Andhra Pradesh

News June 23, 2024

శ్రీకాకుళంలో భార్యా పిల్లల అదృశ్యం

image

ఇచ్చాపురం మండలం డొంకూరు గ్రామంలో భార్య పిల్లలు కనిపించడం లేదంటూ భర్త చంద్రయ్య ఇచ్చాపురం ఎస్ఐ లక్ష్మణరావుకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వివరాలు.. తొమ్మిదేళ్ల కిందట బాధితుడికి రాములమ్మతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈనెల 13న భర్త చేపలవేటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య, పిల్లలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల, తెలిసినచోట్ల వెతికినా ఆచూకి లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

News June 23, 2024

విధుల నుంచి రిలీజ్ అయిన గుంటూరు కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీ అయిన గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి ఆదివారం విధుల నుంచి రిలీవ్ అయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారికి చార్జీని అప్పగించారు. విజయనగరం జిల్లా నుంచి గుంటూరు జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన ఎస్.నాగలక్ష్మి బుధవారం ఉదయం గుంటూరు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

News June 23, 2024

పుంగనూరు: బీసీవై పార్టీ కమిటీల రద్దు

image

భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి కమిటీలు, సభ్యత్వాలు పూర్తిగా రద్దు చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలోనే పూర్తిస్థాయి కమిటీల నియామకం, సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని ఆ ప్రకటనలో తెలియజేశారు.

News June 23, 2024

శ్రీకాకుళం: ఏపీ పీఈసెట్-2024 హాల్ టికెట్లు విడుదల

image

డీపీఈడీ/బీపీఈడీ కోర్సులలో ప్రవేశాలకై నిర్వహించే పీఈసెట్-2024 ఫిజికల్ టెస్ట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పీఈసెట్ అభ్యర్థులకు ఈ నెల 25న ఉదయం 7 గంటల నుంచి ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తామని ఏపీ ఉన్నత విద్యామండలి(APSCHE) తెలిపింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని APSCHE సూచించింది.

News June 23, 2024

విశాఖపట్నం: మూడు జిల్లాల రెవెన్యూ కమిటీ తీర్మానం ఏర్పాటు

image

విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల రెవెన్యూ కమిటీ తీర్మానం రాష్ట్ర అధ్యక్షుడు కోన.ఆంజనేయ కుమార్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల రాష్ట్రసంఘం & APJAC కలిసి పనిచేయుటకు తీర్మానించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. వీఆర్వోల సమస్యలను కలిసి కట్టుగా పరిష్కరించేందుకు సిద్ధమవ్వాలని సూచించారు. మూడు జిల్లాల VROల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

News June 23, 2024

నంద్యాలలో భర్తను హత్య చేసిన భార్య

image

నంద్యాల పట్టణంలోని రెండవ పట్టణ పోలీసు స్టేషన్‌కు కూత వేటు దూరంలోని సుద్దుల పేటలో హత్య జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. భర్తను భార్యే కత్తెరతో పొడిచింది. తీవ్ర గాయాలైన అతడిని నంద్యాల జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News June 23, 2024

అన్నమయ్య: ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

image

అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం సానిపాయ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు ఎర్రచందనం దుంగలతో పాటు కారు, మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి సానిపాయ పరిధిలో కూంబింగ్ చేపట్టగా అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు కారులో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూ కనిపించగా, అరెస్ట్ చేశామని తెలిపారు.

News June 23, 2024

VZM: ఎస్సైపై దాడి.. నిందితుడిపై కేసు నమోదు

image

ట్రాఫిక్ ఎస్సైపై దాడి చేసిన ఘటనలో నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ బీ.వెంకటరావు అన్నారు. శనివారం రాత్రి ట్రాఫిక్ ఎస్సై లోవరాజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా మయూరి జంక్షన్ వద్ద విధులు నిర్వహిస్తుండగా గర్భాం గ్రామానికి చెందిన ఏ.నరేశ్ బైక్‌ను ఆపి పరీక్షలు నిర్వహిస్తుండగా అతను దుర్భాషలాడుతూ.. ఎస్సైపై దాడికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

News June 23, 2024

చంద్రగిరి: గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యం

image

చంద్రగిరి మండల పరిధిలోని కందులవారిపల్లి గ్రామ సమీపంలోని భీమానది కట్టపై గుర్తుతెలియని యువకుడు మృతదేహం లభ్యమైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. యువకుడి చేతిపై ధనమ్మ అని పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడు ఆచూకీ ఎవరికైనా తెలిస్తే చంద్రగిరి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

News June 23, 2024

రేపటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు: APSDMA

image

ఒడిశా తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో 4 రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈనెల 25, 26, 27 తేదీలలో జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రేపు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.