Andhra Pradesh

News May 2, 2024

వైసీసీ నుంచి వడమాలపేట ZPTC సస్పెండ్

image

నగరి నియోజకవర్గం వడమాలపేట ZPTC మురళి రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడినట్లు ఫిర్యాదు అదడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అతనిపై అభియోగాలు వాస్తవమని క్రమశిక్షణ కమిటీ ధ్రువీకరించడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అలాగే అతని పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.

News May 2, 2024

రూ.24 లక్షలు ఇప్పిస్తా: ఆది నారాయణ రెడ్డి

image

తాను MLAగా గెలిస్తే రాజోలు ప్రాజెక్టులో భూ నిర్వాసితులకు రూ.24 లక్షలు, గండికోట భూ నిర్వాసితులకు రూ.12లక్షలు పరిహారం ఇస్తానని హామీ ఇచ్చారు. పెద్దముడియం మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లకు రిపేర్లు ఉన్నాయా, తాగునీరు, సాగునీరు, ఇళ్లు, డ్రిప్ ఇలా ఏ ఒక్కటైనా చేశావా’ అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

News May 2, 2024

గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌కు టీడీపీ కీలక పదవి

image

గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌కు రాష్ట్రస్థాయి పదవి దక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు జితేంద్ర గౌడ్‌కు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడిగా నియమించింది. గుంతకల్లు టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఆయనను తప్పించి గుమ్మనూరు జయరాంకు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జితేంద్రగౌడ్‌కు రాష్ట్రస్థాయి పదవి దక్కడంతో నియోజకవర్గ టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News May 2, 2024

రేపే నెల్లూరులో చంద్రబాబు, పవన్ రోడ్ షో

image

నెల్లూరు నగరానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం రానున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా వారు రోడ్ షోలో పాల్గొంటారు. స్థానిక కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి ఆర్టీసీ మీదుగా మద్రాసు బస్టాండు, వీఆర్సీ వరకు వారు రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

News May 2, 2024

కృష్ణా జిల్లా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఇవే

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 4, 5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించనున్నారు.
* జిల్లా స్థాయిలో మచిలీపట్నంలోని పాండురంగ హైస్కూల్
* నియోజకవర్గ స్థాయిలో గన్నవరం బాయ్స్ జడ్పీ హైస్కూల్
* గుడివాడ ఇంజినీరింగ్ కాలేజ్
* పెడన వాసవీ ఇంజినీరింగ్ కాలేజ్
* మచిలీపట్నం నోబుల్ కాలేజ్
* అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్,
* పామర్రు జడ్పీ హైస్కూల్
* పెనమలూరు జడ్పీ హైస్కూల్

News May 2, 2024

ఎన్నికలకు సన్నద్ధం కావాలి: ఎన్నికల అధికారి

image

ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని విధాల సన్నద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఆయా రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. నోడల్ టీమ్‌లు సమన్వయ సహకారాలతో అప్రమత్తంగా ఉంటూ పనులను పూర్తి చేయాలన్నారు.

News May 2, 2024

ప్రశాంత ఎన్నికలే ధ్యేయం: ఎస్పీ

image

మండల కేంద్రమైన వెలుగోడులో బుధవారం కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులతో కలిసి ఎస్పీ కవాతు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే పోలీసుల ధ్యేయం అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజల భద్రతకు భరోసా కల్పించడం కోసం కవాతు నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

News May 2, 2024

సారవకోట: శతాధిక వృద్ధురాలి మృతి

image

సారవకోట మండలం కుమ్మరి గుంట గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు యాళ్ల సీతారావమ్మ (104) బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఈమె స్వయాన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పెద్దతల్లి. ఈమె మృతితో ధర్మాన కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈమె అంత్యక్రియలను గురువారం ఉదయం నిర్వహిస్తామని బంధువులు తెలిపారు.

News May 2, 2024

అనకాపల్లి: రెండో విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ

image

అనకాపల్లి జిల్లాలో ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ రవి సుభాశ్ ఆధ్వర్యంలో ఎన్నికల పరిశీలకులు దల్జీత్ సింగ్ మంగత్, రాకేశ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థులు, వారి ఏజెంట్లు హాజరయ్యారు. రెండో విడతలో కంప్యూటర్ ద్వారా ర్యాండమైజేషన్, బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ వీవీ ప్యాట్లను అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ కేంద్రాలకు కేటాయించారు.

News May 2, 2024

ప్రకాశం: ఎన్నికల విధులపై ఎస్పీ దిశానిర్దేశం

image

జిల్లా పోలీస్ సిబ్బంది సమన్వయంతో ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని ఎస్పీ గరుడ్ సుమిత్ సూచించారు. జిల్లాకు కేటాయించిన CAPF అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో నిర్వహించాల్సిన విధుల గురించి దిశానిర్దేశం చేశారు. అలాగే అక్రమ నగదు, మద్యం, ప్రలోభ వస్తువులకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.