India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం జిల్లా నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కార్పొరేట్ సీబీఎస్ఈ పాఠశాలల్లో ప్రవేశానికి ఉమ్మడి జిల్లా నుంచి 30 మంది అర్హత సాధించినట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సమన్వయకర్త ఎ. మురళీకృష్ణ తెలిపారు. జాతీయస్థాయిలో నిర్వహించిన శ్రేష్ఠ ప్రవేశ పరీక్షలో 30 మంది 3వేల లోపు ర్యాంకులు సాధించారని ఆయన తెలిపారు.

తనపై చిరుత పులి దాడి చేసిందని శనివారం ఓ మహిళ ఆరోపించారు. నంద్యాలలోని పచ్చర్ల గ్రామంలో షేక్ బీబీ అనే మహిళ తన ఇంట్లో నిద్రిస్తుండగా, చిరుత పులి అకస్మాత్తుగా వచ్చి తల భాగంపై దాడి చేసిందని, ఆమె కేకలు వేయడంతో సమీపంలోని అడవి ప్రాంతంలోకి పారిపోయిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాడిపత్రి మండలంలోని బ్రాహ్మణపల్లిలో శనివారం రాత్రి వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్త చెన్నారెడ్డి ఇంటి ముందు ఉన్న రహదారిపై వర్షపునీరు నిలబడుతున్నాయని మట్టిని ఎత్తుగా వేశారు. దీంతో ఆ నీరంతా టీడీపీ నాయకుడు కథాలప్ప ఇంటి ముందుకు రావడంతో మట్టిని ట్రాక్టర్ తో తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని ఐదు మందికి గాయాలయ్యాయి.

కాకినాడ జిల్లాలో అతిసారం విజృంభిస్తోంది. పదుల సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతుండగా.. శనివారం ఓ మహిళ మృతి సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. తొలుత తొండంగి మండలం కొమ్మనాపల్లి, బెండపూడిలో ప్రభలిన ఈ వ్యాధి.. ఇప్పుడు సామర్లకోట మండలం వేట్లపాలెం జొన్నలదొడ్డి ప్రాంతానికి విస్తరించింది. 3 రోజుల్లో 31 మంది దీని బారినపడగా.. 15మంది ఆసుపత్రిలో చేరారు. మరోవైపు అధికారులు గ్రామాల్లో వైద్యశిబిరాలతో చికిత్స అందిస్తున్నారు.

హోంమినిస్టర్ వంగలపూడి అనితను కలవడానికి వచ్చిన బీజేపీ నాయకుడు గాయపడినట్లు సమాచారం. శనివారం తిరుమల దర్శనార్థం హోం మినిస్టర్ వెళ్తుండగా అలిపిరి గరుడ సర్కిల్ వద్ద తిరుపతి పట్టణానికి చెందిన బీజేపీ నాయకుడు ప్రభాకర్ నాయుడు వంగలపూడి అనితను సన్మానించడానికి వచ్చారు. కాన్వాయ్‌లోని ఓ వాహనం దూసుకెళ్లి ఢీకొట్టడంతో ఆయన గాయపడగా.. రుయా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తమీమ్ అన్సారియాను బదిలీ చేశారు. ఆమెను ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 2015 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె అంతకుముందు అన్నమయ్య జిల్లా జేసీగా పని చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థానిక మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం అభివృద్ధికి ఆమె తన వంతుగా కృషి చేశారు.

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరం వద్ద శుక్రవారం నలుగురు యువకులు గల్లంతు కాగా అందరూ చనిపోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. పెదవేగి మండలం దుగ్గిరాలకు చెందిన 11 మంది యువకులు సముద్ర స్నానం కోసం రామాపురం వెళ్లారు. ఈ క్రమంలో నలుగురు గల్లంతయ్యారు. వీరిలో తేజ(17), కిశోర్(18) అదే రోజు లభ్యం కాగా.. నితిన్ (18), అమల్ రాజు (18) మృతదేహాలు తాజాగా తీరానికి కొట్టుకొచ్చాయి. ఈ మేరకు కేసు నమోదైంది.

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని మూడు ప్రభుత్వ, 29 ప్రైవేట్ ఐటిఐల్లో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటిఐలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీకాంత్ తెలిపారు. మిగులు సీట్లను ఈ నెల 24 నుంచి భర్తీ చేస్తామని తెలిపారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ పూర్తి చేసుకుని కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని సూచించారు.

బీమా సొమ్ము కోసం బామ్మర్దిని బావ హత్య చేసిన ఘటన చెన్నూరులో జరిగింది. కనుపర్తి చెందిన నారాయణరెడ్డి పేరున చెన్నూరుకు చెందిన అతని సోదరి భర్త బాల గురుప్రసాద్‌రెడ్డి రూ.12.5 లక్షలకు 2 బీమా పాలసీలు చేయించారు. నామినీగా అతని సోదరి పేరు నమోదు చేయించారు. బీమా సొమ్ము కోసం 18న చెన్నూరు శివారులో మద్యం మత్తులో ఉన్న నారాయణరెడ్డిని అతని బావ తలపై దిమ్మెతో కొట్టి హతమార్చినట్లు సీఐ శంకర్ నాయక్ తెలిపారు.

మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముండ్లమూరు మండలం శంకరాపురంలో శనివారం వెలుగు చూసింది. పరుశురాం కుమారుడు జమదగ్ని (19) ఒంగోలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఇటీవల విడుదల చేసిన సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. మనస్తాపానికి గురై ఊరికి దూరంగా ఉన్న పొలాల్లో ఉరేసుకొని విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై పరిశీలించి కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.