India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

2021, 22, 23, 24 సంవత్సరాలలో డిప్లొమా, ITI పాసైనవారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నైపుణ్య శిక్షణ & ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ నెల 28లోపు రిజిస్టర్ చేసుకోవాలని APSSDC సూచించింది. ఎంపికైనవారికి 45 రోజులపాటు ఉచిత శిక్షణ అందించి తిరుపతిలోని శ్రీసిటీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామంది. పూర్తి వివరాలకు APSSDC వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించింది.

అసెంబ్లీ ఛాంబర్‌లో వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తినీ ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ.. ఓడిపోయినందుకు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, ప్రజా సమస్యలపై పోరాటం సాగించాలని కోరినట్లు ఎమ్మెల్సీ తెలిపారు. పార్టీకి అన్నివేళలా అందుబాటులో ఉంటామన్నారు.

పెరుగుతున్న కూరగాయల ధరలపై కలెక్టరేట్‌లో విశాఖ జేసీ వివిధ శాఖల అధికారులు, వ్యాపారులతో సమీక్ష నిర్వహించారు. టమాటో, ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి కారణంగా టమాటో దిగుబడి తగ్గినట్లు అధికారులు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. మార్కెటింగ్ శాఖ జిల్లాకు కేటాయించిన రివాల్వింగ్ ఫండ్‌తో ఇతర జిల్లాల నుంచి టమాటా, ఉల్లి కొనుగోలు చేసి తక్కువ ధరలకు వినియోగదారులకు అందించాలన్నారు.

ఈనెల 29న గుంటూరు జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోపం జిల్లా అంతటా లోక్ అదాలత్ బెంచెస్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ బెంచెస్ ద్వారా సివిల్ కేసులు, రాజీపడే క్రిమినల్ కేసులు, వివాహ కేసులు, పరిష్కరించనున్నట్టు పేర్కొన్నారు.

రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమలరావును కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో నెలకొన్న శాంతిభద్రతల గురించిన నూతన డీజీపీకి ఎస్పీ వివరించారు.

మహానంది పుణ్యక్షేత్రంలోని పార్వతిపురం టోల్‌గేట్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. చిరుత సంచారంతో భక్తులు, గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. మరోసారి చిరుత సంచారంతో ఆ మార్గంలో నడిచే భక్తులు, స్థానికులు భయపడుతున్నారు. వారం రోజులుగా చిరుత పులి మహానందిలో సంచరిస్తోందని, టోల్‌గేట్ సమీపంలో చిరుత పులి రోడ్డు దాటుతుండగా చూశామని అక్కడి స్థానికులు తెలిపారు.

ద్రోణి ప్రభావంతో శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రైతులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో ప్రాక్ శాస్త్రి (Praak Shastri) కోర్సులో ప్రవేశాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ కోర్సుకు ఎంపికైన వారి జాబితాను శుక్రవారం విడుదల చేసినట్లు అకడమిక్ డీన్ ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://nsktu.ac.in/ వెబ్ సైట్ ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాను తెలుసుకోవచ్చని సూచించారు.

జిల్లాలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశపు మందిరంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి క్రీడా ప్రాంగణాల ఏర్పాటుపై సమీక్షించారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో క్రీడాకారులు, ప్రజల సౌకర్యార్థం కేలో ఇండియా ప్రాజెక్ట్ ద్వారా క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

చిత్తూరు: ఇరువరంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) నందు APSSDC, PMKV సంయుక్త ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఎలక్ట్రిషన్, అసిస్టెంట్ ప్లంబర్ కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు సెంటర్ ఏడీ సతీశ్ చంద్ర పేర్కొన్నారు. పదో తరగతి పాసై, 15-45 సంవత్సరంలోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు PH కాలనీ వద్ద గల NAC కార్యాలయంలో సంప్రదించగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 28.
Sorry, no posts matched your criteria.