India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అదుపుతప్పి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన కుప్పంలో చోటుచేసుకుంది. కుప్పం – క్రిష్ణగిరి జాతీయ రహదారిలోని తంబిగానిపల్లి వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభం ముక్కలు కాగా.. అదృష్టవశాత్తు విద్యుత్ వైర్లు తెగిపడలేదు. కాగా ప్రమాదంలో కారులో ఉన్నవారు స్వల్పంగా గాయపడినట్లు తెలిసింది.

గూడూరు-మిట్టాత్మకూరు ప్రధాన రహదారిపై విందూరు వద్ద కల్వర్టు కుంగింది. గూడూరు వచ్చేందుకు దగ్గర మార్గం ఇదొక్కటే కావడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ఇకనైనా స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు (నర్సీపట్నం MLA) ఈరోజు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన ఒకప్పుడు కాకినాడలో చదువుకున్న విద్యార్థే. ఈ విషయాన్ని తెలియజేస్తూ కాకినాడ పీ.ఆర్ ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ కళాశాల పూర్వ విద్యార్థి అయ్యన్నపాత్రుడు శాసనసభాపతి కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సంఘం నాయకులు తెలిపారు.

ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్య ఘటన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. అర్షద్ (37) అనే వ్యక్తి రామేశ్వరం రోడ్డు వద్ద ఉన్న మద్యం దుకాణం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో తలపై మోది హత్య చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జిల్లాలో డయేరియా నివారణకు జూలై 1 నుంచి ఆగస్ట్ 31వ తేదీ వరకు ‘స్టాప్ డయేరియా క్యాంపైన్’ నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్ ‘స్టాప్ డయేరియా క్యాంపైన్’ నిర్వహణకు అవసరమైన కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు. తాగునీటి కాలుష్యం జరగకుండా ఓవర్ హెడ్ ట్యాంక్లను పరిశీలించి క్లోరినేషన్ చర్యలు చేపట్టాలన్నారు.

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో శుక్రవారం రాకాసి అలల తాకిడికి గల్లంతైన మరో ఇద్దరు యువకుల మృతదేహాలు శనివారం ఉదయం వాడరేవు వద్ద ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. మొత్తం నలుగురు యువకులు గల్లంతు కాగా శుక్రవారం సాయంత్రమే రెండు మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకురావడం తెలిసిందే. మృతులు ఏలూరు జిల్లా దుగ్గిరాల వాసులుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు లాంఛనాలు పూర్తిచేసి మృతదేహాలను బంధువులకు అప్పగించారు.

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక దృష్టి సారించి, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.మనజీర్ జీలాని సమూన్ ఆదేశించారు. నో డయేరియా పట్ల ముందస్తు చర్యలు చేపట్టి అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. శనివారం కలెక్టరేట్లో వైద్యారోగ్యశాఖకు సంబంధించిన పలు విభాగాల అధికారులు చేపడుతున్న సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యల గురించి సమీక్షీంచారు.

2025 సంవత్సరానికి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. విపత్తు నిర్వహణ రంగంలో వ్యక్తులు, సంస్థలు చేసిన అద్భుతమైన కృషిని గుర్తించి అవార్డులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. జులై 1 నుంచి ఆగస్టు 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్తుండగా రామరాజు పల్లి వద్ద ఆయన కాన్వాయ్‌లోని వాహనాలు ఢీ కొన్నాయి. వాహన శ్రేణిలోని ఓ ఇన్నోవాను అదుపు తప్పి ఫైర్ ఇంజిన్ ఢీకొంది. అయితే ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇవాళ సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు జగన్ వెళ్తున్నారు.

అసెంబ్లీలో అత్యంత సీనియర్ సభ్యుల్లో <<13488653>>అయ్యన్నపాత్రుడు<<>> ఒకరని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ పిలుపుతో 25వ యేటనే రాజకీయాల్లోకి వచ్చి, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా తనదైన ముద్రవేశారన్నారు. ఐదేళ్లలో ఆయనపై అనేక కేసులు పెట్టినా నిలబడ్డారన్నారు. అటు ఇన్ని దశాబ్దాల్లో అయ్యన్న వాడివేడి, వాగ్దాటిని చూసిన ప్రజలు ఇక ఆయన హుందాతనం చూస్తారని పవన్ కళ్యాణ్ అన్నారు. అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్‌గా రావడం సంతోషకరమన్నారు.
Sorry, no posts matched your criteria.