India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలకేంద్రంలోని స్థానిక మైత్రికాలనీలో గొండు రమేష్(38) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. ఇతనికి మూడేళ్ల పాప, రెండు నెలల బాబు ఉన్నారు. కార్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబపోషణ చేసేవారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు వేడుకుంటున్నారు.

జిల్లాలో వర్షం కోసం అన్నదాతలు ఎదురుచూపులు చూస్తున్నారు. సాగు కోసం అన్ని సమకూర్చి సిద్ధంగా ఉన్నప్పటికీ అనుకూలమైన వర్షం పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆర్బీకేల ద్వారా విత్తనాలు సరఫరా చేస్తున్న తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. గడిచిన నాలుగు రోజుల నుంచి 35- 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వర్షం కురిసిన తడి ఆవిరవుతుందని రైతులు వాపోతున్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. మెంటాడ మం. కొంపంగికి చెందిన త్రినాథ్ కుటుంబంతో తాడేపల్లిగూడెంలో నివాసముంటున్నాడు. అక్కడే చెప్పుల షాప్‌లో పనిచేస్తూ భార్య అశ్విని(26), ఇద్దరు పిల్లలను పోషించేవాడు. గజపతినగరంలో సొంతంగా షాప్ పెడదామని కుటుంబంతో వ్యాన్‌లో బయలుదేరాడు. శుక్రవారం చెల్లూరు వద్ద వ్యాన్ బోల్తా పడగా అశ్విని తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందింది.

తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల(D) రాజోలి ప్రాంత వాసులు ఆంధ్రా సరిహద్దుల్లో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. మా ప్రాంతంలో చేస్తున్నామని రాజోలి వాసులు..ఏపీ సరిహద్దులో జరుగుతున్నాయని అధికారుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో మైనింగ్, పోలీసు, రెవెన్యూ అధికారులు రాజోలి వద్ద రవాణా చేస్తున్న 51ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. ఫైన్ వసూలుచేసి ట్రాక్టర్‌లు విడుదల చేసినట్లు తెలిపారు.

కనెక్ట్ టు ఆంధ్రాకు దేవీ సీఫుడ్స్ సంస్థ రూ.5 కోట్ల విరాళాన్ని అందించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిమిత్తం ఈ మొత్తాన్ని అందించినట్లు తెలిపింది. రూ.5 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కును సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పోట్రు బ్రహ్మానందం శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి అందించారు.

నెల్లూరులోని డీకే డబ్ల్యూ డిగ్రీ కళాశాలలో ఈ నెల 24న జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ గిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ మేళాలో ఈ సంవత్సరం డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు కూడా పాల్గొనవచ్చని చెప్పారు. చెన్నై, శ్రీసిటీలోని పలు కంపెనీలు ఇందులో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు.

పరవాడ మండలం గొర్లివానిపాలెం JNNURM కాలనీలో నివాసం ఉంటున్న వ్యక్తి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీ.అప్పారావు కుమారుడు చంద్రశేఖర్ (47) తల్లితో కలిసి కాలనీలో నివాసం ఉంటూ ఫార్మా కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న తాగడానికి తల్లి డబ్బులు ఇవ్వలేదని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అదృశ్యమైన చంద్రశేఖర్ శుక్రవారం కాలనీ సమీపంలో చెరువు వద్ద శవమై కనిపించాడు.

జిల్లాలో ఇసుక నిల్వలను మైన్స్ శాఖ అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. ప్రస్తుతం 44 వేల టన్నుల నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఒంగోలు, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, జరుగుమల్లిలో ఇసుక నిల్వ కేంద్రాలు ఉన్నాయి. ఒంగోలు మార్కెట్ యార్డులోని ఇసుక నిల్వ కేంద్రం, జరుగుమల్లిలో రెండు కేంద్రాలలో మొత్తం 44 వేల టన్నులు ఇసుక ఉన్నట్లు జిల్లా మైనింగ్ అధికారి జగన్నాథరావు చెప్పారు.

ప్రియుడి ఇంటిముందు న్యాయం కోసం ప్రియురాలు నిరసనకు దిగిన ఘటన సోంపేట మండలంలో జరిగింది. రాజాం గ్రామానికి చెందిన డొక్కరి చిరంజీవి తనని ప్రేమించి, పెళ్లిచేసుకుంటానని నమ్మించి వేరే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడని మందస మండలం జిళ్లందకు చెందిన ఓ యువతి తెలిపింది. శుక్రవారం ప్రియుడి ఇంటి ఎదుట నిరసన తెలిపింది. తనకు న్యాయం చేసి ఆదుకోవాలని వేడుకుంది. ఈ మేరకు మందస పోలీసులకు ఫిర్యాదుచేసింది

భార్యను భర్త కిరాతకంగా హత్య చేసిన దారుణ ఘటన శనివారం కురబలకోట మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని లక్కసముద్రం గ్రామం, మేకలవారిపల్లెకు చెందిన లక్ష్మిరెడ్డి రాత్రి మద్యం తాగొచ్చి భార్యతో గొడవపడ్డాడు. ఆగ్రహించిన భర్త భార్యను కొడవలితో అతి కిరాతకంగా నరికి చంపేశాడు. విషయం తెలుసుకున్న ముదివేడు పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.