రంగంలో ఆసక్తితో ఈ పోటీల్లో పాల్గొని అదరగొట్టారు. ఆమెను పలువురు జిల్లా వాసులు అభినందించారు.

వేంపల్లి మండలంలోని ఇడుపులపాయ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ గార్డ్ ఎద్దుల రాజీవ్ ప్రసాద్ మృతి చెందాడు. వేంపల్లిలో నివాసం ఉంటున్న రాజీవ్ ప్రసాద్ ఆదివారం యథావిధిగా ద్విచక్ర వాహనంలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి విధులకు వెళ్లి తిరిగి వస్తుండగా వైయస్సార్ ఘాట్ సమీపంలో అదుపుతప్పి గోతిలో పడిపోయాడు. తీవ్ర గాయాల పాలైన అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తండేల్. ఈ సినిమా నేపథ్యమంతా శ్రీకాకుళం చుట్టూనే ఉంటుందని చిత్ర కథా రచయిత కార్తీక్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఎచ్చెర్ల మండలం, కూనపేటలో పుట్టిన తాను సినిమాపై ఆసక్తితో 2012లో హైదరాబాద్‌కు వచ్చానన్నారు. 2018లో జిల్లాలోని కొంత మంది మత్స్యకారులు పొరపాటున సరిహద్దు దాటి 14 నెలలు పాకిస్థాన్‌లో ఉండగా.. ఆ నేపథ్యాన్నే సినిమాగా తీస్తున్నామన్నారు.

విశాఖ నుంచి బయలుదేరే ఇంటర్ సిటీ రైళ్లనే రద్దు చేయడంపై ప్రయాణికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను యథావిధిగా నడుపుతూ వీటినే ఎందుకు రద్దు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా రద్దు చేయకుండా కనీసం రాజమహేంద్రవరం వరకు నడపాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. జన్మభూమి, రత్నాచల్ తదితర రైళ్ల ఛార్జీలకు 4 రెట్లు బస్ ఛార్జీలు ఉంటున్నాయని మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు.

విశాఖ నుంచి బయలుదేరే ఇంటర్ సిటీ రైళ్లనే రద్దు చేయడంపై ప్రయాణికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను యథావిధిగా నడుపుతూ వీటినే ఎందుకు రద్దు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా రద్దు చేయకుండా కనీసం రాజమహేంద్రవరం వరకు నడపాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. జన్మభూమి, రత్నాచల్ తదితర రైళ్ల ఛార్జీలకు 4 రెట్లు బస్ ఛార్జీలు ఉంటున్నాయని మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు.

పవన్‌ను దూషించిన వారిపై కేసునమోదైన ఘటన జంగారెడ్డిగూడెం మండలంలో జరిగింది. లక్కవరం ఎస్సై సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం.. పుట్లగట్లగూడెం గ్రామంలో వైసీపీ మండలాధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, మరో ముగ్గురు స్థానిక పాఠశాల సమీపంలో పవన్‌కళ్యాణ్‌పై దూషణలకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని జనసేన నాయకుడు కంచర్ల మణికంఠ స్వామి గమనించి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీంతో ఆ నలుగురిపై కేసు నమోదుచేశామన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ప్రైవేటు టీచర్ల సమస్యలు తీసుకెళ్తానని మాజీ MLA ఎస్వీఎస్ఎస్ వర్మ చెప్పారు. పిఠాపురం మమతా హైస్కూల్లో ఆదివారం జరిగిన ప్రైవేట్ టీచర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కూడా సమస్యలపై చర్చిస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ప్రజల సమస్యలను పట్టించుకోలేదని వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మర్రిపాడు: కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి జాడ మంగళవారం తెలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఒక కారుపై పెద్దపులి దాడి చేసినట్లు వచ్చిన వార్త ఆధారంగా అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో పెద్దపులి జాడ తెలుసుకునేందుకు 35 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నిరంతర పర్యవేక్షణ కోసం ఉదయగిరి, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, రాపూరు అధికారులు విధులు నిర్వహిస్తున్నారు.

కనిగిరికి చెందిన రసూల్ (32) అనే వ్యక్తి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఘన్‌పూర్ శివారులో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రసూల్ కొన్నేళ్ల క్రితం చుక్కాపూర్ అనే గ్రామానికి వలసవెళ్లాడు. ఆదివారం సాయంత్రం నడుచుకుంటూ ఘన్‌పూర్ గ్రామం వైపు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా.. కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో మరణించాడు.

గుండెపోటుతో నరసింహులు అనే ఉపాధ్యాయుడు మృతి చెందారు. గుత్తి మండలంలోని కె.ఊబిచెర్ల గ్రామంలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నరసింహులు ఆదివారం రాత్రి గుండెపోటుతో అనంతపురం నగరంలోని సవేరా ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఉపాధ్యాయ వర్గాలు తెలిపాయి. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. ఆయన మృతిపై ఉపాధ్యాయుల సంఘం సభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.