India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గూడూరు మండలంలో ఓ బాలికపై జరిగిన అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. గూడూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన నరేశ్, గణేశ్ అనే యువకులు ఓ బాలికను భయభ్రాంతులకు గురిచేసి వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేసినట్టు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గూడూరు రూరల్ ఎస్సై మనోజ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పులివెందులలో నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఇందులో భాగంగా వైఎస్ జగన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మేయర్ సురేశ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

అమెరికాలో బాపట్ల నియోజకవర్గానికి చెందిన యువకుడు దాసరి గోపికృష్ణ మృతి చెందడం పట్ల సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. యువకుడి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. దుండగుల దాడి ఘటనలో గోపికృష్ణ మృతి చెందటం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఆదివారం గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్, టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మనోహర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు పట్టణ అధ్యక్షుడు డేగల ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న తాగునీటి ఎద్దడి, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆదివారం కలెక్టరేట్‌లో పెమ్మసాని, ఎమ్మెల్యే నజీర్, ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి గుంటూరు నగర అభివృద్ధిపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్ ప్రాజెక్టులపై డీపీఆర్‌లను 30-45 రోజుల్లో సిద్ధం చేయాలని ఆదేశించారు.

గత ఐదేళ్లలో మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి కఠినంగా శిక్షించాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ.. బాలినేని అనుచరులు భూకబ్జాలు చేస్తూ దొంగ రిజిస్ట్రేషన్లతో పట్టణంలో భయానక వాతావరణాన్ని సృష్టించారన్నారు. తక్షణమే సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలన్నారు.

ప్రతి సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ” ద్వారా ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించే కార్యక్రమాన్ని పటిష్ఠంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు పేర్కొన్నారు. ఈనెల 24వ తేదీ నుంచి ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ప్రజా ఫిర్యాదుల స్వీకరణ వేదిక ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు.

లోక్‌సభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని సీఎం చంద్రబాబు నియమించారు. ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె తాజా ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి పోచా బ్రహానందరెడ్డిపై విజయం సాధించారు.

ఏపీ కళింగ, కోమటి నూతన అధ్యక్షుడుగా శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలికి చెందిన బోయిన గోవిందరాజులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనిపై టెక్కలి నియోజకవర్గ కళింగ కోమటి సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా, టెక్కలి నియోజకవర్గ ప్రజలు ఆయనకు అభినందనలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికవ్వడంపై గోవిందరాజులు హర్ష వ్యక్తం చేశారు.

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆదివారం చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. స్కూలు విద్యార్థులు డ్రాప్ అవుట్స్ లేకుండా చూడాలని స్కూలు ప్రధానోపాధ్యాయులకు తెలిపారు. పాఠ్య పుస్తకాలు సక్రమంగా పంపిణీ చేయాలని, మౌళిక వసతులు మెరుగు పరచాలని సూచించారు
Sorry, no posts matched your criteria.