India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప.గో జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ వైస్ ఛైర్మన్ కిలాడి ప్రసాద్ తెలుగుదేశం పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం సాయంత్రం తాడేపల్లిగూడెంలోని హంగ్రీ బర్డ్స్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. పార్టీలో సముచిత స్థానం కల్పించకపోవడంతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కిలాడి శ్రీను, కోలా శ్రీనివాసరావు ఉన్నారు.
చంద్రబాబు నాయుడు గతంలో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రిగా కొనసాగారని, మళ్లీ కొత్త అబద్ధాలు చెబుతూ మీ ముందుకు వస్తున్నారని, ఆయన మాటలు నమ్మొద్దని, మీ కుటుంబాలలో మంచి జరిగి ఉంటే వైసీపీకి ఓటు వేయాలని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రజలను కోరారు. శుక్రవారం పాములపాడు మండలంలోని వాడాల, మద్దూరు, వేంపెంట, బానకచర్ల, భానుముక్కల, గ్రామాల్లో ప్రచారం చేశారు.చంద్రబాబు అబద్ధాల కోరు అని విమర్శించారు.
మదనపల్లె మండలంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. వేంపల్లి గ్రామంలోని సతీశ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం బెంగళూరు నుంచి ఇంటికి వచ్చిన సతీశ్ నేడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యతో విడాకులు తీసుకోవడం, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. విజయవాడ నుంచి బయలుదేరి శనివారం ఉదయం 10.10 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10:35 గంటలకు హిందూపురంలోని ఎంజీఎం మైదానానికి హెలికాప్టర్‌లో వస్తారు. అక్కడి నుంచి బహిరంగ సభకు చేరుకుంటారు. సభ అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్తారు.
గత నెల 30వ తేదీన కమలాపురంలో <<13149211>>యువకుడు హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. తాజాగా నిందితులను కమలాపురం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. మృతుడు సయ్యద్ మహమ్మద్ ఘనికి ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్ ముబారక్ అనే వ్యక్తికి మధ్య జరిగిన చిన్నపాటి గొడవలే కారణమన్నారు. ముబారక్‌తో పాటు మరో 9 మంది హత్య కేసులో నిందితులను పందిర్లపల్లె వద్ద డీఎస్పీ షరీఫ్ ఆదేశాలతో అరెస్టు చేసినట్లు తెలిపారు.
పోస్టల్ బ్యాలెట్ జాగ్రత్తగా స్ట్రాంగ్ రూం నందు భద్ర పరచాలని కలెక్టర్ మనజీర్ జీలాని సమూన్ అన్నారు. ఎన్నికల సామగ్రి పోలింగ్ ముందు రోజు డిస్ట్రిబ్యూషన్, పోల్ అయ్యాక రిసెప్షన్ సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు, పర్యవేక్షణ 24X7 ఉండాలని అన్నారు. పోలింగ్ కి 72 గం.ల ముందు నగదు, మద్యం, ఉచితాల పంపిణీ వంటివి జరగకుండా పటిష్ఠ నిఘా ఉండాలని అధికారులకు సూచించారు.
గుంటూరు వ్యక్తి మృతిపై శుక్రవారం లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిన్నా టవర్ సెంటర్ దగ్గర్లోని లక్ష్మీ తులసి మెడికల్ షాప్ దగ్గర సుమారు 45 ఏళ్ల వయస్సు గల మగ వ్యక్తి ఆపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. గుంటూరు GGHకు తరలించగా డాక్టర్లు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అతని వివరాలు తెలియరాలేదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
గిద్దలూరు పట్టణంలోని ఎంపీడివో ఆఫీసు సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని జీపు ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్‌ను గెలిపించాలని సినీ నటుడు, హిందూపూరం ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ శుక్రవారం సాయంత్రం పిలుపునిచ్చారు. విశాఖ తూర్పులో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం విశాఖను దోచుకుందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ఎన్నికలలో ఎండగడతారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి రోజా బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్నారని శ్రీశైలం ఆలయ ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రోజా గెలిచిన తర్వాత పార్టీ నేతలను పట్టించుకోలేదని విమర్శించారు. పార్టీ సర్వేలో ఆమె ఓడిపోతుందని తేలిందన్నారు. రోజా వల్ల నగరి కేడర్ దెబ్బతిందన్నారు.
Sorry, no posts matched your criteria.