Andhra Pradesh

News June 23, 2024

సూళ్లూరుపేట: భర్త పై భార్య హత్యాయత్నం

image

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం అబాక పంచాయతీలోని అమ్మలపాడు గ్రామంలో కారిమేటి ఉదయ్ కుమార్‌పై అతని భార్య మస్తానమ్మ సలసల కాగుతున్న వంట నూనెను పోసి చంపాలని ప్రయత్నించింది. ఉదయకుమార్‌‌కు తీవ్రగాయాలు కావడంతో సూళ్లూరుపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 23, 2024

‘పిఠాపురంలో గోవధ’ అంటూ వీడియో వైరల్

image

పిఠాపురంలోని వీరరాఘవపురంలో గోవధ జరుగుతుందంటూ ఓ అజ్ఞాత వ్యక్తి తనకు వీడియో పంపినట్లు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ‘X’లో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని తమ MLA, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చేరవేయాలని కోరినట్లు తెలిపారు. ఈ ఘటన నిజమే అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చేలోపు అధికారులు చర్యలు తీసుకోవాలని బొలిశెట్టి సత్యనారాయణ కోరారు.
➠ NOTE: అభ్యంతరకరంగా ఉన్న దృష్ట్యా వీడియో అప్‌లోడ్ చేయలేదు.

News June 23, 2024

వెంకయ్యను కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని

image

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ వెంకయ్య నాయుడిని కలిశారు. ఈ మేరకు ఆదివారం ఆయన్ను ఢిల్లీలో కలిసినట్లు ఎంపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీ పుష్పగుచ్ఛం అందజేశారు.

News June 23, 2024

ఒక్క కంప్లైంట్‌తో అల్లకల్లోలం: బొలిశెట్టి

image

జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఇచ్చిన ఒక్క కంప్లైంట్‌తో వైసీపీ రాజ్యం అల్లకల్లోలం అయిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. జనసేన 20 మంది ఎమ్మెల్యేలు, డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరిపై దృష్టి పెడితే వీరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించడానికి చాలా కష్టంగా ఉందని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఇప్పటికి వెలుగు చూసినవి కొన్ని మాత్రమేనని అన్నారు.

News June 23, 2024

కర్నూలు: తపాల ఉద్యోగి సూసైడ్

image

పొలాల్లో చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. కోడుమూరు మండలం ముడుమాలగుర్తికి చెందిన మల్లికార్జున్ కర్నూలులో ఉంటూ పోస్టు ఆఫీసులో విధులు నిర్వహించేవారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలోని పంట పొలాల్లో ఉరివేసుకొని మృతిచెందారు. ఆదివారం పొలాలకు వెళ్తున్న రైతులు గుర్తించి ఉండవెల్లి పోలీసులకు సమాచారం అందించారు.

News June 23, 2024

చిత్తూరు ప్రజలకు గమనిక

image

చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు.

News June 23, 2024

జగ్గంపేట: శిలాఫలకం ధ్వంసం.. YCP శ్రేణుల ఫైర్

image

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి ధ్వంసం చేశారు. ఈ ఏడాది మార్చి 2వ తేదీన రూ.51.48 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంక్ శిలాఫలకాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రారంభించారు. ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

News June 23, 2024

శ్రీకాకుళం: గురుకుల మిగులు సీట్ల భర్తీకి ఆహ్వానం

image

పాతపట్నం డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ గురుకులంలో 6 నుంచి 9వ తరగతులలో మిగులు సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వి.అర్చన తెలిపారు. సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థులు ఈనెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. పాఠశాలలో 29న ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా సీటు కేటాయిస్తామని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికే సీటు కేటాయిస్తామన్నారు.

News June 23, 2024

శ్రీసత్యసాయి: మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి అనారోగ్యంతో మృతి

image

ముదిగుబ్బ మండలం మలకవేముల గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సద్దపల్లి వెంకటరెడ్డి అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. ఆయన నల్లమాడ నియోజవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా 1985 నుంచి 1989 వరకు పనిచేశారు. సోమవారం ఉదయం 11గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలియజేశారు.

News June 23, 2024

వేటపాలెం: సముద్ర స్నానానికి వచ్చి ఇద్దరు యువకుల మృతి

image

వేటపాలెంలో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంగళగిరికి చెందిన 12 మంది యువకులు వేటపాలెం మండలంలోని రామాపురం బీచ్‌కు వెళ్లారు. వీరంతా సముద్ర స్నానానికి దిగగా.. అందులో ఇద్దరు మృతిచెందారు. చనిపోయిన వారిని బాలసాయి(26), బాలనాగేశ్వరరావు(27)గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.