Andhra Pradesh

News May 2, 2024

నంద్యాల: వైసీపీని వీడిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు.. టీడీపీలో చేరిక..!

image

నంద్యాలకు చెందిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుడు డాక్టర్ రవికృష్ణ వైసీపీని వీడారు. గురువారం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను దారికి తెచ్చే సామర్థ్యం చంద్రబాబుకే ఉందని రవికృష్ణ తెలిపారు. 

News May 2, 2024

కాకినాడ: వాగులో మునిగి ఇద్దరు యువకుల మృతి

image

కాకినాడ జిల్లా సామర్లకోటలో విషాదఛాయలు అలుముకున్నాయి. బ్రౌన్‌పేటలోని గణేశ్‌కాలనీకి చెందిన ఇద్దరు యువకులు రంపచోడవరం సమీపంలోని సీతపల్లి వాగులో మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గురువారం సామర్లకోట నుంచి సీతపల్లి వాగుకు 13మంది యువకులు విహారయాత్రకు వెళ్లారు. వారిలో గణేష్ కాలనీకి చెందిన ఇద్దరు యువకులు నీటిలో దిగగా.. ఊబీలో కూరుకుపోయి మృతి చెందినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 2, 2024

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

image

చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో ఈనెల 4వ తేదీన సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లను అడిషనల్ ఎస్పీ ఆరిఫుల్లా, ఎమ్మెల్యే వెంకటే గౌడ పరిశీలించారు. గంగవరంలోని యూనివర్సల్ స్కూల్ మైదానంలో హెలిపాడ్ స్థలం, ఎంబీటీ రోడ్డు వద్ద సభస్థలాన్ని అధికారులు పరిశీలించారు.

News May 2, 2024

ఈనెల 4న అవనిగడ్డలో పవన్ కళ్యాణ్ పర్యటన

image

ఈనెల 4వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవనిగడ్డ పర్యటనకు విచ్చేస్తున్నట్లు నియోజకవర్గ జనసేన అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ గురువారం తెలిపారు. సాయంత్రం 6 గంటలకు వారాహి యాత్రలో భాగంగా అవనిగడ్డ సభలో ప్రసంగిస్తారన్నారు. నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

News May 2, 2024

VZM: రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

గొట్లాం, గరుడబిల్లి రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృత దేహాన్ని గురువారం గుర్తించామని రైల్వే పోలీసులు తెలిపారు. ట్రైన్ ఢీకొట్టిందా లేదా ట్రైన్ నుంచి జారిపడి మృతిచెందాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని విజయనగరం ఆస్పత్రికి తరలించామని జీఆర్పీ హెచ్సీ కృష్ణారావు తెలిపారు. వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు VZM, BBL GRP స్టేషన్‌‌లకి తెలపాలని కోరారు.

News May 2, 2024

మరికొద్ది సేపట్లో శ్రీకాకుళం జిల్లాకు పవన్ కళ్యాణ్

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు శ్రీకాకుళం జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. దీనిలో భాగంగా నేడు సాయంత్రం 4 గంటలకు పాలకొండ నియోజకవర్గంలో ఒడమ జంక్షన్‌‌లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు. ఈ సభకు భారీగా జనసైనికులు రానున్నారు. ఇప్పటికే పవన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News May 2, 2024

బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

image

ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణ కార్యాలయంలో సాధారణ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియను పరిశీలించిన గురువారం జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ డా జి.సృజన కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి భార్గవ తేజతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇచ్చిన సమయం గడువులోగా ముద్రణ ముగించాలని ఆదేశించారు.

News May 2, 2024

కుప్పం మీదుగా రైళ్ల రాకపోకలు ఆలస్యం

image

కుప్పం మీదుగా బెంగళూరుకు రాకపోకలు సాగించే పలు రైలు 9వ తేదీ వరకు ఆలస్యంగా నడుస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు. కుప్పం-బంగారుపేట మార్గంలో వరదాపురం రైల్వే స్టేషన్ సమీపంలో అదనపు ట్రాక్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుప్పం మీదుగా రైలు ఆలస్యంగా నడుస్తాయని చెప్పారు. అలాగే 9వ తేదీ బెంగళూరు నుంచి కుప్పం మీదుగా జోలార్ పేట వెళ్లే పలు రైళ్లు బంగారుపేట వరకే నడుస్తాయి.

News May 2, 2024

పుట్టపర్తి మండలంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం

image

పుట్టపర్తి మండలంలోని ఇరగరాజుపల్లి వద్ద టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం నెలకొంది. గురువారం ఉదయం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రంగనాథ్ టీడీపీలోకి వెళుతున్నారనే సమాచారంతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆయనను గ్రామం వెలుపలకు పిలిచారు. అక్కడ ఆయనతో చర్చిస్తుండగా అక్కడికి వచ్చిన టీడీపీ నాయకుడు లాయర్ శ్రీనివాస్‌కు వైసీపీ నాయకులకు మధ్య వివాదం జరిగింది. స్పందించిన పోలీసులు వివాదాన్ని అణిచివేశారు.

News May 2, 2024

రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు జొన్నలగడ్డ విద్యార్థుల ఎంపిక

image

రాష్ట్రస్థాయి రెస్లింగ్ పోటీలకు జొన్నలగడ్డ జడ్పీ పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం మల్లికార్జునరావు గురువారం తెలిపారు. గత నెల 28వ తేదీన నరసరావుపేటలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో వీరు పాల్గొన్నారు. ఈనెల 3, 4 తేదీల్లో చిత్తూరు జిల్లాలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను, పీఈటీ సునీల్‌ను హెచ్ఎం, గ్రామ పెద్దలు అభినందించారు.