Andhra Pradesh

News June 21, 2024

కాకినాడ: బాధితులకు సెల్ ఫోన్లను అందజేసిన జిల్లా ఎస్పీ

image

కాకినాడ జిల్లాలో ప్రజలు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు శుక్రవారం కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ అందజేశారు. మొబైల్ ట్రాకింగ్ కాకినాడ పోలీస్ వెబ్సైట్లో నమోదు చేసుకున్న బాధితుల వివరాల మేరకు రికవరీ చేసి అందిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. మొబైల్ ఐఎంఈఐ నంబర్లు బ్లాక్ అయిన తరువాత మొబైల్‌ను ట్రాక్ చేసి పట్టుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

News June 21, 2024

అద్దంకి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

అద్దంకి మండలం వెంకటాపురం జాతీయ రహదారి వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రేణింగవరం వైపు సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో అతను మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 21, 2024

తిరుపతి: M.Tech ఫలితాలు విడుదల

image

తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ (SPMVV)లో ఈ ఏడాది ఫిబ్రవరిలో M.Tech మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలైనట్టు మహిళా యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారిణి పేర్కొన్నారు. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News June 21, 2024

పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు జాబ్ మేళా..

image

పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా ఉపాధి కల్పనా సంస్థ సంయుక్త సహకారంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. శ్యాంబాబు తెలిపారు. 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు ఉండి, పాలిటెక్నిక్, బీటెక్, డిగ్రీ అర్హతలు గల అభ్యర్థులు ముందుగా gdcplkd.ac.in వెబ్‌సైట్లో పేరు నమోదు చేసుకొని పాస్ ఫోటో, బయోడేటా, అర్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.

News June 21, 2024

అభివృద్ధికి జట్టుగా పని చేద్దాం: ఎంపీ రామ్మోహన్

image

శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలుగా ఎన్నికై శుక్రవారం శాసనసభలో ప్రమాణస్వీకారం చేసిన నాయకులకు ఎంపీ రామ్మోహన్ అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ఒక జట్టులా కృషిచేద్దామంటూ రామ్మోహన్నాయుడు జిల్లా నుంచి ఎన్నికైన వారికి X (ట్విటర్)లో ట్వీట్ చేశారు.

News June 21, 2024

హత్య ఘటనా స్థలిని పరిశీలించిన ఐజీ

image

బాపట్ల జిల్లా ఈపురుపాలెం గ్రామంలో జరిగిన యువతి హత్య ఘటనా స్థలిని గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ఠ త్రిపాఠి పరిశీలించారు. సంఘటన జరిగిన పరిసరాలను పరిశీలించి ఆధారాలను సేకరించి వెంటనే నిందితులను అదుపులోకి తీసుకోవాలని జిల్లా పోలీసులను ఆదేశించారు. కేసు దర్యాప్తును అన్ని కోణాల్లో పరిశీలించాలని సూచించారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

News June 21, 2024

సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

డయేరియా, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పట్టణాల్లో, గ్రామాల్లో మంచినీటి సరఫరా సక్రమంగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ బాధ్యతగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం తన కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పైపులైన్లకు లీకేజీలు ఏర్పడితే వెంటనే మరమ్మతులు చేయాలని, క్లోరినేషన్ సక్రమంగా నిర్వహించాలని అన్నారు.

News June 21, 2024

కడప: నీట్‌లో సీటు రాలేదని యువతి ఆత్మహత్యాయత్నం

image

నీట్‌లో సీటు రాలేదని యువతి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. చిట్వేలి మండల కేంద్రంలో నివాసం ఉంటున్న మల్లెంపల్లికి చెందిన నారాయణ కుమార్తె సృజన నీట్‌లో సీటు రాలేదని శుక్రవారం రాత్రి గుంజన నది బ్రిడ్జి పైనుంచి దూకింది. విషయం తెలుసుకున్న చిట్వేలి ఎస్సై సుధాకర్, సిబ్బంది అంబులెన్సులో ఎక్కించి చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 21, 2024

విశాఖ: ‘పార్సెల్ సర్వీస్ ఏజెన్సీల ద్వారా గంజాయి రవాణా జరిగితే చర్యలు’

image

పార్సెల్ సర్వీస్ ఏజెన్సీల ద్వారా తెలియకుండా గంజాయి రవాణా జరిగినా సంబంధిత ఏజెన్సీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సెబ్ ఏడీసీపీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిరోధానికి వందరోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా నగరంలోని పార్సెల్ సర్వీస్ ఏజెన్సీల ప్రతినిధులతో నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. మాదకద్రవ్యాల రవాణా నేరమని హెచ్చరించారు.

News June 21, 2024

వేటపాలెం: గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

image

వేటపాలెం మండలం రామాపురం తీరం వద్ద నలుగురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. మృతులు ఏలూరు జిల్లా దుగ్గిరాలకి చెందిన నలుగురు యువకులుగా పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్ళతో గాలింపు చర్యలు చేపట్టగా ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికి తీశారు. మృతి చెందిన యువకులలో నితిన్ (26), అమలరాజ (27), కిషోర్ (25) మృతదేహాలు లభ్యమయ్యాయి. నాని (23) అనే యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.