India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కన్నకొడుకును తండ్రి చంపేసిన ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. CI శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ గ్రామీణ మండలం ఇంద్రపాలేనికి చెందిన అరవింద్ (26) వృత్తిరీత్యా కారుడ్రైవర్. కొంతకాలంగా మద్యం, గంజాయికి బానిసయ్యాడు. నిత్యం తల్లిదండ్రులను వేధించేవాడు. సోమవారం కూడా తండ్రితో వాగ్వాదం జరిగింది. దీంతో మంగళవారం ఉదయం తండ్రి వెంకటరమణ ఇనుపరాడ్‌తో అరవింద్‌ను బలంగా కొట్టగా చనిపోయాడు. కేసు నమోదైంది.
వైసీపీ కోవూరు MLA అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మండలంలోని కొత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా విమర్శలు చేసినట్లు ఎంపీడీఓ సాయిలహరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఏలూరు జిల్లాలో ఇంటర్ పాసైన విద్యార్థులకు డీఈవో అబ్రహం మంగళవారం శుభవార్త తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. DEECET-2024 ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది మే 9 వరకు ఈ పరీక్షకై ఆన్లైన్ ద్వారా https://cse.ap. gov.in & https://cse.apdeecet.apcfss.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఇవే వెబ్‌సైట్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
వాల్తేర్ డివిజన్ పరిధిలో తూర్పు కోస్తా రైల్వేలో 210 అదనపు కోచ్‌లను ఏప్రిల్ నెలలో రైళ్లకు జత చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ తెలిపారు. వేసవి రద్దీని పరిశీలిస్తూ మార్చిలో 124 కోచ్‌లు జత చేశామని, వీటి ఫలితంగా 23, 500 అదనపు వసతి అందుబాటులోనికి తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. దీంతోపాటు జన ఆహార్, ప్రాథమిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం మండపేటలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మండపేటలో పలుచోట్ల వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు టౌన్ సీఐ అఖిల్ జమ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి వాహనాల దారి మళ్లింపు ఉంటుందని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండపేట రాక సందర్భంగా టౌన్ లోనికి ఏ విధమైన భారీ వాహనాలు రావద్దని కోరారు. వాహనదారులు బైపాస్ రోడ్‌లో వెళ్లాలని సూచించారు.
శ్రీకాకుళం జిల్లాలో ఈవీఎం వేర్‌హౌస్‌ను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ మంగళవారం తనిఖీలు చేశారు. నెలవారీ తనిఖీలో భాగంగా ఈవీఎం వేర్‌హౌస్ ను ఆయన పరిశీలించి, వివరాలను నోడల్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, ఈవీఎం నోడల్ అధికారి, తదితరులు ఉన్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం ఏలూరు జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులతో కలిసి ఎస్పీ మేరీ ప్రశాంతి హెలికాప్టర్ దిగడానికి CRR రెడ్డి కళాశాల నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను పరిశీలించారు. భద్రతా పరమైనటువంటి అంశాలతో అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆమె వెంట జిల్లా అదనపు ఎస్పీ స్వరూప రాణి, తదితరులు ఉన్నారు
అమలాపురం పార్లమెంట్ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. వైసీపీ అభ్యర్థిగా రాపాక వరప్రసాదరావు, కాంగ్రెస్ అభ్యర్థిగా గౌతమ్ జంగా, బీఎస్పీ అభ్యర్థిగా యాళ్ల దొరబాబు, టీడీపీ అభ్యర్థిగా జీఎం హరీష్ బాలయోగితో పాటు మరో 10 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. వీరిలో గెలిచేదెవరో కామెంట్ చేయండి
ఓటర్ స్లిప్‌లను 4 రోజులలోపు పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా జి.సృజన సంబంధిత అధికారులను టెలీ కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. మంగళవారం ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్, పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు, ఈవిఎమ్ కమిషనింగ్, పెన్షన్ పంపిణీ తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన అంశాలపై పోలీస్ అబ్జర్వర్‌కు ఫిర్యాదు చేయవచ్చునని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా నియమించిన పోలీస్ అబ్జర్వర్‌కు చెందిన 9502846080 ఫోన్ నంబర్‌కు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల లోపు నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని ఆయన పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.