India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అమలాపురంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 24వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వసంతలక్ష్మి తెలిపారు. ఆ రోజు ఉదయం 10:30 నుంచి మేళా ప్రారంభమవుతుందని చెప్పారు. పదవ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ, డిప్లమా ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు.

సభాపతి స్థానానికి ఎన్నికైన అయ్యన్నపాత్రుడికి రోడ్డు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో అక్రమ కేసుల బాధను తాను అనుభవించానన్నారు. అరెస్ట్‌చేసి 32రోజులు జైలు పెట్టినప్పుడు జరిగిన అవమానాలు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం ఎలా ఉంటాయో తెలుసనన్నారు. ఎన్ని కేసులు, ఇబ్బందులు పెట్టినా పోరాడిన అయ్యనపాత్రుడి రాజకీయ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు.

విజయనగరం జిల్లాలోని లక్కవరపుకోట మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి వర్షం కురిసింది. లక్కవరపుకోటలో అత్యధికంగా 57.2 మిల్లీమీటర్లు, నెల్లిమర్లలో 54.8 మిల్లీమీటర్లు, శృంగవరపుకోటలో 40.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి 15.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు.

నిన్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ప్రకాశం జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ ఒక్కరే ఇంగ్లిష్‌లో ప్రమాణం చేశారు. మిగతా 11 మంది తెలుగులో చేశారు. వీరందరితో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి దైవసాక్షిగా ప్రమాణం చేయించారు.

విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి అనుమానస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని గ్రామస్థులు పట్టుకున్నారు. పట్టుకున్న వ్యక్తిని విచారించగా తనది తమిళనాడు అని, అక్కడినుంచి వచ్చి ఓ గ్రామానికి చెందిన ఓ పాపను కిడ్నాప్ చేశానని… తనను పోలీసులు తరమడంతో ఆ పాపను వ్యాన్ లో వదిలేసి అక్కడకు వచ్చినట్లు తెలిపాడు. అతనిని గ్రామస్థులు పోలీసులకు అప్పజెప్పారు. పోలీసుల విచారణలో అసలు విషయాలు తెలియాల్సి ఉంది.

ఈనెల 25న సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 12:30 గంటలకు పీఈఎస్ మెడికల్ కళాశాలకు చేరుకుంటారు. పట్టణంలో ఒంటిగంటకు అన్న క్యాంటీన్ ప్రారంభిస్తారు. 1.30 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బహిరంగ సమావేశంలో మాట్లాడుతారు. 3:30 కి పీఈఎస్ ఆడిటోరియంలో జిల్లా, నియోజకవర్గస్థాయి అధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఆర్ & బి గెస్ట్ హౌస్‌లో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టైగర్ కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి ఆవుల చంద్రశేఖర్ శనివారం తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర అటవీ శాఖకు పంపించింది. ఇటు శేషాచల అడవుల నుంచి నల్లమల మధ్య ఉన్న తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుతూ కారిడార్ ఏర్పడనుంది. జిల్లాలో రాపూరు, వెంకటగిరి, ఉదయగిరి, ఆత్మకూరు రేంజ్ పరిధిలో ఈ కారిడార్ ఏర్పడనుంది.

అసెంబ్లీ సమావేశాలు 2వ రోజు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో అనేక పనులు చేపట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు సైతం పూర్తిచేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రస్తావించారు. కాగా ఉమ్మడి ప.గో. జిల్లా సహా.. రాష్ట్ర ప్రజలు పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం ఎదురుచూస్తున్న వేళ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

విశాఖ నగరం ఎండాడ వద్ద గల వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ జోన్-2 అధికారులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా స్థల సేకరణ చేశారని ఆ నోటీసులో పేర్కొన్నారు. అనుమతులు లేకుండా అడ్డగోలుగా భవన నిర్మాణం చేశారని అధికారులు తెలిపారు. వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల నాయకత్వంపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్‌కి ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరగలేదన్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అనుచరగణం అభ్యర్థుల ఎంపికలో క్విడ్ ప్రోకో మాదిరిగా వ్యవహరించిందని మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.