India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొండాపురం మండలం వెంకటాపురం వద్ద శుక్రవారం ఉదయం ఇన్నోవా, బైక్ ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ముద్దనూరు మండలం తిమ్మారెడ్డి పల్లె గ్రామానికి చెందిన శివ శంకర్ అనే వ్యక్తి బైకులో తన సొంత గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా ఇన్నోవా కారు వచ్చి ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా బైక్‌లో ప్రయాణిస్తున్న అతని భార్యకు గాయాలవ్వడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు.
గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని సొంత అన్న నారాయణరెడ్డి కట్టెతో దాడి చేసి హత్య చేశాడు. గురువారం రాత్రి అర్ధరాత్రి నిద్రలో ఉన్న రామకృష్ణారెడ్డిపై మద్యం మత్తులో నారాయణరెడ్డి దాడి చేసి చంపాడు. గుంతకల్లు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 3 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అధికారులకు సూచించారు. ఆయన కౌన్సిల్ హాలులో ఎన్నికల అధికారులతో మాట్లాడారు. 80 ఏళ్లుపైన ఉండి హోమ్ ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు.
నంద్యాలలో శుక్రవారం నిర్వహించనున్న యవగళం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొంటారని నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ తెలిపారు. నంద్యాల పట్టణంలోని రాణి మహారాణి థియేటర్ వెనుకభాగంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కావున జిల్లాలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.
రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన వృద్ధురాలు బండి సత్యవతి (73) గురువారం రాత్రి అనారోగ్య కారణంగా మృతి చెందారు. కుమారుడు బండి నర్సింహులు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వచ్చిన వైద్యులు మృతదేహం నుంచి నేత్రాలను సేకరించారు. తాను చనిపోయినా తన కళ్లు వేరొకరికి ఉపయోగపడాలనే గొప్ప ఆశయంతో నేత్రదానం చేసిన కుటుంబ సభ్యుల ఆశయాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.
ఇవాళ ప్రకాశం జిల్లాకు జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రానున్నారు. కూటమి అభ్యర్థులను మద్దతుగా గిద్దలూరులో ఏర్పాటు చేసిన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొదిలిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం జగన్ కనిగిరిలో పర్యటించనున్నారు. దీంతో జిల్లాలో పార్టీ అధినేతలు వస్తుండటంతో అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును CM జగన్ కచ్చితంగా అమలు చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. పుంగనూరు ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘చంద్రబాబు అధికారంలోకి వస్తే చట్టాన్ని రద్దు చేస్తానంటున్నారు. ఆయన గెలవడు, చట్టం రద్దు చేసేదీ లేదు. పింఛన లబ్ధిదారుల కష్టాలకు చంద్రబాబు బంధువు నిమ్మగడ్డ రమేశే కారణం. ఆయన వాలంటీర్లపై ఫిర్యాదు చేయడంతో ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వడం లేదు’ అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6వ తేదీన ప్రధాన మోదీ రాజమండ్రిలో పర్యటించనున్నారు. కడియం మండలంలోని వేమగిరి జాతీయ రహదారిపై కూటమి ఆధ్వర్యంలో విజయ శంఖారావం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రధానితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.
కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్వతీపురంలో గురువారం పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థి కొత్తపల్లి గీతతో కలిసి చినబొండపల్లిలో జరిగన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మన్యం జిల్లాలో ఏనుగుల బెడద తప్పిస్తామని హామీ ఇచ్చారు. అరకు పార్లమెంట్ పరిధిలో రోడ్లు, నీళ్లు, విద్యుత్తు, కమ్యూనికేషన్ మొదలగు వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.
నంద్యాల జిల్లాలోని 8 మండలాల్లో 46 డిగ్రీలపైన, 10 మండలాల్లో 45 డిగ్రీలకు పైన, 4 మండలాల్లో 44 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బనగానపల్లి, డోన్‌లో 46.7, ఆళ్లగడ్డలో 46.6, మహానందిలో 46.4, నందికొట్కూరు, సంజామలలో 46.3, దొర్నిపాడు, కోవెలకుంట్లలో 46.1, పాణ్యంలో 45.9, మిడుతూరులో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.