India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సోమవారం నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10:30కు ప్రారంభం అవుతుందన్నారు. తమ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తామని ఈ అవకాశాన్ని వినియోగించుకోవల్సిందిగా ఆయన కోరారు. ఫిర్యాదులు తెలిపేందుకు ఇది ఒక మంచి అవకాశమని అన్నారు.

విశాఖ రెవెన్యూ డివిజన్ పరిధిలో సోమవారం నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రారంభం కానుందని, విశాఖపట్నం ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు విశాఖపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో వినతుల స్వీకరణ కార్యక్రమం మొదలవుతుందని, అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అమలు చేస్తున్న మతతత్వ, కార్పొరేట్ విధానాలపై దేశవ్యాప్తంగా ఐక్యపోరాటాలు చేయడం ద్వారానే ప్రభుత్వరంగ సంస్థలను, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోగలమని సీపీఎం రాష్ట్ర నాయకుడు వై.సిద్దయ్య తెలిపారు. చీరాలలో జరుగుతున్న సీపీఎం జిల్లా శిక్షణ తరగతులలో ఆయన బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య శక్తులను కలుపుకొని పోరాటాలు చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని వివరించారు.

ఈనెల 24న సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో “మీకోసం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక”(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని ఉ.10గం.ల నుంచి మ.1గం.వరకు నిర్వహించనున్నట్లు కమిషనర్ అదితి సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇకపై ప్రతి సోమవారం కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు.

ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం పేరు మారింది. ప్రభుత్వ మార్పిడితో స్పందన కార్యక్రమాన్ని ‘మీ కోసం’ కార్యక్రమంగా పేరు మార్చారు. మీ కోసం పేరుతో ప్రతి సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

మంగళగిరి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో నారా లోకేశ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్ర క్యాబినెట్లో లోకేశ్‌కి స్థానం దక్కింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 9.45 గంటలకు వెలగపూడిలో ఉన్న రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాక్‌లోని ఆయన ఛాంబర్‌లో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతల స్వీకరించనున్నారు.

సిక్కోలు వాకిట కొలువైన ఆరోగ్య ప్రదాత శ్రీ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం సమకూరిన ఆదాయ వివరాలను ఈవో చంద్రశేఖర్ వెల్లడించారు. స్వామివారికి టికెట్లు రూపేనా రూ.3,08,400, పూజలు, విరాళాల రూపంలో రూ.71,749 ఆదాయం వచ్చిందన్నారు. అలాగే ప్రసాదాల రూపంలో రూ.2,24,860 స్వామి వారికి ఆదాయం వచ్చిందని తెలిపారు. మొత్తం రూ.6,05,009 ఆదాయం సమకూరిందని తెలిపారు.

ఏలూరు జిల్లా లక్కవరం పోలీసు స్టేషన్‌లో వైసీపీ నేతలపై కేసు నమోదైనట్లు ఎస్సై సుధీర్ తెలిపారు. వైసీపీ మండలాధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, మరో ముగ్గురిపై స్థానిక జనసేన నేత కంచర్ల మణికంఠ స్వామి ఫిర్యాదు చేయగా.. నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలను దుర్భాషలాడటంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను దూషించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సై సుధీర్ తెలిపారు.

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని సినీ డైరెక్టర్ హను రాఘవపూడి ఈరోజు దర్శించుకున్నారు. నూతనంగా ప్రభాస్‌తో చిత్రీకరిస్తున్న సినిమా స్క్రిప్ట్‌కు లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పూజలు చేయించారు. అనంతరం అర్చకులు వారికి వేద ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో సఖినేటిపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముప్పర్తి నాని, వనమాల మూలస్వామి, శంకరగుప్తం నాని, తదితరులు పాల్గొన్నారు.

కడప నగరంలోని పీవీఆర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 30వ తేదీన జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి తెలిపారు. అండర్ -19 జూనియర్ విభాగం, సీనియర్ విభాగంలో పురుషులు, మహిళల విభాగం ఎంపికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విడివిడిగా ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.