India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తిరుపతి శ్రీవేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి శాస్త్రి, ఆచార్య, డిప్లొమా, సర్టిఫికెట్ మొదలైన 21 విభాగాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈనెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు రిజిస్ట్రార్ రాఘవేంద్ర త్రిపాఠి పేర్కొన్నారు. అర్హత, ఇతర వివరాలకు svvedicuniversity.ac.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 30.

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల నాయకత్వంపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్‌కి ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంటలు సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల ఎన్నిక పారదర్శకంగా జరగలేదన్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అనుచరగణం అభ్యర్థుల ఎంపికలో క్విడ్ ప్రోకో మాదిరిగా వ్యవహరించారని మండిపడ్డారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నాగులుప్పలపాడు మండలంలోని కోల్డ్ స్టోరేజ్ సమీపంలో 216 జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై బ్రహ్మనాయుడు వివరాల మేరకు వేటపాలెం మండలం రావురు గ్రామానికి చెందిన ఎండ్లూరి ఎలీషా(45) ఉప్పుగుండూరు నుంచి బైక్‌పై ఒంగోలు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

అట్లూరు మండల పరిధిలోని క్రాస్ రోడ్లో నివాసముండే నాగమునయ్య యాదవ్‌పై అదే గ్రామానికి చెందిన రెడ్డయ్య తన వర్గంతో దాడి చేసినట్లు బాధితుడు తెలిపారు. ఈ దాడిలో నాగమునయ్య తలకి గాయమైంది. వెంటనే అంబులెన్స్‌లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు రాజకీయ కక్షలే కారణం అని పోలీసులు అంచనా వేస్తున్నారు.

విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు శనివారం బయలుదేరాల్సిన వందే భారత్ రైలును రీ షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 5:45 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు ఉదయం 10 గంటలకు బయలుదేరుతుందని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సీ-9 కోచ్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా రీ షెడ్యూల్ చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఈ మేరకు శుక్రవారం 1400 నుంచి 1642 మధ్య ర్యాంకు విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించగా 474 మందికి 230 మంది హాజరయ్యారు. ఇందులో 113 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. ఇప్పటివరకు 502 మందికి ప్రవేశాలు కల్పించారు. శనివారం 1874 నుంచి 2083 మధ్య కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

అసెంబ్లీలో ఆచంట ఎమ్మెల్యేగా పితాని సత్యనారాయణ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా శుక్రవారం ఆయన అనివార్య కారణాలతో అసెంబ్లీకి రాని విషయం తెలిసిందే. ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 మంది ఎమ్మెల్యేలలో 14 మంది నిన్న ప్రమాణస్వీకారం చేశారు.

పట్టణ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మున్సిపల్ రోడ్డులోని చెట్టు కింద శుక్రవారం అపస్మారక స్థితిలో ఓ వ్యక్తి పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు వెంటనే 108 సహాయంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి వయసు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటుందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ సంతకం ఫోర్జరీకి గురైంది. ఈ కేసులో టౌన్ ప్లానింగ్ అధికారులు బి.ప్రవీణ్, ఎం.దేవేంద్ర, సచివాలయ వార్డు ప్లానింగ్ కార్యదర్శులు పి.నాగేంద్ర బాబు, కార్తీక్ మాలవ్యను కమిషనర్ సస్పెండ్ చేశారు. ఆరోపణపై షోకాష్ నోటీసులు జారీ చేసినా..వివరణ సరిపోలలేదని కమిషనర్ తెలిపారు. వీరితో పాటు ఎల్‌టీపీ దిలీప్ కుమార్‌కు నోటీసులు ఇచ్చారు. వివరణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.

త్రిపురాంతకం మండలం ముడివేముల గ్రామ VRO బోర్ర తిరుమలయ్య(52) గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఛాతిలో నొప్పి రావడంతో సిబ్బందికి తెలియజేశారు. సిబ్బంది వెంటనే 108 సహాయంతో వైద్యశాలకు తరలిస్తున్న సమయంలో మృతి చెందినట్లు తెలిపారు. తోటి ఉద్యోగి మృతి చెందడంతో ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు.
Sorry, no posts matched your criteria.