India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా నియమితులైన రంజిత్ బాషా 2018లో పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా ఉన్న నారా లోకేశ్ వద్ద ఓఎస్డీగా విధులు నిర్వహించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వమే ఆయనకు కలెక్టర్‌గా పదోన్నతి కల్పించింది. ఇక బాల్యంలో ఆయన విద్యాభ్యాసం జిల్లాలోనే సాగింది. నందికొట్కూరులోని సంతపేట పాఠశాల, ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని ఏపీ గురుకులం, నందికొట్కూరు ప్రభుత్వ కళాశాలల్లో 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివారు.

చిత్తూరు జిల్లాలోని మార్కెట్లలో టమాట ధర రోజురోజుకీ పెరుగుతోంది. టమాట మార్కెట్లో గత పది రోజులుగా ధరలు పెరుగుతూ ప్రస్తుతం 14 కిలోల బాక్సు ధర రూ.1000 నుంచి రూ.1090కి చేరుకుంది. బయటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు జిల్లాలోని మార్కెట్లకు తరలి వస్తుండడం, ఇదే సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో పంట లేకపోవడంతో ధరల పెరుగుదలకు కారణమైందని వ్యాపారులు చెబుతున్నారు.

బీహెచ్ సీరీస్ వాహనాల కొనుగోలు ద్వారా పన్ను ఎగ్గొట్టే వారిపై రవాణా శాఖ అధికారులు ఉక్కు పాదం మోపారు. 56 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.1.19 కోట్ల పన్నులు వసూలు చేసినట్లు జిల్లా ఉపరవాణా కమిషనర్ రాజా రత్నం తెలిపారు. వారి నుంచి అపరాధ రుసుం రూ.10 లక్షలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వాహనాలపై ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టి వాహనదారులపై కేసులు కూడా నమోదు చేసినట్లు చెప్పారు.

మద్యం మత్తులో ఓ వ్యక్తి పురుగుమందు తాగి మృతిచెందిన ఘటన కొమరాడ మండలంలో జరిగింది. అర్తాం గ్రామానికి చెందిన శంకరరావు(39) ఆదివారం మద్యం తాగి.. ఆ మత్తులో పురుగు మందును తాగాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లగా కుటుంబ సభ్యులు గమనించి పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోతే ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం మాట్లాడుతూ.. మా నాన్న ఎమ్మెల్యేగా ఉండేవాడు. నాకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదంలో ఆయనను కోల్పోయాను. రోడ్లు బాగుంటే ప్రమాదాలు జరగవు. జగన్ ప్రభుత్వం రోడ్లను పట్టించుకోలేదన్నారు. రెండు నెలల్లో రోడ్ల బాగుపై దృష్టిపెడతామన్నారు.

యువతిని వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడికి చెందిన పండు కొంతకాలంగా ఓ యువతి వెంటపడి తిరుగుతున్నాడు. ఆమెను ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. దీంతో ఆమె సమిశ్రగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. దీనిపై కేసు నమోదు చేశామని పోలీసులు ఆదివారం తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ప్రైవేటు టీచర్ల సమస్యలు తీసుకెళ్తానని మాజీ MLA ఎస్వీఎస్ఎస్ వర్మ చెప్పారు. పిఠాపురం మమతా హైస్కూల్లో ఆదివారం జరిగిన ప్రైవేట్ టీచర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కూడా సమస్యలపై చర్చిస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ప్రజల సమస్యలను పట్టించుకోలేదని వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొవ్వూరు గోష్పాదక్షేత్రం ప్రధానరేవులో శనివారం లభ్యమైన వృద్ధురాలి మృతదేహానికి సంబంధించి ఆచూకీ తెలిసినట్లు SI జుబేర్ తెలిపారు. వివరాలు.. ఏలూరు జిల్లా తంగెళ్లమూడి పరిధి కండ్రికగూడేనికి చెందిన పార్వతి(74) అనారోగ్యంతో బాధపడుతున్నారు. 9 నెలల క్రితం భర్త మృతిచెందగా.. కుమారుల వద్ద ఉంటున్నారు. ఈ మధ్యే ఆమెకు అత్యవసర వైద్యం చేయించారు. కొడుకులకు అప్పులు ఉండగా భారం కావొద్దని గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

జిల్లాలో సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషించిన పలువురి వాలంటీర్ల భవిష్యత్తు నేడు ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికలకు ముందు దాదాపు 8,784 మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. ప్రభుత్వం మారడంతో వారంతా లబోదిబో మంటున్నారు. వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడికి వారంతా మొర పెట్టుకున్నారు.

లారీ ఢీకొనడంతో విద్యుత్తు శాఖలో జూనియర్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న హేమంత్ దుర్మరణం చెందారు. భాస్కరపేటలో నివాసముంటున్న హేమంత్ ఆదివారం మిట్టకండ్రిగలోని సొంతింటికి వెళ్లి రాత్రి బైకుపై భార్య దివ్యతో కలిసి బయలుదేరారు. హౌసింగుబోర్డు కాలనీ వద్ద బైకును వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో హేమంత్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.