India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నగరానికి చెందిన సంఘ సేవకుడు డాక్టర్ మంత్రి వెంకటస్వామిని ఇంటర్నేషనల్ ఆస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు వరించింది. ఆస్ట్రో, మెడికల్, రత్నాల శాస్త్రవేత్తగా వెంకటస్వామి 4దశాబ్దాలుగా అందిస్తున్న సేవలకు గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఇంటర్నేషనల్ వేదిక్ ఆస్ట్రాలజీ ఫెడరేషన్ బృందం ప్రకటించింది. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో వెంకటస్వామికి ఈ అవార్డు అందజేస్తారు.

ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న సమస్యల గురించి చర్చించారు.

జులై 1 నుంచే పింఛన్ పెంపును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. జులై 1న ఇచ్చే రూ.4 వేలు, ఏప్రిల్ నుంచి 3 నెలలకు రూ.వెయ్యి చొప్పున కలిపి లబ్ధిదారులకు అందజేయనుంది. ఈ లెక్కన అవ్వతాతలకు జులై 1న ₹7 వేల పింఛన్ అందనుంది. ఈ పెంపుతో కర్నూలు జిల్లాలో సుమారు 2.45 లక్షలు, నంద్యాల జిల్లాలో 2.24 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 4.69 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.

ఒంగోలులోని స్పందన హాలు, కలెక్టర్ ఆఫీసు కార్యాలయాలలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు “మీకోసం” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజలు తమ సమస్యలను అధికారులకు అర్జీల ద్వారా తెలియచేయ వచ్చునని పేర్కొన్నారు. అధికారులు సదరు కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు.

శృంగవరపుకోట మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. ధర్మవరం గ్రామానికి చెందిన పి.అజయ్ కుమార్(32) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అజయ్ పెయింటర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మృతుడికి భార్య, 4 సం. పాప ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ఈ నెల 24 నుంచి నిర్వహిస్తున్నట్లు గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి శనివారం తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు జిల్లా హెడ్ క్వార్టర్స్, డివిజన్ స్థాయి అధికారులు సంబంధిత సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎమ్మార్వోలను ఆదేశించారు.

మర్రిపాడు మండలం నందవరం అటవీ ప్రాంతంలో ఏఎమ్ఆర్ గార్డెన్ వద్ద పులి కనబడిందని శనివారం స్థానికంగా కలకలం రేగింది. ఓ వ్యక్తి పులిని చూసినట్లు గ్రామస్థులకు తెలిపాడు. గ్రామస్థుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. అధికారులు అది పులి కాదని ఐన అనే జంతువు అని నిర్ధారించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అటవీశాఖ అధికారులు తెలిపారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలతో పాటు జిల్లాకు చెందిన ఇద్దరు రాష్ట్ర మంత్రులతో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శనివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముందుగా వేమిరెడ్డి నివాసానికి చేరుకున్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎంపీ వేమిరెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి సాదరస్వాగతం పలికారు. అనంతరం నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధిపై సుధీర్ఘంగా చర్చించారు.

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా 40వేల 336 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ దస్త్రంపై తొలి సంతకం చేశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు దశలవారీగా సోలార్ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు సంబంధించిన దస్త్రంపై రెండో సంతకం చేశారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో సోలార్ విద్యుత్ పథకంపై మూడో సంతకం చేశారు.

చీరాలలో యువతి హత్య ఘటన ఎంతో కలచివేసిందని ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. చీరాల మండలం ఈపురుపాలెంలో నిన్న యువతి హత్య జరిగిన ఘటనాస్థలాన్ని ఆయన పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రులను ఓదార్చి పరామర్శించారు. నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించేలా చర్యలు చేపట్టాలని ఆయన పోలీసులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.