India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుమ్మడి కోటేశ్వరరావును పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పాక వెంకట సత్యనారాయణ శనివారం తెలిపారు. పార్టీ నియమావళికి వ్యతిరేకంగా మాచర్ల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో పాటు నామినేషన్ ఉపసంహరించుకోవాలని పలుమార్లు సూచించినప్పటికీ నామినేషన్ వెనక్కితీసుకోకపోవడంతో బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దర్శికి చేరుకున్నారు. దర్శిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రసంగించనున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
70 ఏళ్ల క్రితమే విశాఖ రాజధాని కావాలని గొంతెత్తిన సాలూరు మొదటి ఎమ్మెల్యే కూనిశెట్టి వెంకటనారాయణ దొర. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో గెలిచిన కూనిశెట్టి 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్ర అసెంబ్లీలో ఆనాడే ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలంటే విశాఖ రాజధాని కావాలని గొంతెత్తారు. ప్రతిపాదనపై ఓటింగ్ జరిగితే ఒకే ఒక్క ఓటుతో తీర్మానం వీగిపోయింది.
నియోజవర్గ కేంద్రంలోని ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. 4, 6 తేదీలలో జిల్లాలో నిర్వహించే పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 4, 6 తేదీల్లో పీఓ, ఏపీఓలకు ఆయా నియోజకవర్గాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామన్నారు. ఓపీఓలకు ఏడో తేదీ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు.
1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మెరకముడిదాం మండలం గర్భాంకి చెందిన తాడ్డె చినఅచ్చిన్నాయుడు తొలిసారి గెలుపొందారు. 1955లో జరిగిన ఎన్నికల్లో మెరకముడిదాంకి చెందిన ముదుండి సత్యనారాయణరాజు, 1962లో అదే మండలంలో చినబంటుపల్లికి చెందిన కోట్ల సన్యాసప్పలనాయుడు, 1967లో గర్భాంకు చెందిన తాడ్డె రామారావు, 1972లో ఇప్పలవలసకు చెందిన రౌతు పైడపునాయుడులు వరుసగా విజయం సాధించారు.
అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి సప్లిమెంటరీ ఈవీఎంల ర్యాండమైజేషన్ పారదర్శకంగా నిర్వహించామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో నగర పాలక కమిషనర్ మేఘ స్వరూప్‌తో కలిసి ఎన్నికల్లో పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు, పార్టీల ప్రతినిధుల సమక్షంలో సప్లిమెంటరీ ఈవీఎంల ర్యాండమైజేషన్ నిర్వహించారు.
తాటిమాకుల కండ్రిగ గ్రామానికి చెందిన మహేశ్ బాబు(49) పొలం వద్ద బోరు మోటార్ మరమ్మతుకు గురైంది. మెకానిక్ సాయంతో బోరు నుంచి పైపులు బయటకు తీస్తుండగా చేతిలోని ఇనుప పైపు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగపై పడటంతో అతను విద్యుత్ షాక్‌కు గురై కిందపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించగా అక్కడ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఎచ్చెర్ల నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు నివాసానికి సినీ హిరో నారా రోహిత్ శనివారం ఉదయం విచ్చేశారు. ఆయనకు నియోజకవర్గ నాయకులు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి ఈశ్వరరావుతో నియోజకవర్గంలో కూటమి బలోపేతానికి తీసుకున్న చర్యలు, పార్టీకి వస్తున్న ఆదరణను రోహిత్‌కు వివరించారు. రానున్న ఎన్నికల్లో విజయమే గెలుపుగా అందరూ కృషి చేయాలని కోరారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత మరింత అధికమైంది. గత ఏడాది వరకు ఉష్ణోగ్రతలు గరిష్టంగా 46 డిగ్రీల వరకే ఉన్నాయి. మొదటిసారి నంద్యాల జిల్లాలోని మూడు మండలాల్లో శుక్రవారం దాదాపు 48 డిగ్రీలకు చేరువ కావడం గమనార్హం. బండిఆత్మకూరు, గోస్పాడులో 47.7 డిగ్రీలు, నందికొట్కూరులో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది.
ప్రధాని మోదీ ఈనెల 6న అనకాపల్లి రానున్నారు. రాజమండ్రి నుంచి హెలికాప్టర్లో సాయంత్రం 5 గంటలకు అనకాపల్లి రాజుపాలెం వస్తారు. అక్కడ నుంచి బహిరంగ సభ వేదిక వద్దకు రోడ్డు మార్గంలో వెళతారు. సాయంత్రం 5.45 గంటల నుంచి 6.35 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడ నుంచి రాత్రి 7.10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7.15 గంటలకు ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ బయలుదేరి వెళతారు.
Sorry, no posts matched your criteria.