Andhra Pradesh

News May 3, 2024

బ్యాంకు లావాదేవీలపై నివేదికలు ఇవ్వండి: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బ్యాంక్ లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతిరోజు నివేదికలు అందజేయాలని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు అన్ని బ్యాంకుల రీజినల్ మేనేజర్లను సూచించారు గురువారం ఆయన చాంబర్లో ఛాంబర్‌లో బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఒకరి కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్లు జరిపినట్లయితే సంబంధిత వివరాల డేటాను ఇవ్వాలన్నారు.

News May 3, 2024

నన్నయలో ఎంఎస్సీ జియోఇన్ఫర్మేటిక్స్ కోర్సు

image

రాజమండ్రిలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఎంఎస్సీ జియోఇన్ఫర్మేటిక్స్ కోర్సు ప్రారంభిస్తున్నామని, ఏపీ పీజీ సెట్ ద్వారా విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశం పొందవచ్చునని వీసీ ఆచార్య కె.పద్మరాజు తెలిపారు. గురువారం యూనివర్సిటీలో దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వివరాలు వెల్లడించారు. మే 4 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఫెలోషిప్‌ లభిస్తాయన్నారు.

News May 3, 2024

ఎన్నికల రోజు చిన్న సమస్యకు కూడా తావు లేకుండా చూడండి: ఎస్పీ

image

బుక్కరాయసముద్రం మండలంలో అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ గురువారం పర్యటించారు. మండల పరిధిలోని వెంకటాపురం, చెన్నంపల్లి, అగ్రహారం, బుక్కరాయసముద్రంలోని సమస్య ఆత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ రోజు బారికేడ్లు, తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గ్రామాలలో పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రాణాళికా బద్ధంగా బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచనలు, సలహాలు అందజేశారు.

News May 3, 2024

ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి: ఏలూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్

image

ఏలూరు జిల్లాలో అక్రమంగా మద్యం తరలిస్తున్న 9మంది వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్.ఎస్.కుమరేశ్వరన్ గురువారం తెలిపారు. వారి నుంచి 207 మద్యం బాటిల్స్, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లా శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎక్కడైనా అక్రమంగా మద్యం, తదితరాలపై ఫిర్యాదులుంటే 08812-355350 నెంబర్‌కు ఫోన్ చేసి తెలపాని సూచించారు. SHARE IT

News May 3, 2024

ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా విధులు నిర్వర్తించాలి: ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికలకు పోలీస్ అధికారులు, సిబ్బంది ఎలాంటి ఘటనలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశించారు. బద్వేలు ఆర్డీవో కార్యాలయం మీటింగ్ హాలులో నియోజకవర్గ పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎన్నికల నేపథ్యంలో కార్యాచరణ ప్రణాళికపై ఎస్పీ దిశా నిర్దేశం చేశారు.

News May 3, 2024

మాచర్ల నియోజకవర్గంలో ఓటర్లు ఎంతమందంటే!

image

మాచర్ల నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,62,404 ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి జె. శ్యామ్‌ప్రసాద్ గురువారం తెలిపారు. పురుషుల సంఖ్య 1,28,639, స్త్రీల సంఖ్య 1,33,743, ఇతరులు 22 ఉన్నారని చెప్పారు. నియోజకవర్గంలో 299 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. వీటిలో 151 క్రిటికల్ పోలింగ్ బూత్‌లు ఉన్నాయని వెల్లడించారు. సాధారణ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి కోరారు.

News May 3, 2024

సూక్ష్మ పరిశీలకుల శిక్షణ ర్యాండమైజేషన్ పూర్తి: మన్యం కలెక్టర్

image

సాధారణ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు నియమించిన సూక్ష్మ పరిశీలకుల (మైక్రో అబ్జర్వర్ల) శిక్షణ ర్యాండమైజేషన్ గురువారం పూర్తి చేసారు. కలెక్టరేట్‌లో పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు ప్రమోద్ కుమార్ మెహార్థ సమక్షంలో, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూక్ష్మ పరిశీలకుల శిక్షణ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు.

News May 3, 2024

శ్రీకాకుళం: స్ట్రాంగ్ రూమ్ మ్యాప్ల పరిశీలన

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ చాంబర్‌లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్ల మ్యాప్లను ఎన్నికల పరిశీలకులు శేఖర్ విద్యార్థి, తలత్ పర్వేజ్ ఇక్బాల్ రోహెల్ల, జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జిలానీ సమూన్ పరిశీలించారు. అనంతరం పలువురు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వారు పేర్కొన్నారు. వారితో పాటుగా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఎస్పీ జి.ఆర్ రాధిక ఉన్నారు.

News May 3, 2024

ఈవీఎం స్ట్రాంగ్ రూమును పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్

image

నందిగామ పట్టణ పరిధిలోని కెవిఆర్ కళాశాలలోని ఈవీఎం స్ట్రాంగ్ రూములను ఎన్నికల పరిశీలకులు నరేంద్ర సింగ్ బాలి గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని పోలింగ్ కేంద్రాల్లో అధిక శాతంలో పోలింగ్ జరిగే విధంగా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. పలు పోలింగ్ కేంద్రాలలోని మౌలిక వసతులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో RDO తదితరులు పాల్గొన్నారు.

News May 2, 2024

పాలకొల్లులో హ్యాట్రిక్ రికార్డ్ నమోదయ్యేనా..?

image

పాలకొల్లు నియోజకవర్గ ఓటర్ల ఇంతవరకు ఏ ఎమ్మెల్యేకూ ‘హ్యాట్రిక్ విజయం’ ఇవ్వలేదు. ఈ నియోజకవర్గానికి 70ఏళ్ల చరిత్ర ఉండగా.. 1955 నుంచి ఇప్పటివరకు 14సార్లు ఎన్నికలు జరిగాయి. 1983, 85తో పాటు 1994, 99 ఎన్నికల్లో వరుసగా అల్లు వెంకటసత్యనారాయన గెలిచారు. ఈ 2సార్లూ ఆయన హ్యాట్రిక్ కోసం యత్నించినా ఓటమి చవి చూశారు. 2014, 19 ఎన్నికల్లో విజయం సాధించిన నిమ్మల ఈసారి హ్యాట్రిక్ కొట్టి రికార్డ్ తిరగరాసేనా..? చూడాలి.