Andhra Pradesh

News May 3, 2024

బైక్‌పై 6 కిలోల గంజాయి.. యువకుల అరెస్ట్

image

వై.రామవరం మండలం డొంకరాయి సమీపంలో బైక్‌పై 6 కిలోల గంజాయిని తరలిస్తుండగా ఇద్దరు యువకులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు SI శివకుమార్ తెలిపారు. విశాఖ అటవీ ప్రాంతం నుంచి జగ్గయ్యపేటకు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామని పేర్కొన్నారు. జగ్గయ్యపేటకు చెందిన గోపి, నరేంద్రను అరెస్ట్ చేశామన్నారు. ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. గంజాయి పట్టుబడిందని ఎస్సై వివరించారు.

News May 3, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో హోం ఓటింగ్‌కు 1,025 మంది ఓటర్లు

image

శ్రీ సత్యసాయి జిల్లాలో 1,025 మంది ఓటర్లు హోం ఓటింగ్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోనున్నారని జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 499 మంది, వికలాంగులు 526 మంది ఈనెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అర్హులైన వారు హోం ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలిపారు.

News May 3, 2024

పవన్‌ కళ్యాణ్ పొన్నూరు పర్యటనలో మార్పులు

image

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పొన్నూరు పర్యటన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈనెల 5న పవన్ ఉదయం 10 గంటలకు, హెలికాప్టర్‌లో పొన్నూరులోని సజ్జ ఫంక్షన్ హాల్ ఎదురు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం ఐలాండ్ సెంటర్‌లో ఆచార్య ఎన్జీరంగా విగ్రహం వద్ద 11 గంటలకు భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 12 గంటలకు పవన్ తిరుగు పయనమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

News May 3, 2024

శ్రీకాకుళం: హింసకు తావు లేని ఎన్నికలే లక్ష్యం

image

రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా, రీ పోలింగ్ జరగకుండా ఉండేలా పని చేయడమే ప్రధాన లక్ష్యం కావాలని భారత ఎన్నికల కమిషన్, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నారు. శుక్రవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు సీనియర్ అధికారి శేఖర్ విద్యార్థి హాజరయ్యారు.

News May 3, 2024

బాలకృష్ణ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి బొత్స

image

చీపురుపల్లి ఎన్నికల రోడ్‌షో‌లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తండ్రి పేరు చెప్పుకొని బ్రతికే బాలకృష్ణ తమ గురించి మాట్లాడటమేంటని ప్రశ్నించారు. గడిచిన ఐదేళ్లలో విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని, తెలుసుకోవాలని హితవు పలికారు. పింఛన్లు ఆపేసిన పాపం ఊరికే పోదన్నారు.

News May 3, 2024

శ్రీకాకుళం: ఈ నెల 7న నారా లోకేశ్ రాక

image

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం కార్యక్రమానికి ఈ నెల 7న శ్రీకాకుళం విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా నగరంలోని 80 అడుగుల రోడ్డులో బహిరంగ ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ శుక్రవారం పరిశీలించారు. లోకేశ్ రాకకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. యువగళం సభ విజయవంతం చేయాలని కోరారు.

News May 3, 2024

రేపు నెల్లూరుకు సీఎం జగన్

image

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నెల్లూరు జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 3.20 గంటలకు ఆయన నెల్లూరు వీఆర్ కళాశాల మైదానంలో హెలికాప్టర్లో దిగుతారు. అనంతరం వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం 3.50 నుంచి 4.35 వరకు బహిరంగ సభ ఉంటుంది. ఈ పర్యటన విజయవంతం చేయాలని వైసీపీ నేతలు కోరారు.

News May 3, 2024

విశాఖ: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

image

మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో HSL కాంప్లెక్స్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం చెందగా మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి దుర్మరణం చెందాడు. వీరు ముగ్గురు కొమ్మాదిలో ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నారు. మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీఐ దాశరథి తెలిపారు.

News May 3, 2024

కాకినాడ జిల్లాలో పలుచోట్ల వర్షం

image

కాకినాడ జిల్లాలో పలుచోట్ల ఈరోజు చిరు జల్లులు కురిశాయి. కొద్దిరోజులుగా తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ చినుకులు కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి. తుని నియోజకవర్గంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది. మబ్బులు కమ్మేసి వర్షం పడింది. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపం చూపించగా.. మధ్యాహ్నం 3:30గంటల వేళ వాతావరణం చల్లబడి గాలులు వీస్తూ, వర్షం కురిసింది. మీ ఏరియాలో చినుకులు పడ్డాయా..? కామెంట్ చేయండి.

News May 3, 2024

రాజంపేట యువతతో రేపు నారా లోకేశ్ ముఖాముఖి

image

18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు గల రాజంపేట యువతీ, యువకులతో శనివారం నారా లోకేశ్ స్వయంగా మాట్లాడుతారని రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ సుగవాసి బాల సుబ్రహ్మణ్యం తెలిపారు. రాజంపేట మండలం కూచివారిపల్లి పంచాయతీ విద్యానగర్‌లో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు లోకేశ్ ముఖాముఖి ఉంటుందని తెలిపారు. యువతీ యువకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.